1996 “దైవిక శాంతి సందేశకులు” సమావేశం
పూర్వకాలంలో యెహోవా ప్రజలు సంవత్సరానికి మూడు ముఖ్యమైన పండుగలను జరుపుకునేవారు. అదేవిధంగా, ఆధునిక కాలంలో యెహోవా నామం గల ప్రజలు సంవత్సరానికి మూడుసార్లు పండుగలాంటి సందర్భాల్లో కలుసుకుంటారు. ఒక రోజు ప్రత్యేక సమావేశ దినానికీ, రెండు దినాల ప్రాంతీయ సమావేశానికీ, మూడు లేక నాలుగు దినాల జిల్లా సమావేశానికి కూడుకునేందుకు వారు ఆనందిస్తారు. ఈ సంవత్సరం, జిల్లా సమావేశ అంశం “దైవిక శాంతి సందేశకులు.”
ఈ అంశం ఎంత సబబుగా ఉందో కదా! మన దేవుడైన యెహోవా “సమాధానకర్తయగు దేవుడు,” అవును “సమాధానాన్నిచ్చే దేవుడు.” మన నాయకుడైన యేసుక్రీస్తు, “సమాధానకర్త” మరి యెహోవా సేవకులు ఆందించే సమాచారం దైవిక శాంతి సందేశం. (ఫిలిప్పీయులు 4:9; రోమీయులు 15:33, NW; యెషయా 9:6; నహూము 1:15) దైవిక శాంతికి గల ప్రాముఖ్యతను అందరూ మరింత గుణగ్రహించేలా సహాయపడేందుకు ఓ చక్కని సమావేశ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.
ఈ సంవత్సరం కేవలం ఇండియాలోనే, 15 సమావేశాలు జరుగుతాయి. బహుశ మీకు సమీపంలోనే ఓ సమావేశం ఉండవచ్చు. మీకు సమీపంలో ఉన్న యెహోవాసాక్షులతో అది సరిగ్గా ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందన్న విషయాన్ని అడిగి తెలుసుకుని ఆ తర్వాత హాజర్యయ్యే ప్రయత్నం ఎందుకు చేయకూడదు? నిజమైన, శాశ్వత శాంతియందు ఆసక్తి ఉన్నవారందరూ అనురాగంతో కూడిన ఆహ్వానాన్ని పొందుతారు.