కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w92 8/1 పేజీలు 18-22
  • “అంత్యకాలములో” మెలకువగా ఉండుము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “అంత్యకాలములో” మెలకువగా ఉండుము
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరధ్యానమును ఎదిరించుము
  • చిత్తశుద్ధితో ప్రార్థించుము
  • దేవుని సంస్థకు, దాని పనికి హత్తుకొనియుండుము
  • స్వయం పరీక్ష చేసికొనుము
  • నెరవేర్చబడిన ప్రవచనములను ధ్యానించుము
  • మనము విశ్వాసులమైనప్పటికంటె రక్షణ మరి సమీపముగా ఉన్నది
  • ‘మెలకువగా నుండుడి’!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • యెహోవా దినము కోసం సన్నద్ధులై ఉన్నట్లు నిరూపించుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ‘మెలకువగా ఉండండి’
    మన రాజ్య పరిచర్య—2000
  • మనం మెలకువగా ఉంటున్నామా అంటే పరధ్యానం కలుగజేసేవాటిని తప్పించుకొంటున్నామా?
    మన రాజ్య పరిచర్య—1995
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
w92 8/1 పేజీలు 18-22

“అంత్యకాలములో” మెలకువగా ఉండుము

“జాగ్రత్తపడుడి, మెలకువగానుండుడి . . . ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు.”—మార్కు 13:33.

1. ఈ “అంత్యకాలములో” ఉత్తేజకరమైన సంఘటనలు వెల్లడియగుచుండగా, మనమెట్లు ప్రతిస్పందించవలెను?

ఈ “అంత్యకాలములో” ఉత్తేజకరమైన సంఘటనలు వెల్లడియగుచుండగా, క్రైస్తవులెట్లు ప్రతిస్పందించవలెను? (దానియేలు 12:4) వారు సందిగ్ధంలో వదిలివేయబడలేదు. అనేక విషయాలు చేరియున్న ప్రవచనమును యేసుక్రీస్తు చెప్పెను. అది ఈ 20వ శతాబ్దములో నెరవేరుచున్నది. 1914నుండి పెద్దయెత్తున ఈ కాలమును గుర్తించిన అనేక అంశాలను ఆయన ప్రవచించెను. “అంత్యకాలమును” గూర్చి దానియేలు చెప్పిన ప్రవచనమును ఎరిగియున్నవాడై, యేసు తన గొప్ప ప్రవచనము చెప్పి, “మెలకువగా యుండుడని” తన శిష్యులకు ఉద్బోధించెను.—లూకా 21:36.

2. ఆత్మీయముగా మెలకువ కలిగియుండు గొప్ప అవసరత ఎందుకున్నది?

2 ఎందుకు మెలకువగా యుండవలెను? ఎందుకంటె మానవ చరిత్రలోకెల్లా ఇదెంతో సంకుచిత కాలమైయున్నది. ఈ సమయములో క్రైస్తవులు ఆత్మీయ మగతలోనికి జారిపోవుట విపత్కరమై యుండును. ఉదాసీనముగా ఉండుట లేక ఐహిక విచారములచే మన హృదయములు కృంగుటకు అనుమతించినట్లయిన, మనము ప్రమాదములో ఉందుము. లూకా 21:34, 35లో యేసుక్రీస్తు మనలనిట్లు హెచ్చరించెను: “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు (వలవేయబడినట్టు NW) రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును.”

3, 4. (ఎ) దేవుని ఉగ్రతదినము ప్రజలపై అకస్మాత్తుగా “ఉరివచ్చినట్లు” వచ్చునని చెప్పుటలో యేసు భావమేమి? (బి) దేవుడు ఉరి బిగించడు గనుక, సాధారణ ప్రజలపై ఆ దినమెందుకు అనుకొనని గడియలో విరుచుకుపడును?

3 మంచి కారణముతోనే యెహోవా దినము ‘వలవేయబడినట్టు అకస్మాత్తుగా వచ్చునని’ యేసు చెప్పెను. తరచు ఈ వలను ఉచ్చువేసి, పక్షులను జంతువులను పట్టుటకు ఉపయోగింతురు. ఆ వలకు ఒక జారుముడి వేయబడును, అలా ఏదైనా దానికి తగిలినప్పుడు ఆ ముడి లాగినట్లయ్యి వల మీదపడి, అది ఆ వలలో చిక్కుకొనును. ఇదంతయు ఒక్క క్షణములో అన్నట్లు జరిగిపోవును. అదే ప్రకారము, ఆత్మీయముగా చురుకుదనము లేనివారు విస్మయమొంది దేవుని “ఉగ్రతదినమందు” పట్టుబడుదురని యేసు చెప్పెను.—సామెతలు 11:4.

4 ప్రజలకు వలబిగించువాడు యెహోవా దేవుడా? కాదు, ప్రజలు అజాగ్రత్తగా ఉన్నప్పుడు వారిని పట్టుకొని నాశనము చేయవలెనని ఆయన వేచియుండుట లేదు. అయితే ఆ దినము సాధారణ ప్రజానీకము మీద విరుచుకుపడును ఎందుకంటె వారు దేవుని రాజ్యమునకు అత్యధిక శ్రద్ధనిచ్చుటలేదు. వారిచుట్టూ జరుగుచున్న సంఘటనల భావమును లక్ష్యపెట్టక, వారు జీవన వ్యవహారములను వెంబడించుచు తమ స్వంత విధానములోనే వెళ్లుచున్నారు. అయితే ఇది దేవుని కాలనిర్ణయమును సవరించదు. లెక్కలు తీర్చుటకు ఆయన తన స్వంతనిర్ణయ కాలమును కలిగియున్నాడు. అయితే, కనికరమునుబట్టి రానైయున్న తన తీర్పును గూర్చి ఆయన మానవజాతికి తెలియజేయకుండా ఉండడు.—మార్కు 13:10.

5, 6. (ఎ) రానైయున్న తీర్పు కారణముగా, మానవ ప్రాణుల కొరకు సృష్టికర్త ప్రేమగల ఏ యేర్పాటుచేసెను, అయితే దాని సాధారణ ఫలితమేమై యుండును? (బి) మనము మెలకువగా ఉండుటకు సహాయకరముగా ఏమి పరిశీలించబడును?

5 ఈ విధముగా ముందే హెచ్చరిక చేయుట, తన సూచనార్థకమగు ఈ పీఠము పైనుండు ఇక్కడి మానవ ప్రాణుల సంక్షేమమందు శ్రద్ధకలిగియున్న మహాసృష్టికర్తయొక్క ఒక ప్రేమపూర్వక ఏర్పాటైయున్నది. (యెషయా 66:1) ఆయన పాదములు మోపబడియున్నవని చెప్పబడుచున్న ఈ భూనివాసులను ఆయన ప్రియమైన వారిగా ఎంచుచున్నాడు. కావున తన భూసంబంధమైన రాయబారులు లేక దూతలద్వారా, ఆయన వారియెదుట ఉంచబడిన సంఘటనలను గూర్చి వారిని హెచ్చరించుచున్నాడు. (2 కొరింథీయులు 5:20) హెచ్చరిక ఎంత చేయబడిననూ, వారు వలలో చిక్కుకొనినట్లుగా, వారనుకొనని గడియలో ఆ సంఘటనలు మానవ కుటుంబమునకు సంభవించును. ఎందుకు, ఎందుకనగా అనేకమంది ప్రజలు ఆత్మీయముగా నిద్రించుచున్నారు. (1 థెస్సలొనీకయులు 5:6) వారితో పోల్చినప్పుడు కేవలము కొద్దిమంది మాత్రమే ఆ హెచ్చరికను లక్ష్యపెట్టి, దేవుని నూతన లోకములోనికి రక్షింపబడుదురు.—మత్తయి 7:13, 14.

6 అట్లయిన, రక్షింపబడు వారిలో లెక్కించబడుటకు ఈ అంత్యకాలములో మనమెట్లు మెలకువగా ఉండగలము? కావలసిన సహాయమును యెహోవా దయచేయుచున్నాడు. మనము చేయగల ఏడు సంగతులను మనమిప్పుడు గమనిద్దాం.

పరధ్యానమును ఎదిరించుము

7. పరధ్యానమును గూర్చి యేసు ఏ హెచ్చరికనిచ్చెను?

7 మొదట, మనము పరధ్యానమును ఎదిరించవలెను. మత్తయి 24:42, 44లో యేసు ఇట్లనెను: “ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకయే మీరును సిద్ధముగా ఉండుడి.” యేసు ఇక్కడ ఉపయోగించిన భాష, ఈ అపాయకర కాలములో ఎంతో పరధ్యానము ఉండునని, పరధ్యానము నాశనమునకు నడుపగలదని సూచించుచున్నది. నోవహు దినములలో ప్రజలనేక సంగతులయందు మునిగియుండిరి. తత్ఫలితముగా, పరధ్యానులైన ఆ ప్రజలు జరుగుచున్న దానిని “ఎరుగక” యుండిరి, కాగా జలప్రళయమువచ్చి వారందరిని కొట్టుకొనిపోయెను. ఆ కారణంచేతనే, యేసు ఇట్లు హెచ్చరించెను: “ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును.”—మత్తయి 24:37-39.

8, 9. (ఎ) సాధారణ జీవిత విషయములు ప్రమాదకరముగా ఎట్లు మనలను పరధ్యానములో పడవేయును? (బి) యేసు మరియు పౌలు మనకే హెచ్చరికలు చేసిరి?

8 లూకా 21:34, 35లోని ఆయన హెచ్చరికను సహితము మనస్సు నందుంచుకొనుము, అక్కడ యేసు తినుట, త్రాగుట, జీవన చింతలవంటి జీవితమందలి సాధారణ విషయములనే చర్చించుచున్నాడు. ప్రభువైన యేసు శిష్యులతోపాటు మనుష్యులందరికి అవి సామాన్యమైన విషయాలే. (మార్కు 6:31 పోల్చుము.) వాటంతటవే హానికరమైన సంగతులు కాకపోవచ్చును, అయితే వాటిని అనుమతించినట్లయిన, అవి మనలను పరధ్యానులను చేయవచ్చును, వాటిలో మునిగిపోవునట్లు చేయవచ్చును, అలా మనలో ప్రమాదకరమైన ఆత్మీయ మగతను అవి కల్గించవచ్చును.

9 కాబట్టి, అత్యంత ప్రాముఖ్యమైన సంగతియగు, దైవిక అంగీకారము సంపాదించుటను మనము నిర్లక్ష్యపెట్టకూడదు. జీవితమందలి సామాన్య విషయములందు మునిగిపోవుటకు బదులు, మనలను పోషించుకొనుటకు తగిన పరిమాణములో మాత్రమే మనము వాటిని ఉపయోగించుదము. (ఫిలిప్పీయులు 3:8) రాజ్యాసక్తులకు చోటులేకుండా అవి యుండకూడదు. రోమీయులు 14:17 చెప్పునట్లుగా, “దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది.” యేసుచెప్పిన ఈ మాటలు గుర్తుంచుకొనుము: “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” (మత్తయి 6:33) ఇంకనూ, లూకా 9:62లో యేసు ఇట్లు ప్రకటించెను: “నాగటిమీద చెయ్యిపెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడుకాడు.”

10. తిన్నగా ముందున్న లక్ష్యముపై మనము మన దృష్టి నిల్పనట్లయిన ఏ ప్రమాదము ఉన్నది?

10 అలంకారార్థములో మాట్లాడినట్లయితే, మనము ఒకసారి దున్నుటకు ప్రారంభించినప్పుడు, మనము తిన్నగా వెళ్లవలెను. వెనుకకు తిరిగి చూస్తు దున్నువాడు తిన్నని చాళ్లు దున్నలేడు. అతడు సులభముగా దారితప్పును లేక ఏదో అడ్డుతగలడంతో ఆగిపోవును. వెనుకకు తిరిగిచూసి రక్షణపొందలేకపోయిన లోతు భార్యవలె మనమెన్నటికిని యుండకూడదు. మన దృష్టిని తిన్నగా మన లక్ష్యముమీదనే ఉంచుకొను అవసరత కలదు. దానిని చేయుటకు మనము పరధ్యానమును ఎదిరించవలెను.—ఆదికాండము 19:17, 26; లూకా 17:32.

చిత్తశుద్ధితో ప్రార్థించుము

11. పరధ్యానమునుగూర్చి మనలను హెచ్చరించిన పిదప యేసు దేనిని నొక్కితెల్పెను?

11 అయితే, మనము మెలకువగా ఉండుటకు మనమెంతో చేయగల ఒక సంగతి కలదు. ప్రాముఖ్యమైన ఈ రెండవ సంగతియేమనగా: చిత్తశుద్ధితో ప్రార్థించుట. సాధారణమైన జీవన చింతలద్వారా పరధ్యానులగుటను గూర్చి హెచ్చరించిన తర్వాత, యేసు ఈ సలహానిచ్చెను: “కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువగా ఉండుడి.”—లూకా 21:36.

12. ఎటువంటి ప్రార్థన అవసరము, దానివలన కలుగు ఫలితమేమిటి?

12 ఆ విధముగా, మన పరిస్థితియొక్క ప్రమాదమును గూర్చి, మెలకువగా ఉండు అవసరతనుగూర్చి మనము నిరంతరము విన్నపము చేయవలెను. కావున మనము చిత్తశుద్ధితోకూడిన యాచనలతో ప్రార్థనాపూర్వకముగా దేవునియొద్దకు వెళ్లుదము. రోమీయులు 12:12లో పౌలు ఇట్లు చెప్పుచున్నాడు: “ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి.” మరియు ఎఫెసీయులు 6:18లో మనమిట్లు చదువుదుము: “ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతివిధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు . . . , [ఆ మేరకు] పట్టుదలతో . . . మెలకువగా ఉండుడి.” పెద్దగా ఫలితముండని అల్ప విషయమని ప్రార్థనచేయుట కాదు ఇక్కడున్న విషయము. మన ఉనికియే ప్రమాదములో ఉన్నది. కాబట్టి దైవిక సహాయము కొరకు మనము చిత్తశుద్ధితో ప్రార్థించు అవసరత కలదు. (హెబ్రీయులు 5:7 పోల్చుము.) ఆ విధముగా మనలను మనము యెహోవా పక్షమున ఉంచుకొనగలము. దీనిని చేయుటలో మనకు సహాయపడుటకు, ‘ప్రతి సమయములోను విజ్ఞాపనచేయుట’ కంటె ఎక్కువ ప్రయోజనకరమైన దేదియులేదు. అప్పుడు యెహోవా మనము అప్రమత్తులమై జాగ్రత్తగాయుండునట్లు చేయును. కావున ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుట ఎంత ప్రాముఖ్యము!

దేవుని సంస్థకు, దాని పనికి హత్తుకొనియుండుము

13. మెలకువగా ఉండుటకు ఎటువంటి సహవాసము అవసరము?

13 లోకముమీదికి వచ్చు ఈ సమస్త సంగతులనుండి మనము తప్పించుకొనుటకు కోరుకొందుము. మనుష్యకుమారుని అంగీకారముగల వారిగా మనమాయన యెదుట నిలువబడుటకు ఇచ్ఛయింతుము. ఆ మేరకు మనము చేయగల మూడవ సంగతి కలదు: యెహోవా దైవపరిపాలనా సంస్థకు అవిచ్ఛిన్నముగా హత్తుకొనియుండుము. ఆ సంస్థతో మనము పూర్ణముగా సహవసించుచు, దాని కార్యకలాపములలో భాగమువహించు అవసరము కలదు. ఈ విధముగా మనము మెలకువగావున్న క్రైస్తవులుగా మనలను మనము పొరబడని రీతిలో గుర్తించుకొందుము.

14, 15. (ఎ) మెలకువగా ఉండుటకు ఏ పనిలో పాల్గొనుట మనకు సహాయము చేయును? (బి) ప్రకటించు పని ఎప్పుడు ముగించబడినదో ఎవరు తీర్మానించుదురు, మరియు మనము దానినిగూర్చి ఎట్లు భావించవలెను? (సి) మహా శ్రమల తర్వాత, జరిగింపబడిన రాజ్య ప్రచారపు పనిని వెనుదిరిగి చూచినప్పుడు మనమేమి గ్రహింతుము?

14 మనము మెలకువగా ఉండుటకు మనకు సహాయపడగల నాల్గవ సంగతి దానికి దగ్గరసంబంధము కలదైయున్నది. రానైయున్న ఈ విధానాంతమును గూర్చి ప్రజలకు హెచ్చరిక చేయుచున్న వారిమధ్య మనము ఉండవలెను. సర్వశక్తిగల దేవుడు సంకల్పించినంత మేరకు “ఈ రాజ్యసువార్త” ప్రకటించబడునంత వరకు ఈ విధానమునకు సంపూర్ణ అంతము రాదు. (మత్తయి 24:14) ప్రకటించు పని నెరవేర్చబడినదని నిర్ణయించువారు యెహోవాసాక్షులు కాదు. కేవలము యెహోవా మాత్రమే ఆ హక్కును కలిగియున్నాడు. (మార్కు 13:32, 33) మనమయితే ఎన్నటికైనను మానవులు కలిగియుండగల శ్రేష్ఠమైన ప్రభుత్వము దేవుని రాజ్యమేనని అవసరమైనంత మేరకు ప్రకటించుటకు సాధ్యమైనంత ఎక్కువ కష్టించి పనిచేయుటకు తీర్మానించుకొని యున్నాము. మనమింకను ఆ పనిలో ఉండగానే “మహాశ్రమలు” విరుచుకుపడును. (మత్తయి 24:21) సమస్త భవిష్యత్తునందు, రక్షింపబడినవారు వెనుకకు తిరిగిచూసి, యేసుక్రీస్తు అబద్ధ ప్రవక్తకాడని హృదయపూర్వకముగా రూఢిపరచుకొందురు. (ప్రకటన 19:11) ప్రకటించు పనిలో భాగము వహించువారు ఎదురుచూసిన దానికంటె మరెంతో ఎక్కువ పరిమాణములో ఆ పని నెరవేర్చబడియుండును.

15 తదనుసారంగా, దేవుని తృప్తిమేరకు ఈ పని నెరవేర్చబడిన ఆ మహత్వపూర్ణ సమయానికి, గతమందు ఏ కాలములో లేనంతమంది ప్రజలు బహుశ ఆ పనిలో భాగము వహించుచున్న వారైయుందురు. ఈ మహాగొప్ప పనిలో భాగము కలిగియున్నందుకు మనమెంత కృతజ్ఞత కలిగియుందుము! యెహోవా “యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక అందరు మారుమనుస్సు పొందవలెనని” కోరుచున్నాడని అపొస్తలుడైన పేతురు మనకు అభయమిచ్చుచున్నాడు. (2 పేతురు 3:9) కాబట్టి, సర్వశక్తిగల దేవుని చురుకైన శక్తి క్రితమెన్నటికంటె ఈనాడు మరియెక్కువగా పనిచేయుచున్నది, కాగా యెహోవాసాక్షులు ఆత్మచే నడిపించబడుచున్న ఈ కార్యమును కొనసాగించుటకు కోరుకొనుచున్నారు. కావున యెహోవా సంస్థకు దగ్గరగా హత్తుకొనియుండి, అది సర్వజనుల యెడల చేయుచున్న పరిచర్యలో పనిరద్దీని కలిగియుండుము. మెలకువగా ఉండుటకు ఇది నీకు సహాయకరముగా ఉండును.

స్వయం పరీక్ష చేసికొనుము

16. మన ప్రస్తుత ఆత్మీయ స్థితినిగూర్చి మనమెందుకు స్వయం పరీక్ష చేసికొనవలెను?

16 మెలకువగా ఉండుటకు మనము చేయగల ఐదవ సంగతి కలదు. వ్యక్తిగతంగా మనము మన ప్రస్తుత స్థితినిగూర్చి స్వయం పరీక్ష చేసికొనవలెను. క్రితమెన్నటికంటె ఇప్పుడిది మరియెక్కువ సరియైయున్నది. మనము తీర్మానపూర్వకముగా ఎవరి పక్షముగా ఉన్నామో నిరూపించుకొను అవసరత కలదు. గలతీయులు 6:4లో పౌలు ఇట్లు చెప్పెను: “ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను.” 1 థెస్సలొనీకయులు 5:6-8లోగల పౌలు మాటల కనుగుణ్యముగా స్వయం పరీక్ష చేసికొనుము: “ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొందము.”

17. స్వయం పరీక్ష చేసికొనునప్పుడు, మనమే ప్రశ్నలు వేసికొనవలెను?

17 మరి మన విషయమేమి? లేఖనముల వెలుగులో మనలను మనము పరీక్షించుకొనినప్పుడు, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొని మనము మెలకువగా యున్నట్లు కనుగొందుమా? పాత విధానమునుండి నిశ్చయముగా వేరుపరచుకొని, దాని తలంపులను ఎంతమాత్రము ఆలోచనకు తీసికొనని వ్యక్తులుగా మనమున్నామా? మనము నిజముగా దేవుని నూతనలోక ఆత్మను కలిగియున్నామా? ఈ విధానము ఎటు పోవుచున్నదను విషయములో మనము పూర్తిగా మెలకువగా ఉన్నామా? అట్లయిన, మనము దొంగలమన్నట్లు యెహోవా దినము మనలను కబళించివేయదు.—1 థెస్సలొనీకయులు 5:4.

18. మనకైమనము మరింకే ప్రశ్నలను వేసికొనవలెను, దానివలన కలుగు ఫలితమేమిటి?

18 మన స్వయం పరీక్ష మనము సుఖమైన, హాయిగొలిపే, విలాసవంతమైన, ఆహ్లాదకరమైన జీవన విధానముకొరకు కృషిచేయుచున్నట్లు వెల్లడైనట్లయిన అప్పుడు సంగతేమి? మన ఆత్మీయ నేత్రములు మగతతో, నిద్రమత్తుతో భారమైనవని మనము కనుగొన్నట్లయిన అప్పుడేమి? ఏవో లౌకిక ఊహల ననుసరించుచు, మనము స్వప్నవిహారాలు చేస్తున్నామా? అట్లయిన, మనము మేలుకొందము గాక!—1 కొరింథీయులు 15:34.

నెరవేర్చబడిన ప్రవచనములను ధ్యానించుము

19. నెరవేరగా మనము చూచిన కొన్ని ప్రవచనములు ఏమైయున్నవి?

19 మెలకువగా ఉండుటకు మనకు సహాయముచేయు ఆరవ సంగతికి మనమిప్పుడు వస్తున్నాము: ఈ అంత్యకాలమందు నెరవేరిన అనేక ప్రవచనములను ధ్యానించుము. 1914లో అన్యజనుల నిర్ణయకాలములు ముగించబడిన దగ్గరనుండి మనము ఇప్పటికే 77వ సంవత్సరాన్ని దాటాము. ఈ శతాబ్దములోని గడచిన 75 సంవత్సరాల్ని గమనిస్తే, ప్రవచనములు ఒకదాని తర్వాత మరొకటి—సత్యారాధన పునరుద్ధరింపబడుట; వారి సహవాసులతో కలిసి అభిషక్త శేషము ఆత్మీయ పరదైసులోనికి విడుదల చేయబడుట; భూవ్యాప్తముగా రాజ్యసువార్త ప్రకటింపబడుట; గొప్పసమూహము సాక్షాత్కరించుట ఎట్లు నెరవేరెనో మనము చూడగలము. (యెషయా 2:2, 3; 35వ అధ్యాయము; జెకర్యా 8:23; మత్తయి 24:14; ప్రకటన 7:9) యెహోవాయొక్క మహాగొప్ప నామము మహిమపరచుట, ఆలాగే తగినకాలమున యెహోవా త్వరపెట్టుటతో ఒంటరియైనవాడు వెయ్యిమందియగుట, ఎన్నికలేనివాడు ఒక బలమైన జనమగుటయు జరిగెను. (యెషయా 60:22; యెహెజ్కేలు 38:23) ప్రకటన వృత్తాంతమందలి అపొస్తలుడైన యోహాను దర్శనములు ఇప్పుడు వాటి చివరిస్థాయికి చేరుకొనుచున్నవి.

20. యెహోవాసాక్షులు ఏ అంగీకారమును కలిగియున్నారు, మరియు వారు నిజానికి ఎవరని నిరూపించుకొనిరి?

20 కావున, క్రితమెన్నటికంటె ఎక్కువగా యెహోవాసాక్షులు, 1914 నుండి లోకవ్యవహారములను గూర్చి తాము అర్థము చేసికొనినది సరియేనని స్థిరముగా అంగీకరింపజేయబడిరి. అటువంటి స్థిరమైన అంగీకారము గలవారిగా, వారు సర్వోన్నత దేవుని చేతియందలి సాధనములని తమనుతాము నిరూపించుకొనిరి. ఈ ప్రాముఖ్యమైన కాలములో దైవిక వర్తమానమును ప్రకటించుటకు వారికే అట్టి బాధ్యత అప్పగింపబడెను. (రోమీయులు 10:15, 18) అవును, అంత్యకాలమును గూర్చి యెహోవా పలికిన మాటలు నిజమయ్యెను. (యెషయా 55:11) దేవుడుచేసిన వాగ్దానములన్నియు యేసుక్రీస్తు ద్వారా నిజమగుటను చివరకు మనము చూచు పర్యంతము కొనసాగుటకు, ఇది మనలను పురికొల్పవలెను.

మనము విశ్వాసులమైనప్పటికంటె రక్షణ మరి సమీపముగా ఉన్నది

21. ఆత్మీయముగా మెలకువగా ఉండుటకు మనకు ఏ యేడవ సహాయము అవసరము?

21 చివరిగా, మనము మెలకువగా ఉండుటకు మనకు సహాయపడు ఏడవ సంగతేమనగా: మనము విశ్వాసులమైనప్పటికంటె రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నదని ఎల్లప్పుడు మనస్సు నందుంచుకొనుము. ఎంతో ప్రాముఖ్యముగా, యెహోవా విశ్వ సార్వభౌమాధిపత్యమును మహిమపరచుట, ఆయన నామమును పరిశుద్ధపరచుట మరియెక్కువగా సమీపమైనవి. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాయుచున్నాడు: “మీరు కాలమునెరిగి, నిద్రమేలుకొను వేళయైనదని తెలిసికొని, ఆలాగు చేయుడి. మనము విశ్వాసుల మైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది.”—రోమీయులు 13:11, 12.

22. సమీపమైన మనరక్షణ మనపై ఎట్లు ప్రభావము చూపవలెను?

22 రక్షణ మనకు మరి సమీపమైనందున, మనము మెలకువగా ఉండవలెను. ఈ అంత్యకాలములో తన ప్రజల కొరకు యెహోవా చేయుచున్న దానియెడల మనకుగల మెప్పుకంటె, మన ఎటువంటి వ్యక్తిగత లేక లౌకిక శ్రద్ధలైనను ఎక్కువ ప్రాముఖ్యతగలవిగా చేయుటను మనము అనుమతించకూడదు. (దానియేలు 12:3) మనకొరకు దేవుని వాక్యము సరళముగా చెప్పుదానినుండి ఎన్నటికిని వైదొలగకుండుటకు మనము క్రితమెన్నటికంటె మరియెక్కువ పట్టుదలచూపు అవసరము కలదు. (మత్తయి 13:22) ఈ లోకము దాని అంత్యదినములలో ఉన్నదని నిదర్శనము స్పష్టముగా చూపించుచున్నది. నీతియుక్తమైన ఒక నూతన లోకమునకు స్థానము కల్పించుటకు త్వరలోనే అది శాశ్వతముగా ఉనికిలో లేకుండా తుడిచివేయబడును.—2 పేతురు 3:13.

23. ఏ విధముగా యెహోవా మనకు సహాయము చేయును, మరియు దాని దీవెనకర ఫలితమేమై యుండును?

23 కాబట్టి, మనమన్ని విషయములలో మెలకువగా ఉండవలెను. ఎప్పుడూ లేనంతగా, కాలప్రవాహములో మనమెక్కడ ఉన్నామను విషయములో అప్రమత్తముగా ఉందము. ఈ విషయములో యెహోవా ఎన్నడును నిద్రపోడని గుర్తుంచుకొనుము. రాత్రి గడచి చాలా అయ్యింది. పగలు సమీపమగుచున్నది. కాబట్టి మెలకువగా ఉండుము! భూమియెడల యెహోవా సంకల్పమును మెస్సీయ రాజ్యము నెరవేర్చునప్పుడు, కాలములన్నింటిలో అత్యంత రమ్యమైన కాలమును మనమనుభవించెదము.—ప్రకటన 21:4, 5. (w92 5/1)

మీ జవాబులేమై యున్నవి?

◻ దేవుని ఉగ్రతదినము ప్రజలపై అకస్మాత్తుగా “ఉరివచ్చినట్లు” వచ్చునని చెప్పుటలో యేసు భావమేమి?

◻ పరధ్యానమును మనమెందుకు ఎదిరించవలెను?

◻ మెలకువగా ఉండుటకుగాను ఎటువంటి ప్రార్థన అవసరము?

◻ ఎటువంటి సహవాసము అవశ్యకము?

◻ మన ఆత్మీయ స్థితినిగూర్చి స్వయం పరీక్ష ఎందుకు చేసికొనవలెను?

◻ మెలకువగా నుండుటలో ప్రవచనము ఏ పాత్ర వహించును?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి