యెహోవాను ఘనపరచుము ఎందుకు మరియు ఎట్లు?
“నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు.”—1 సమూయేలు 2:30.
1. నోబెల్ బహుమతులు ఎవరికి ఇవ్వబడును, వాటిలో ఏమిచేరియుండును, మరియు అనేకులు ఈ బహుమతులను ఎట్లు దృష్టింతురు?
‘గడచిన సంవత్సరమందు మానవజాతికి అత్యంత ప్రయోజనకరమైన సేవనందించిన’ వారికి ప్రతి సంవత్సరము నాలుగు స్కాండినేవియా సంస్థలు నోబెల్ బహుమతులు ప్రదానం చేస్తాయి. ఆ బహుమతులు వివిధములైన ఆరు రంగాలలో పాటుపడిన వారికి ఇవ్వబడతాయి. నోబెల్ బహుమతి ఎవరికైనా ఇవ్వబడగల అత్యుత్తమ ఘనతగా అనేకులు పరిగణించుదురు.
2. నోబెల్ బహుమతులను ప్రదానం చేయువారు ఎవరిని అలక్ష్యం చేయుచున్నారు, మరియు ఆయనెందుకు ప్రత్యేకముగా ఘనత నొందనర్హుడు?
2 అర్హులైన మానవులకు ఘనతనిచ్చుట తప్పిదము కాకపోయినను, ఈ ఘనతనిచ్చువారు ఎప్పుడైనా మానవజాతియెడల మహాగొప్ప ప్రయోజనకారియైన వానినిగూర్చి తలంచారా? ఆ ప్రయోజనకర్త దాదాపు 6,000 సంవత్సరముల నాడు మొదటి స్త్రీపురుషులను తాను సృష్టించిన దగ్గరనుండి మానవజాతికి లెక్కలేనన్ని ప్రయోజనములు చేకూర్చెను. ఆయనను ఘనపరచుటలో తరచుగా తప్పిపోవుట ప్రాచీనకాల యోబు స్నేహితుడైన ఎలీహు మాటలను మనకు గుర్తుతెచ్చును, ఆయనిట్లనెను: “రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు, . . . నన్ను సృజించిన దేవుడు ఎక్కడ నున్నాడని అనుకొనువారెవరును లేరు.” (యోబు 35:10) మన గొప్ప ప్రయోజనకర్త ఎడతెగక ‘మేలుచేయుచు, ఆకాశమునుండి వర్షమును, ఫలవంతమైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో హృదయములను నింపుచున్నాడు.’ (అపొ. కార్యములు 14:16, 17; మత్తయి 5:45) యెహోవా నిజముగా “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన వరమును” దయచేయువాడై యున్నాడు.—యాకోబు 1:17.
ఘనతనిచ్చుట అనగా దాని భావమేమి
3. “ఘనత” అని భాషాంతరము చేయబడిన హెబ్రీ, గ్రీకు పదములేమై యున్నవి, మరియు వాటి అర్థములేమై యున్నవి?
3 ఘనతకు కావోధ్, అను హెబ్రీ పదము ఉపయోగింపబడినది, దానికి అక్షరార్థముగా “బరువైన” అని అర్థము. కావున ఘనపర్చబడు వ్యక్తి మహత్తుగల, ప్రభావము చూపగల లేక విశేషత్వముగల వానిగా పరిగణించబడును. ప్రాముఖ్యముగా, ఈ హెబ్రీపదము, కావోధ్, తరచు లేఖనములలో “మహిమ” అనికూడ తర్జుమా చేయబడినది. ఇది మరెక్కువగా ఘనపరచబడు వ్యక్తి ఎంత ప్రభావము చూపగల లేక ఎంత ప్రాముఖ్యమైన వానిగా పరిగణించబడెనో సూచించెను. మరొక హెబ్రీపదము, యెకార్, లేఖనములలో “ఘనత” అని తర్జుమా చేయబడినది. ఇది “అమూల్యమైన” మరియు “అమూల్యమైన సంగతులు” అనికూడ తర్జుమా చేయబడినది. కావున హెబ్రీ లేఖనములలో, ఘనత అను పదము మహిమకు మరియు అమూల్యతకు సంబంధమును కలిగియున్నది. బైబిలులో “ఘనత” అని తర్జుమా చేయబడిన గ్రీకు పదము టైమ్, ఇది కూడ గౌరవము, విలువ, అమూల్యత అను భావమును అందజేయుచున్నది.
4, 5. (ఎ) ఒక వ్యక్తిని ఘనపరచుట అనగా దాని భావమేమి? (బి) ఘనతనిచ్చుటలో చేరియున్నదానిని దృష్టాంతపరచు ఏ పరిస్థితి ఎస్తేరు 6:1-9లో వివరించబడినది?
4 ఆ విధముగా వ్యక్తియెడల మిక్కిలి గౌరవము మరియు ఆదరము చూపుటద్వారా ఒకడు వేరొకనిని ఘనపరచును. దృష్టాంతమునకు, నమ్మకస్థుడైన యూదుడగు మొర్దెకైనుగూర్చి బైబిలులో వివరింపబడిన పరిస్థితిని ఆలోచించుము. ప్రాచీన పారసీక రాజైన అహష్వేరోషు ప్రాణము తీయవలెనని పన్నిన కుట్రను మొర్దెకై ఒక సందర్భములో బట్టబయలుచేసెను. ఆ తర్వాత, ఒకరోజు రాత్రి రాజుకు నిద్రపట్టని సమయములో మొర్దెకైచేసిన పని ఆయన దృష్టికి తేబడెను. కావున ఆయన తన ద్వారపాలకులను ఇట్లడిగెను: “ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి యేదైనను ఘనత యేదైనను చేయబడెనా”? దానికి వారు, “అతనికేమియు చేయబడ లేదని” ప్రత్యుత్తరమిచ్చిరి. ఎంత విచారకరం! మొర్దెకై రాజు ప్రాణమును కాపాడెను, అయినను రాజు మెప్పుకోలును ప్రదర్శించుటలో తప్పిపోయెను.—ఎస్తేరు 6:1-3.
5 కావున, ఒకానొక అనుకూల సమయమున, అహష్వేరోషు ఎవరియందు రాజు సంతోషించునో ఆ మనుష్యుని ఎట్లు ఘనపరచవలెనని తన ప్రధానమంత్రియగు హామానును అడిగెను. వెంటనే హామాను, “నన్నుగాక మరి ఎవరిని రాజు ఘనపరచ నపేక్షించును”? అని తన హృదయములో తర్కించుకొనెను. కావున హామాను, ఆ వ్యక్తికి “రాజవస్త్రములు” ధరింపజేయవలెనని, “రాజు ఎక్కు గుర్రమును” ఎక్కించవలెనని చెప్పి చివరగా ఇంకను ఇట్లనెను: “రాజవీధిలో అతని నడిపించుచు—రాజు ఘనపరచ నపేక్షించువానికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలెను.” (ఎస్తేరు 6:4-9) అంతగా ఘనపరచబడువాడు ప్రజలందరిచే ఎంతో ఉన్నతముగా ఎంచబడును.
ఘనతకు యెహోవా ఎందుకు అర్హుడు
6. (ఎ) ఇతరులందరికంటే ఎవరు మన ఘనతను పొందనర్హులై యున్నారు? (బి) “మహోన్నతుడు” అను పదము యెహోవాను ఎందుకు సరిగా వర్ణించుచున్నది?
6 తరచు వారికి ఆ అర్హత లేకపోయినను చరిత్రయందంతటిలో మానవులు ఘనపరచబడిరి. (అపొ. కార్యములు 12:21-23) అయినను అందరికంటే మిన్నగా ఘనతకు ఎవరు అర్హులు? దానికి సందేహమే లేదు, యెహోవా దేవుడే! నిశ్చయముగా ఆయన మహోన్నతుడు గనుక మన ఘనతనొందు అర్హత ఆయనకు కలదు. తరచు “మహోన్నతమైన” [NW] అనుమాట ఆయనకు అన్వయించును. ఆయన మహోన్నతుడు, మహోన్నతుడైన నిర్మాణకుడు, మహోన్నతుడైన సృష్టికర్త, మహోన్నతుడైన రాజు, మహోన్నతుడైన ఉపదేశకుడు, మహోన్నతుడైన యజమాని. (కీర్తన. 48:2; ప్రసంగి 12:1; యెషయా 30:20; 42:5; 54:5; హోషేయా 12:14) మహోన్నతుడైన వాడు ఘనుడు, గౌరవనీయుడు, ఉన్నతుడు, వైభవశాలి, ప్రఖ్యాతుడు మరియు భక్తిసంభ్రమమును కల్గించువాడై యుండును. యెహోవా పోలికకు అందనివాడు, సాటిలేనివాడు, సర్వశ్రేష్ఠుడు. ఆ వాస్తవమునకు ఆయనే సాక్ష్యమిచ్చుచు ఇట్లనుచున్నాడు: “మేము సమానులమని నన్ను ఎవనికి సాటిచేయుదురు? మేము సమానులమని యెవని నాకు పోటిగా చేయుదురు?”—యెషయా 46:5.
7. కనీసము ఎన్ని వేర్వేరు విధములుగా యెహోవా దేవుడు ఉన్నతుడై యున్నాడని చెప్పవచ్చును, మరియు ఆయన అధికారము విషయములో సాటిలేనివాడని ఎందుకు చెప్పవచ్చును?
7 తక్కువలో తక్కువ ఏడు ప్రత్యేక రీతులలో యెహోవా దేవుడు సాటిలేనివాడు, అవి ఆయనను ఘనపరచు నిర్దిష్ట కారణములను అందజేయుచున్నవి. మొట్టమొదట, యెహోవా దేవుడు మహాఘనత నొందనర్హుడు ఎందుకనగా అధికారమందు ఆయన సాటిలేనివాడు. ప్రభువైన యెహోవా విశ్వ సార్వభౌమాధిపతి—ఆయనే సర్వోన్నతుడు. ఆయన మన న్యాయాధిపతి, శాసనకర్త, మరియు రాజు. భూమ్యాకాశములందలి వ్యక్తులందరు ఆయనకు జవాబుదారులు; అయినను ఆయన ఎవరికిని జవాబుదారుడు కాదు. “మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు” అని ఆయన సరిగానే వర్ణింపబడ్డాడు.—ద్వితీయోపదేశకాండము 10:17; యెషయా 33:22; దానియేలు 4:35.
8. (ఎ) ఆయన స్థానము విషయములో, (బి) ఆయన నిత్య ఉనికి విషయములో, యెహోవా అసమానుడని ఎందుకు చెప్పవచ్చును?
8 రెండవది, యెహోవా దేవుడు మహాగొప్ప ఘనత నొందనర్హుడు ఎందుకనగా ఆయన స్థానము సంబంధముగా ఆయన సాటిలేనివాడు. ఆయన “మహాఘనుడును మహోన్నతుడును” సర్వోన్నతుడునై యున్నాడు. ఆయన తన భూప్రాణులందరికంటే ఊహించశక్యముకానంత ఎత్తున ఉన్నాడు! (యెషయా 40:15; 57:15; కీర్తన 83:18) మూడవది, ఇతరులందరికంటే మిన్నగా యెహోవా దేవుడు ఘనపరచబడవలెను ఎందుకనగా ఆయన నిత్య ఉనికి విషయములో ఆయన అసమానుడు. ఆయన మాత్రమే ఆదిలేని వాడు, యుగయుగాలనుండి ఉన్నవాడు.—కీర్తన 90:2; 1 తిమోతి 1:17.
9. (ఎ) ఆయన మహిమ విషయములో, (బి) ఆయన ప్రాథమిక గుణలక్షణముల విషయములో, ఏ విధముగా యెహోవా అసమానుడు?
9 నాల్గవది, ఆయన వ్యక్తిగత మహిమ యొక్క మహత్తునుబట్టి యెహోవా దేవుడు మహాగొప్ప ఘనత నొందనర్హుడు. ఆయన “జ్యోతిర్మయుడగు తండ్రి.” వ్యక్తిగా ఆయన తేజస్సు ఎంత గొప్పదనగా ఏ మనుష్యుడును ఆయననుచూచి బ్రతుకనేరడు. ఆయన నిజముగా భయంకరుడు. (యాకోబు 1:17; నిర్గమకాండము 33:22; కీర్తన 24:10) ఐదవది, ఆయన అద్భుతమైన గుణలక్షణములను బట్టి మనము యెహోవా దేవునికి మహాగొప్ప ఘనతను రుణపడియున్నాము. ఆయన సర్వశక్తిమంతుడు, అపారమైన శక్తిగలవాడు; ఆయన సర్వజ్ఞుడు, అంతులేని జ్ఞానము గలవాడు; న్యాయమందు పరిపూర్ణత గలవాడు; మరియు ఆయన ప్రేమకే మూర్తిమంతమై యున్నాడు.—యోబు 37:23; సామెతలు 3:19; దానియేలు 4:37; 1 యోహాను 4:8.
10. (ఎ) సృష్టికార్యములు మరియు ఆయన కలిగియున్న వాటి విషయములో, (బి) ఆయన నామము మరియు ప్రతిష్ట విషయములో, యెహోవా ఏ విధముగా అసమానుడు?
10 ఆరవది, ఆయన సృష్టికార్యములను బట్టి యెహోవా దేవుడు సాధ్యమైనంత మహాగొప్ప ఘనత నొందనర్హుడై యున్నాడు. భూమ్యాకాశములయందలి సమస్తమునకు సృష్టికర్తగా, ఆయన సమస్త సంగతుల యజమానియై యున్నాడు. కీర్తన 89:11లో మనమిట్లు చదువుదుము: “ఆకాశము నీదే భూమి నీదే.” ఏడవది, అందరికంటే యెహోవా దేవుడు ఎక్కువ ఘనత నొందనర్హుడు ఎందుకంటే ఆయన నామము మరియు ప్రతిష్ట విషయములో ఆయన అసమానుడు, సాటిలేనివాడు. “సంభవింపజేయువాడు” అను అర్థముగల యెహోవా అను నామమును ఆయన మాత్రమే ధరించియున్నాడు.—ఆదికాండము 2:4 NWయొక్క పాదవచనము చూడుము.
యెహోవాను ఎట్లు ఘనపరచవలెను
11. (ఎ) మనము యెహోవాను ఘనపరచగల కొన్ని మార్గములు ఏమైయున్నవి? (బి) ఆయనయందు నమ్మకముంచుటద్వారా మనము యెహోవాను నిజముగా ఘనపరచుచున్నామని మనమెట్లు చూపించగలము?
11 యెహోవా లక్షణములన్నింటి దృష్ట్యా, ఆయనను మనమెట్లు ఘనపరచగలము? మనము చూడబోవునట్లు, ఆయనకు భయపడి, ఆయనయెడల పూజ్యభావము చూపుటద్వారా, ఆయనకు లోబడుటద్వారా, మన మార్గములన్నింటిలో ఆయనను గుర్తించుటద్వారా, అర్పణలద్వారా, ఆయనను అనుకరించుటద్వారా, మరియు ఆయనకు విన్నపములు చేయుటద్వారా మనమాయనను ఘనపరచగలము. ఆయనయందు విశ్వాసముంచుటద్వారా, ఏమి సంభవించినను ఆయనయందు నమ్మకముంచుటద్వారా కూడా మనము ఆయనను ఘనపరచగలము. “నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము” అని మనము గట్టిగా చెప్పబడియున్నాము. కావున ఆయన మాట వినుటద్వారా మనము యెహోవాను ఘనపరచుదుము. ఉదాహరణకు, ఆయనిట్లనుచున్నాడు: “భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము [భయముచే] నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే.” (సామెతలు 3:5; యెషయా 41:10) పూర్ణముగా ఆయనను నమ్మకపోవుట ఆయనను అవమానపరచుటయై యుండును.
12. విధేయత మరియు భయము యెహోవాను ఘనపరచుటలో ఏ పాత్ర వహించును?
12 మనము యెహోవాను ఘనపరచుటకు దగ్గర సంబంధముగల మార్గమేదనగా ఆయనకు విధేయులగుటయే. కాగా విధేయతకు దైవభక్తి అవశ్యకము, అవును, దేవుని అసంతోషపరచుటకు భయపడుట. అబ్రాహాము విధేయతతో తన కుమారుడైన ఇస్సాకును బలియిచ్చుటకు ప్రయత్నించినప్పుడు అబ్రాహాముతో యెహోవా పలికిన మాటలు భయము మరియు విధేయతకుగల సంబంధమును చూపుచున్నవి. “నీవు దేవునికి భయపడు వాడవని” యెహోవా అనెను. (ఆదికాండము 22:12) తలిదండ్రులకు పిల్లలు రుణపడియున్న దానిని చర్చించునప్పుడు, అపొస్తలుడైన పౌలు కూడా విధేయత మరియు ఘనత చేయిచేయిగా వెళ్లునని చూపించెను. (ఎఫెసీయులు 6:1-3) కావున భారముకాని దేవుని ఆజ్ఞలకు లోబడుటద్వారా మనము యెహోవాను ఘనపరచుదుము. నిస్సందేహముగా, యెహోవా దేవునికి అవిధేయులగుట ఆయనను అవమానపరచుటయై యుండును.—1 యోహాను 5:3.
13. దేవుని ఘనపరచుట మన కార్యములు మరియు పథకముల సంబంధముగా మనము ఏ మానసిక దృక్పధమును కలిగియుండుటకు కారణమగును?
13 అంతేకాకుండా, సామెతలు 3:6లోని సలహాను లక్ష్యపెట్టుటద్వారా మనము యెహోవా దేవునికి తగిన ఘనతను తీసుకొనిరాగలము: “నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము [అవును, ఆయనను గుర్తించుట] అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” ఈ క్రమములోనే శిష్యుడగు యాకోబు మనకు మంచి సలహాను ఇచ్చుచున్నాడు. మన స్వంత సామర్థ్యములపై ఆధారపడి అనుదినము స్వయం-నమ్మకత్వమందే కొనసాగుటకు బదులు, మనమిట్లు చెప్పుకొనబద్ధులమై యున్నాము: “ప్రభువు [యెహోవా NW] చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అది చేతము.” (యాకోబు 4:15) సంవత్సరముల క్రితము భవిష్యత్తుకు సంబంధించిన ఏ మాటకైనను అంతర్జాతీయ బైబిలు విద్యార్థులు D.V., అను పద సంక్షిప్తరూపమును ఉపయోగించుట వాడుకయైయుండెను, అది డియో వోలెన్టీ, అనగా “దేవుని చిత్తమైతే” అని భావము.
14. (ఎ) మనము దేవుని ఘనపరచవలెనంటే మన ప్రయత్నములకు సంబంధించిన ఏ దృక్పధమును మనము గైకొనవలెను? (బి) వాచ్‌టవర్ సొసైటి సాహిత్యములను ప్రచురించుట సంబంధముగా ఏ దృక్పధము ప్రదర్శింపబడెను?
14 మనకు లభించు ఏ విజయమునకైనను దేవుని కొనియాడుచు, వినయ దృక్పధమును కనబరచుటద్వారా కూడా మనము యెహోవా దేవుని ఘనపరచుదుము. తన పరిచర్య సంబంధముగా అపొస్తలుడైన పౌలు దీనిని సరిగా చెప్పెను: “నేను నాటితిని, అపొల్లో నీళ్లుపోసెను, వృద్ధి కలుగజేయు దేవునిలోనేగాని, నాటువానిలోనైనను నీళ్లుపోయు వానిలోనైనను ఏమియులేదు.” (1 కొరింథీయులు 3:6, 7) నిజముగా, పౌలు తనకు లేక వేరే మానవుడెవరికైనను కాదుగాని, దేవునికే ఘనతను తీసుకువచ్చుటలో శ్రద్ధను కలిగియుండెను. అదే విధముగా, ఈనాడు వాచ్‌టవర్ సొసైటి సాహిత్యములు వాటిని రచించువారిని గుర్తించవు, మరియు రచయితలు తాము రచించిన దానిని ఇతరులకు తెలియజేయుటకు ఇష్టపడరు. ఈ విధముగా, ఏ మానవుని కాదుగాని, యెహోవాను ఘనపరచుటకు రూపించిన సమాచారము మీద దృష్టినిల్పుట జరుగును.
15. యెహోవాసాక్షుల నమ్రతను అర్థము చేసికొనుటకు కొందరు ప్రజలు కలిగియున్న కష్టమును ఏ అనుభవము దృష్టాంతపరచుచున్నది?
15 యెహోవాను ఘనపరచుచు ఆయనపై దృష్టినిలుపు ఈ విధానము, కొందరికి ఆశ్చర్యకరముగా ఉన్నది. కొన్ని సంవత్సరముల క్రితము న్యూయార్కు నగర సెంట్రల్ పార్కులో బహిరంగ ప్రసంగమునకు సౌండ్‌సిస్టమ్‌ను ఏర్పాటుచేసి, దానిని పరీక్షించుటకు సాక్షులు కింగ్డం మెలొడీస్ టేపు విన్పించుచుండిరి. చక్కని దుస్తులు ధరించిన ఒక జంట ఆ సంగీతమేమని సాక్షులలో ఒకరిని అడుగగా, ఆ జంటకూడా సాక్షులేననుకొని అతడు అది “కింగ్డం మెలొడీస్ నెం. 4” అని సమాధానమిచ్చెను. “అదిసరే కానీ, ఆ సంగీతమును ఎవరు కూర్చారు?” అని వారడిగారు. దానికి ఆ సాక్షి, “ఓహా అదా, దానిని కూర్చినవారి పేరు తెల్పబడలేదు” అని జవాబిచ్చాడు. అందుకు ఆ జంట ప్రతిస్పందిస్తూ, “ఇంత చక్కని సంగీతమును కూర్చు ప్రజలు తమ పేరు తెలియబడనివ్వకుండా ఉండరు” అని అన్నారు. దానికి ఆ సాక్షి, “కానీ యెహోవాసాక్షులు అలాచేస్తారు” అని జవాబిచ్చెను. అవును, సమస్త ఘనత యెహోవా దేవునికే చెందునట్లు వారిట్లు చేయుదురు.
16. యెహోవా దేవునికి ఘనతను తెచ్చుటకు ఏ వివిధ మార్గములలో మన స్వరములను మనము ఉపయోగించగలము?
16 యెహోవాను ఘనపరచుటకు మరొక మార్గమేదనగా మనము ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుటకు మన పెదవులను ఉపయోగించవలెను. ఆయనకు ఘనతను తీసుకురావలెనని మనము నిజముగా శ్రద్ధ కలిగియున్నట్లయిన, మనము మనఃపూర్వకముగా రాజ్యసువార్తను వ్యాప్తిచేయుదుము. దీనిని మనము ఇంటింటికి వెళ్లుటద్వారా మరియు తటస్థముగా సాక్ష్యమిచ్చు అవకాశములను విడిచిపెట్టకుండా, మనకు అందుబాటులోగల ఇతర విధానములను ఉపయోగించుట ద్వారా చేయగలము. (యోహాను 4:6-26; అపొ. కార్యములు 5:42; 20:20) దానికితోడు, వ్యాఖ్యానించుటద్వారా, రాజ్యకీర్తనలను హృదయపూర్తిగా పాడుటద్వారా, సంఘములో మన స్వరమెత్తి దేవుని ఘనపరచు అవకాశములను మనము కలిగియున్నాము. (హెబ్రీయులు 2:12; 10:24, 25) మన దైనందిన సంభాషణలలో సహితము మన పెదవులతో మనము యెహోవా దేవుని ఘనపరచగలము. కొద్దిపాటి ప్రయత్నంతో సంభాషణను మనము ఆత్మీయ క్షేమాభివృద్ధి కలుగజేయు మార్గాలుగా మలచవచ్చును, తత్ఫలితముగా ఇది యెహోవా దేవునికి ఘనతను తీసికొనివచ్చును.—కీర్తన 145:2.
17. (ఎ) మనము యెహోవాను ఘనపరచుటలో సరియైన ప్రవర్తన ఎటువంటి పాత్రను కలిగియున్నది? (బి) చెడు ప్రవర్తన ఎటువంటి ప్రభావమును కలిగియుండును?
17 యెహోవా దేవుని మన పెదవులతో ఘనపరచునంత శ్రేష్ఠముగా, మన ప్రవర్తన ద్వారా ఆయనను ఘనపరచుట కూడా అవసరమే. దేవుని తమ పెదవులతో ఘనపరచుచు ఆయనకు తమ హృదయములను దూరముగా కలిగియున్న వారిని యేసు ఖండించెను. (మార్కు 7:6) తప్పుడు ప్రవర్తన యెహోవా దేవునికి తప్పక అవమానమును తెచ్చును. ఉదాహరణకు, రోమీయులు 2:23, 24లో మనమిట్లు చదువుదుము: “ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమానపరచెదవా? . . . మిమ్మునుబట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది?” ఇటీవలి సంవత్సరములలో యెహోవా ప్రజల సంఘములనుండి అనేక వేలమంది బహిష్కరించబడిరి. బహుశః, అంతకంటే ఎక్కువమందే అవమానకరమైన ప్రవర్తనలో పాల్గొనిననూ బహిష్కరించబడలేదు, ఎందుకంటే వారు నిజమైన పశ్చాత్తాప దృక్పధమును ప్రదర్శించిరి. ఈ ప్రజలందరు తమ పెదవులతో యెహోవాను ఘనపరచుచుండిరి, అయితే వారు తమ ప్రవర్తనద్వారా దానిని చేయుటలో తప్పిపోయిరి.
18. (ఎ) యెహోవాకు తగిన ఘనతను చూపించవలెనంటే బహుగా అనుగ్రహము పొందిన కొందరు ఎటువంటి శ్రద్ధను కలిగియుండవలెను? (బి) శ్రద్ధ అవసరమని మలాకీ దినములలోని కొంతమంది యాజకుల పరిస్థితి ఎట్లు దృష్టాంతపరచుచున్నది?
18 పూర్తికాలసేవయందలి—బెతేలుసేవగానీ, ప్రయాణ లేక మిషనరీ పనిలోగానీ, లేక పయినీర్లుగా—వివిధ రంగములలో పనిరద్దీగలవారు, యెహోవాకు ఘనతతెచ్చుటకు దోహదపడు అవకాశముల విషయములో ఎక్కువ అనుగ్రహము పొందారు. వారికప్పగించబడిన ఏ పనిలోనైనను, ‘కొంచెములోను ఆలాగే ఎక్కువలోను నమ్మకముగా’ ఉండుటకు శాయశక్తులా పనిచేయు బాధ్యతను వారు కలిగియున్నారు. (లూకా 16:10) ప్రాచీన ఇశ్రాయేలీయులలోని యాజకులు మరియు లేవీయులు వారికి సాదృశ్యముగా లేకపోయిననూ, వారి గౌరవస్థానము కొన్ని విధములుగా దృష్టాంతపరచబడినది. ఏమైననూ, మలాకీ దినములలోని కొంతమంది యాజకుల నిర్లక్ష్యధోరణి కారణముగా, యెహోవా వారితో ఇట్లనెను: “నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు?” (మలాకీ 1:6) గ్రుడ్డివైన, కుంటివైన, రోగగ్రస్తమైన జంతువులను బలియర్పించుటద్వారా ఆ యాజకులు దేవుని నామమును అవమానపరచిరి. ఈనాడు ప్రత్యేక సేవాధిక్యతలుగల వారునూ తమ శాయశక్తులా పనిచేయుటకు కృషిసల్పనట్లయిన, యెహోవా ఆ యాజకులకిచ్చిన గద్దింపునే ప్రత్యేకముగా వీరును పొందగలవారై యుందురు. దేవుని ఘనపరచుటలో వారు కొదువను కలిగియుందురు.
19. (ఎ) సామెతలు 3:9లో గమనించినట్లుగా, యెహోవాను ఘనపరచుటకు అదనముగానున్న మార్గమేమి? (బి) యెహోవాను ఘనపరచుటకు మరొక అవశ్యకమైన మార్గమేమి?
19 యెహోవాను మనము ఘనపరచగల మరొక మార్గమేదనగా, ఆధీకృతము చేయబడిన ప్రపంచవ్యాప్తపు ప్రకటించు పనికి డబ్బు చందావేయుట. “నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము” అని మనము ఉద్బోధించబడ్డాము. (సామెతలు 3:9) అటువంటి కానుకలిచ్చు ఆధిక్యత యెహోవా దేవుని ఘనపరచుటకు మనకుగల అవకాశమై యున్నది, దీనిని ఎవరునూ ఉపేక్షించకూడదు. ఆయనను స్తుతించుచు, కృతజ్ఞత చెల్లించుచు మన ప్రార్థనలలో సహితము మనము యెహోవా దేవుని ఘనపరచగలము. (1 దినవృత్తాంతములు 29:10-13) వాస్తవానికి, వినయముతో మరియు మిక్కిలి గౌరవముతో మనమాయన యొద్దకు వచ్చుచున్నందున, అలా ప్రార్థనలో మనము దేవునియొద్దకు వచ్చుటయే ఆయనను ఘనపరచుటయై యున్నది.
20. (ఎ) ప్రజలచే లోకములో సాధారణముగా ఎవరు ఘనపరచబడుచున్నారు, ఎట్లు? (బి) ఏ ఆజ్ఞను లక్ష్యపెట్టుటద్వారా మనము యెహోవాకు ఘనతను ఇనుమడింపజేయగలము?
20 ఈనాడు అనేకమంది ప్రజలు, ప్రత్యేకముగా యౌవనస్థులు, తాము అభిమానించిన వారిని అనుకరించుటద్వారా—వారివలె మాట్లాడుటద్వారా, వారివలె ప్రవర్తించుటద్వారా వారిని ఘనపరచుదురు. తరచుగా వారు అనుకరించు వ్యక్తులు క్రీడా ప్రముఖులు లేక వినోద ప్రపంచమందలి తారలై యుందురు. దానికి భిన్నముగా, క్రైస్తవులుగా మనము యెహోవా దేవుని అనుకరించుటద్వారా ఆయనను ఘనపరచవలెను. అపొస్తలుడైన పౌలు మనమట్లు చేయవలెనని ఉద్బోధించుచు, ఇట్లు వ్రాయుచున్నాడు: “మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి. . . . మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి.” (ఎఫెసీయులు 5:1, 2) అవును, యెహోవాను అనుకరించుటకు కృషిచేయుటద్వారా, మనమాయనను ఘనపరచుదుము.
21. (ఎ) యెహోవాకు మహిమాఘనతల నిచ్చుటకు మనలనేది సంసిద్ధులను చేయును? (బి) ఆయనను ఘనపరచు వారికి యెహోవా ఏ ప్రతిఫలములనిచ్చును?
21 నిజముగా, మనము దేవునికి మహిమను, ఘనతను ఇవ్వగల మరియు ఇవ్వవలసిన మార్గములు అనేకము కలవు. క్రమముగా ఆయన వాక్యముపై పోషింపబడుటద్వారా, ఆయనతో మరి శ్రేష్ఠమైన పరిచయమును కలిగియుండుటద్వారా, మనమాయనను మరియెక్కువ ఘనపరచగలమను విషయమును మనమెన్నటికిని మరువకుందము గాక. అలాచేయుట వలన కలుగు ప్రతిఫలాలు ఏమైయున్నవి? “నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును” అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. (1 సమూయేలు 2:30) తన కుమారుడైన యేసుక్రీస్తుతో పరలోకములో సహరాజులుగా లేక భూపరదైసులో, వారికి ఆనందదాయకమైన నిత్యజీవము నిచ్చుటద్వారా చివరకు యెహోవా తన ఆరాధికులను ఘనపరచును. (w91 2/1)
మీకు జ్ఞాపకమున్నవా?
◻ సాధారణముగా మానవులు ఎవరిని ఘనపరచుదురు, సామాన్యముగా ఎవరిని ఘనపరచ నిర్లక్ష్యము చేతురు?
◻ ఎవరినైనా ఘనపరచుట అనగా దాని భావమేమి, మరియు దానిని చేయుటకుగల వివిధ మార్గములేమై యున్నవి?
◻ యెహోవా దేవుడు మన ఘనతను ఎందుకు పొందనర్హుడో చెప్పుటకుగల కొన్ని ప్రాథమిక కారణములేమై యున్నవి?
◻ మనము యెహోవాను ఘనపరచగల కొన్ని మార్గములేమై యున్నవి?
◻ ఆయనను ఘనపరచు వారికి యెహోవా ఏ విధములుగా ప్రతిఫలము దయచేయును?