పాట 67
‘వాక్యాన్ని ప్రకటించండి’
1. మా యేసే మాకు చేప్పేగా
తన సైగే లోబడే ఆజ్ఞగా
గుండె నిండా ఆశే ఉందిగా
చాటేలా మనం ఉందాం సిద్ధంగా
(పల్లవి)
నే చాటిస్తా
ప్రజలంతా వినేలా
చాటిస్తా
అంతం రాబోతుందని
చాటిస్తా
ఇంకా అర్థం అయ్యేలా
చాటిస్తా
భూమంతటా
2. కష్టాలు గుమ్మం తాకినా
భయపెట్టి నిందలు వేసినా
ఎన్ని బాధలైన భరిస్తా
యెహోవా నిన్నే నిన్నే ప్రేమిస్తా
(పల్లవి)
నే చాటిస్తా
ప్రజలంతా వినేలా
చాటిస్తా
అంతం రాబోతుందని
చాటిస్తా
ఇంకా అర్థం అయ్యేలా
చాటిస్తా
భూమంతటా
3. యెహోవా పేరు పవిత్రం
యేసు రాజ్యం చల్లని సాయంత్రం
అందరికి తెచ్చే స్వాతంత్రం
సువార్త అక్షరాల సుచిత్రం
(పల్లవి)
నే చాటిస్తా
ప్రజలంతా వినేలా
చాటిస్తా
అంతం రాబోతుందని
చాటిస్తా
ఇంకా అర్థం అయ్యేలా
చాటిస్తా
భూమంతటా
(మత్త. 10:7; 24:14; అపొ. 10:42; 1 పేతు. 3:15 కూడా చూడండి.)