పాట 22
రాజ్యపాలన మొదలైంది—అది భూమ్మీదికి రావాలి!
1. యెహోవా నీవెల్లప్పుడూ
సర్వాధికారివే.
కుమారునికి ఇచ్చావు
రాజ్యాధికారము.
స్థాపించావు ప్రభుత్వాన్ని,
పాలిస్తుంది ఈ భూమిని.
(పల్లవి)
తండ్రి, నీకే సొంతం
శక్తి, రక్షణ, రాజ్యము;
తండ్రీ, నీకే సాధ్యం
రావాలిక నీ రాజ్యము.
2. అపవాదికి సమయం
లేదింక ఏమాత్రం;
వస్తాయి కష్టాలు ఎన్నో
తెలుసు కారణం.
స్థాపించావు ప్రభుత్వాన్ని,
పాలిస్తుంది ఈ భూమిని.
(పల్లవి)
తండ్రి, నీకే సొంతం
శక్తి, రక్షణ, రాజ్యము;
తండ్రీ, నీకే సాధ్యం
రావాలిక నీ రాజ్యము.
3. పరలోకంలో దూతలు
చెప్తారు స్తుతులు;
అపవాదికి అక్కడ
లేనందుకు స్థానం.
స్థాపించావు ప్రభుత్వాన్ని,
పాలిస్తుంది ఈ భూమిని.
(పల్లవి)
తండ్రి, నీకే సొంతం
శక్తి, రక్షణ, రాజ్యము;
తండ్రీ, నీకే సాధ్యం
రావాలిక నీ రాజ్యము.
(దాని. 2:34, 35; 2 కొరిం. 4:18 కూడా చూడండి.)