కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • lfb పాఠం 9 పేజీ 28-పేజీ 29 పేరా 1
  • చివరికి ఒక కొడుకు పుట్టాడు!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • చివరికి ఒక కొడుకు పుట్టాడు!
  • నా బైబిలు పుస్తకం
  • ఇలాంటి మరితర సమాచారం
  • అబ్రాహాము మరియు శారా—మీరు వాళ్ళ విశ్వాసాన్ని అనుకరించవచ్చు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • ‘నువ్వు ఎంతో అందంగా ఉంటావు’
    కావలికోట బ్రోషురు
  • జీవితంలో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు
    ధైర్యం చూపిస్తూ దేవునితో నడవండి
  • దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించడం
    నా బైబిలు కథల పుస్తకము
మరిన్ని
నా బైబిలు పుస్తకం
lfb పాఠం 9 పేజీ 28-పేజీ 29 పేరా 1
దూతలు అబ్రాహాముతో మాట్లాడుతున్నప్పుడు శారా డేరా లోపల ఉండి విన్నది

లెసన్‌ 9

చివరికి ఒక కొడుకు పుట్టాడు!

అబ్రాహాము, శారాకు పెళ్లై చాలా సంవత్సరాలు అయ్యింది. ఊరు పట్టణంలో వాళ్లకున్న పెద్ద ఇంటిని వదిలేసి ఇప్పుడు డేరాల్లో ఉంటున్నారు. కానీ శారా ఇబ్బంది పడినట్లు ఎప్పుడూ చెప్పలేదు, ఎందుకంటే ఆమె యెహోవాను నమ్మింది.

శారా పిల్లలు కావాలని చాలా కోరుకుంది, అందుకే అబ్రాహాముతో ఇలా అంది: ‘నాకు దాసిగా పని చేస్తున్న హాగరుకు పిల్లలు పుడితే నా పిల్లల్లా పెంచుకోవచ్చు.’ కొంతకాలానికి హాగరుకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ఇష్మాయేలు.

శారా గర్భవతి అయింది

చాలా సంవత్సరాలు గడిచాయి. అబ్రాహాముకు 99 సంవత్సరాలు, శారాకు 89 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు వాళ్ల దగ్గరకు ఓ ముగ్గురు వచ్చారు. ఆ ముగ్గురు ఎవరో మీకు తెలుసా? వాళ్లు దేవదూతలు! అబ్రాహాము వాళ్లను చెట్టు కింద కూర్చోపెట్టి భోజనం చేయమని అడిగాడు. వాళ్లు అబ్రాహాముతో, ‘వచ్చే సంవత్సరం ఈ పాటికి నీకు నీ భార్యకు ఒక కొడుకు పుడతాడు’ అని చెప్పారు. శారా డేరా లోపల ఉండి వింటూ, ‘నేను ఇంత ముసలిదానిని, నాకు నిజంగా పిల్లలు పుడతారా?’ అని నవ్వుకుంది.

ఆ తర్వాత సంవత్సరం యెహోవా దూత చెప్పినట్లే శారాకు ఒక కొడుకు పుట్టాడు. అబ్రాహాము అతనికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. అంటే “నవ్వడం” అని అర్థం.

ఇస్సాకుకు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఇష్మాయేలు అతన్ని ఏడ్పించడం శారా చూసింది. ఆమె తన కొడుకును కాపాడాలని అనుకుంది. అందుకే అబ్రాహాము దగ్గరకు వెళ్లి హాగరును ఆమె కొడుకును పంపించేయమని అడిగింది. ముందు అబ్రాహాముకు పంపించాలని అనిపించలేదు. అప్పుడు యెహోవా అబ్రాహాముతో ‘శారా చెప్పిన మాట విను. ఇష్మాయేలును నేను చూసుకుంటాను. అయితే ఇస్సాకు ద్వారానే నేను నీకు ఇచ్చిన మాటలన్నీ నిజం అవుతాయి’ అని అన్నాడు.

శారా ఇస్సాకును పట్టుకుని ఉండగా, హాగరు ఇష్మాయేలు నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు

“విశ్వాసం వల్ల శారా . . . గర్భవతి అవ్వడానికి శక్తిని పొందింది. ఎందుకంటే వాగ్దానం చేసిన వ్యక్తి నమ్మకమైనవాడని ఆమె విశ్వసించింది.”—హెబ్రీయులు 11:11

ప్రశ్నలు: దూతలు అబ్రాహాముతో చెప్పిన ఏ మాటల్ని శారా విన్నది? యెహోవా ఇస్సాకును ఎలా కాపాడాడు?

ఆదికాండం 16:1-4, 15, 16; 17:25-27; 18:1-15; 21:1-14; హెబ్రీయులు 11:11

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి