కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ypq ప్రశ్న 7 పేజీలు 21-23
  • సెక్స్‌లో పాల్గొనమని ఎవరైనా ఒత్తిడి చేస్తే నేనేం చేయాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సెక్స్‌లో పాల్గొనమని ఎవరైనా ఒత్తిడి చేస్తే నేనేం చేయాలి?
  • యువత అడిగే 10 ప్రశ్నలకు జవాబులు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సెక్స్‌లో పాల్గొనమని తోటివాళ్లు ఒత్తిడి చేస్తే నేనేం చేయాలి?
    యువత అడిగే ప్రశ్నలు
  • సెక్స్‌ గురించిన నా నమ్మకాలను నేను ఎలా వివరించాలి?
    యువత అడిగే ప్రశ్నలు
  • పెళ్ళికి ముందు లైంగిక సంబంధం పెట్టుకుంటే తప్పేమిటి?
    తేజరిల్లు!—2004
  • ఓరల్‌ సెక్స్‌ నిజంగా ఓ రకమైన సెక్స్‌ ఏనా?
    యువత అడిగే ప్రశ్నలు
మరిన్ని
యువత అడిగే 10 ప్రశ్నలకు జవాబులు
ypq ప్రశ్న 7 పేజీలు 21-23
ఓ యువకుడు సెక్స్‌లో పాల్గొనమని అడుగుతుంటే, వద్దని స్థిరంగా చెప్తున్న ఓ టీనేజీ అమ్మాయి

7

సెక్స్‌లో పాల్గొనమని ఎవరైనా ఒత్తిడి చేస్తే నేనేం చేయాలి?

అది ఎందుకు ప్రాముఖ్యం?

సెక్స్‌ విషయంలో తీసుకునే నిర్ణయాల వల్ల, ఇప్పుడు అలాగే భవిష్యత్తులో మీరు వాటి ఫలితాల్ని అనుభవించాల్సి ఉంటుంది.

మీరు ఏం చేస్తారు?

ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి: హెదర్‌కి మైక్‌ రెండు నెలలనుండే పరిచయం. అయినా, అతను ఎప్పటినుండో తనకు తెలుసు అన్నట్లు హెదర్‌కి అనిపిస్తుంది. వాళ్లు ఎప్పుడూ మెసేజ్‌లు పంపించుకుంటారు, గంటలు తరబడి ఫోన్‌లో మాట్లాడుకుంటారు. వాళ్ల మాటలు కూడా బాగా కలిసిపోయాయి!

ఆ రెండు నెలల్లో, వాళ్లు ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు, అప్పుడప్పుడు ముద్దు కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు మైక్‌కి ఇంకా ఏదో కావాలనిపిస్తోంది. కానీ అంతకుమించి దూరం వెళ్లడం హెదర్‌కి ఇష్టం లేదు. అలాగని, మైక్‌ని దూరం చేసుకోవడం కూడా ఆమెకు ఇష్టం లేదు. మైక్‌ ఆమె అందాన్ని పొగుడుతాడు, ఆమెను చాలా ప్రత్యేకంగా చూస్తాడు. ఇంతవరకు ఎవ్వరూ ఆమెను అలా చూడలేదు. ‘పైగా, నేనూ మైక్‌ ఒకర్నొకరం ప్రేమించుకుంటున్నాం ...’ అని ఆమె సమర్థించుకుంటుంది.

మీకు డేటింగ్‌ చేసేంత వయసు ఉంటే, హెదర్‌ స్థానంలో మీరున్నట్లు ఊహించుకోండి. మీరైతే ఏం చేస్తారు?

ఒక్కక్షణం ఆగి, ఆలోచించండి!

ఇల్లు తుడవడానికి ఉపయోగిస్తున్న ఓ మంచి వస్త్రం

సెక్స్‌ అనేది దేవుడు భార్యాభర్తలకు మాత్రమే ఇచ్చిన బహుమతి. పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొంటే, మీరు ఆ బహుమానాన్ని పాడుచేస్తున్నట్లే. అంటే, వేరేవాళ్లు మీకు బహుమతిగా ఇచ్చిన మంచి బట్టల్ని, ఇల్లు తుడవడానికి ఉపయోగిస్తున్నట్లే

గురుత్వాకర్షణ అనే భౌతిక నియమాన్ని పాటించకుండా చెట్టుమీద నుండి దూకితే, దెబ్బలు తగలుతాయి. అదేవిధంగా, ‘జారత్వానికి దూరంగా ఉండండి’ అనే నైతిక నియమాన్ని పాటించకపోతే కూడా ప్రమాదంలో పడతాం.—1 థెస్సలొనీకయులు 4:3.

ఆ ఆజ్ఞను నిర్లక్ష్యం చేస్తే, ఎలాంటి ఫలితాలు వస్తాయి? బైబిలు ఇలా చెప్తుంది: ‘జారత్వం చేసేవాడు తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తున్నాడు.’ (1 కొరింథీయులు 6:18) అదెలా?

పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొన్న చాలామంది యౌవనులు, వీటిలో ఏదోక పర్యవసానాల్ని ఖచ్చితంగా ఎదుర్కొంటారని పరిశోధకులు చెప్తున్నారు.

  • కృంగుదల. పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొన్న చాలామంది యౌవనులు, తాము చేసిన తప్పుకు కృంగిపోతున్నామని చెప్తున్నారు.

  • నమ్మకం లేకపోవడం. సెక్స్‌లో పాల్గొన్న తర్వాత ఆ అమ్మాయి, అబ్బాయి, ‘ఈయన/ఈమె ఇంకా ఎవరితో సెక్స్‌లో పాల్గొన్నారో?’ అని భయపడుతుంటారు.

  • నిరాశ. నిజానికి, చాలామంది అమ్మాయిలు తమను కాపాడే అబ్బాయిని ఎక్కువగా ఇష్టపడతారు కానీ, తమను వాడుకునే అబ్బాయిని కాదు. అలాగే చాలామంది అబ్బాయిలు తమకు శారీరకంగా దగ్గరైన అమ్మాయిని అంతగా ఇష్టపడరు.

  • ఒక్కమాటలో: మీరు పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొంటే, మీ దగ్గరున్న విలువైనదాన్ని పాడుచేసుకుని, మిమ్మల్ని మీరు దిగజార్చుకుంటారు. (రోమీయులు 1:24) మీ శరీరం చాలా విలువైనది, దాన్ని పాడుచేసుకోకండి!

‘జారత్వానికి దూరంగా’ ఉండే సామర్థ్యం మీకుందని చూపించండి. (1 థెస్సలొనీకయులు 4:3) జారత్వానికి దూరంగా ఉంటే, పెళ్లయ్యాక సెక్స్‌ను ఆనందించగలుగుతారు. ఎందుకంటే, పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొన్నవాళ్లకు ఉండే చింతలు, బాధలు, అభద్రతా భావాలు మీకు ఉండవు.—సామెతలు 7:22, 23; 1 కొరింథీయులు 7:3.

మీకేమనిపిస్తుంది?

  • మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తి, శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని కృంగదీస్తాడా?

  • మీమీద నిజంగా శ్రద్ధ ఉన్న వ్యక్తి, దేవునితో మీకున్న స్నేహాన్ని పాడుచేసుకునేలా మిమ్మల్ని బలవంతపెడతాడా?—హెబ్రీయులు 13:4.

అమ్మాయిలకు...

కూర్చుని ఆలోచిస్తున్న ఓ టీనేజీ అమ్మాయి

తమతో సెక్స్‌లో పాల్గొన్న అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోమని చాలామంది అబ్బాయిలు చెప్తారు. ఎందుకు? ఎందుకంటే, వాళ్లు కన్యగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికే ఇష్టపడతారు!

ఆశ్చర్యంగా ఉందా? కోపం వస్తుందా? ఈ విషయం గుర్తుంచుకోండి: సినిమాలు, టీవీ కార్యక్రమాలు, పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొనడాన్ని అందంగా చూపిస్తాయి. అంతేకాదు, అది సరదా కోసం చేసేదనీ, దాంట్లో తప్పేమీ లేదనీ, అదే నిజమైన ప్రేమనీ చూపిస్తాయి.

కానీ మోసపోకండి! పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొనమని మిమ్మల్ని ఒత్తిడి చేసేవాళ్లు, కేవలం తమ కోరిక తీర్చుకోవడం గురించే ఆలోచిస్తారు.—1 కొరింథీయులు 13:4, 5.

అబ్బాయిలకు...

కూర్చుని ఆలోచిస్తున్న ఓ టీనేజీ అబ్బాయి

ఒకవేళ మీరు ఎవర్నైనా ఇష్టపడుతుంటే, ఇలా ప్రశ్నించుకోండి, ‘నేను ఇష్టపడుతున్న అమ్మాయిమీద నాకు నిజంగా శ్రద్ధ ఉందా?’ ఒకవేళ మీ జవాబు అవును అయితే, మీరు దాన్ని ఎలా చూపించవచ్చు? దేవుని నియమాలకు ధైర్యంగా కట్టుబడివుండండి; తెలివిగా ఆలోచించి, తప్పు చేయాలనిపించే పరిస్థితులకు దూరంగా ఉండండి; ప్రేమతో ఆమె ఇష్టాయిష్టాలకు ప్రాముఖ్యత ఇవ్వండి.

మీకు అలాంటి లక్షణాలు ఉంటే, బహుశా మీరు ఇష్టపడుతున్న అమ్మాయి కూడా, మంచి విలువలున్న షూలమ్మీతీలాగే ఇలా భావించవచ్చు: “నా ప్రియుడు నా వాడు నేను అతనిదానను.” (పరమగీతము 2:16) ఒక్కమాటలో చెప్పాలంటే, ఆమెకు మీమీద ప్రేమ ఇంకా పెరుగుతుంది!

టిప్స్‌

“నిజంగా నామీద నీకు ప్రేమ ఉంటే, దీన్ని కాదనవు” అంటూ సెక్స్‌లో పాల్గొనమని ఎవరైనా మిమ్మల్ని ఒత్తిడి చేస్తే, స్థిరంగా ఇలా చెప్పండి, “నీకు నామీద నిజంగా ప్రేమ ఉంటే, నువ్వు దాన్ని అడగవు!”

మీరు ఒక అబ్బాయితో/అమ్మాయితో ఉన్నప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి: మీరు చేస్తున్న ఏదైనా పనిని మీ అమ్మానాన్నలు చూస్తే తట్టుకోలేరని మీకనిపిస్తే, దాన్ని అస్సలు చేయకండి.

నేనిలా చేస్తాను

  • సెక్స్‌లో పాల్గొనమని ఎవరైనా నన్ను అడిగితే, నేను ...

  • ఎలాంటి పరిస్థితుల్లో వద్దని చెప్పడం నాకు కష్టంగా ఉంటుంది?

  • ఆ పరిస్థితులకు నేనెలా దూరంగా ఉండవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి