కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • fg పాఠం 11 ప్రశ్నలు 1-4
  • బైబిలు సూత్రాలు మనకు ఎలా మేలు చేస్తాయి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిలు సూత్రాలు మనకు ఎలా మేలు చేస్తాయి?
  • దేవుడు చెప్తున్న మంచివార్త!
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ అడుగులు దైవిక సూత్రాలచేత నడిపించబడనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • బైబిలు సూత్రాలు ఎందుకంత ప్రాముఖ్యం?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • సూత్రాన్ని గ్రహించడం పరిపక్వతను ప్రతిబింబిస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • దైవిక సూత్రాలు మీకు ప్రయోజనాన్ని చేకూర్చగలవు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
మరిన్ని
దేవుడు చెప్తున్న మంచివార్త!
fg పాఠం 11 ప్రశ్నలు 1-4

11వ పాఠం

బైబిలు సూత్రాలు మనకు ఎలా మేలు చేస్తాయి?

1. మనకు నిర్దేశం ఎందుకు అవసరం?

బైబిలు సూత్రాల్ని పాటిస్తున్నారు: తల్లి కూతురికి సీటు బెల్టు పెడుతుంది: తండ్రి కొడుకులు హెల్మెట్‌ పెట్టుకున్నారు; గర్భిణీ స్త్రీ, ప్రతీఒక్కరు పని స్థలంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు

సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడానికి బైబిలు సూత్రాలు ఎలా సహాయం చేస్తాయి?—కీర్తన 36:9.

మన సృష్టికర్తకు మనకన్నా ఎక్కువ తెలివి ఉంది. ప్రేమగల తండ్రిలా ఆయన మన మీద శ్రద్ధ చూపిస్తాడు. ఆయన నిర్దేశం లేకుండా మనంతట మనమే జీవించేలా దేవుడు మనల్ని తయారుచేయలేదు. (యిర్మీయా 10:23) చిన్నపిల్లలకు అమ్మానాన్నల నిర్దేశం అవసరమైనట్టే మనకు కూడా దేవుని నిర్దేశం అవసరం. (యెషయా 48:17, 18) బైబిలు దేవుడిచ్చిన బహుమానం, అందులోని సూత్రాలు మనకు నిర్దేశాన్నిస్తాయి.—2 తిమోతి 3:16 చదవండి.

యెహోవా ఇచ్చిన నియమాలు, సూత్రాలు ఇప్పుడు సంతోషంగా ఎలా జీవించవచ్చో, భవిష్యత్తులో శాశ్వత ప్రయోజనాలు ఎలా పొందవచ్చో నేర్పిస్తాయి. మనల్ని సృష్టించింది దేవుడే కాబట్టి మనం ఆయన నిర్దేశం పట్ల కృతజ్ఞత కలిగివుంటూ, సంతోషంగా లోబడాలి.—కీర్తన 19:7, 11; ప్రకటన 4:11 చదవండి.

2. బైబిలు సూత్రాలు అంటే ఏంటి?

సూత్రాలు అనేవి ప్రాథమిక సత్యాలు, నియమాలు మాత్రం కొన్ని ప్రత్యేక పరిస్థితులకే సరిపోతాయి. (ద్వితీయోపదేశకాండం 22:​8) ఒకానొక పరిస్థితికి ఏ సూత్రం సరిపోతుందో తెలుసుకోవాలంటే మనం ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగించాలి. (సామెతలు 2:10-12) ఉదాహరణకు, జీవం దేవుడు ఇచ్చిన బహుమతి అని బైబిలు చెప్తుంది. ఆ ప్రాథమిక సూత్రాన్ని గుర్తుంచుకుంటే మనం పనిస్థలంలో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, ప్రయాణిస్తున్నా సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం.—అపొస్తలుల కార్యాలు 17:28 చదవండి.

3. అన్నిటికన్నా ముఖ్యమైన రెండు సూత్రాలు ఏంటి?

అన్నిటికన్నా ముఖ్యమైన రెండు సూత్రాల గురించి యేసు చెప్పాడు. దేవుని గురించి తెలుసుకుని, ఆయన్ని ప్రేమించి, నమ్మకంగా సేవించడమే మన జీవిత ఉద్దేశమని మొదటి సూత్రం చెప్తుంది. ఈ సూత్రాన్ని మనసులో ఉంచుకునే మనం ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. (సామెతలు 3:6) ఆ సూత్రం ప్రకారం జీవించేవాళ్లు దేవుని స్నేహాన్ని, నిజమైన సంతోషాన్ని, శాశ్వత జీవితాన్ని పొందుతారు.—మత్తయి 22:36-38 చదవండి.

ఇతరులతో శాంతిగా ఉండమని రెండో సూత్రం చెప్తుంది. (1 కొరింథీయులు 13:4-7) ఈ సూత్రాన్ని పాటించాలంటే, ప్రజలతో దేవుడు ఎలా వ్యవహరిస్తాడో మనమూ అలాగే వ్యవహరించాలి.—మత్తయి 7:12; 22:39, 40 చదవండి.

4. బైబిలు సూత్రాలు మనకు ఎలా మేలు చేస్తాయి?

సంతోషంగా ఉన్న కుటుంబం

కుటుంబంలో ప్రేమ చూపిస్తూ ఐక్యంగా ఉండడం ఎలాగో బైబిలు సూత్రాలు నేర్పిస్తాయి. (కొలొస్సయులు 3:12-14) వివాహం శాశ్వత బంధంగా ఉండాలనేది దేవుని వాక్యంలో ఉన్న మరో సూత్రం. అది కుటుంబాలకు భద్రత ఇస్తుంది.—ఆదికాండం 2:24 చదవండి.

బైబిలు సూత్రాలు పాటిస్తే మనం ఆర్థిక సమస్యల్ని, ఆందోళనల్ని తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు నిజాయితీగా ఉండమని, కష్టపడి పనిచేయమని బైబిలు చెప్తుంది. ఎవరైనా అలాంటివాళ్లకే ఉద్యోగం ఇవ్వాలనుకుంటారు కదా! (సామెతలు 10:4, 26; హెబ్రీయులు 13:18) అంతేకాదు, కనీస అవసరాలతో తృప్తిగా జీవించమని, వస్తుసంపదల కన్నా దేవునితో ఉన్న స్నేహానికే ఎక్కువ విలువ ఇవ్వమని బైబిలు చెప్తుంది.—మత్తయి 6:24, 25, 33; 1 తిమోతి 6:8-10 చదవండి.

బైబిలు సూత్రాలు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. (సామెతలు 14:30; 22:24, 25) ఉదాహరణకు, అతిగా తాగకూడదు అని బైబిలు చెప్తుంది. దాన్ని పాటిస్తే ప్రాణాంతకమైన జబ్బులకు, ప్రమాదాలకు దూరంగా ఉంటాం. (సామెతలు 23:20) అయితే, మద్యం మితంగా తీసుకోవడాన్ని యెహోవా ఖండించట్లేదు. (కీర్తన 104:15; 1 కొరింథీయులు 6:10) మన పనులతో పాటు ఆలోచనల్ని కూడా అదుపులో పెట్టుకోవాలని దేవుని సూత్రాలు చెప్తున్నాయి, అలా చేయడం మనకే మంచిది. (కీర్తన 119:97-100) అయితే, నిజ క్రైస్తవులు కేవలం తమ మేలు కోసం కాదుగానీ యెహోవాను ఘనపర్చడం కోసం ఆయన ప్రమాణాల్ని పాటిస్తారు.—మత్తయి 5:14-16 చదవండి.

ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు? పుస్తకంలో 12, 13 అధ్యాయాలు చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి