కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • fg పాఠం 12 ప్రశ్నలు 1-5
  • దేవునికి మీరెలా దగ్గరవ్వవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవునికి మీరెలా దగ్గరవ్వవచ్చు?
  • దేవుడు చెప్తున్న మంచివార్త!
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవునికి దగ్గరవ్వాలంటే మీరేం చేయాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • మీరెలా దేవునికి సన్నిహితులు కాగలరు
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • ప్రార్థనలో దేవునికి సన్నిహితమవండి
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • ప్రార్థనలో దేవునికి చేరువ కావడం
    దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?
మరిన్ని
దేవుడు చెప్తున్న మంచివార్త!
fg పాఠం 12 ప్రశ్నలు 1-5

12వ పాఠం

దేవునికి మీరెలా దగ్గరవ్వవచ్చు?

1. దేవుడు అందరి ప్రార్థనలు వింటాడా?

ఒకతను దేవునికి ప్రార్థిస్తున్నాడు

ప్రార్థన ద్వారా తనకు దగ్గరవ్వమని యెహోవా అన్నిరకాల ప్రజల్ని ఆహ్వానిస్తున్నాడు. (కీర్తన 65:2) అయితే, ఆయన అందరి ప్రార్థనలు వినడు. ఉదాహరణకు, తన భార్యను బాధపెట్టే భర్త ప్రార్థనలు దేవుడు వినకపోవచ్చు. (1 పేతురు 3:7) ఇశ్రాయేలీయులు అదేపనిగా చెడ్డపనులు చేసినప్పుడు దేవుడు వాళ్ల ప్రార్థనలు వినలేదు. అయితే ఘోరమైన పాపాలు చేసినవాళ్లు కూడా పశ్చాత్తాపపడితే, దేవుడు వాళ్ల ప్రార్థనలు వింటాడు. ప్రార్థన నిజంగా ఒక గొప్ప వరం.—యెషయా 1:15; 55:7 చదవండి.

దేవుడు అన్ని ప్రార్థనల్ని వింటాడా? వీడియో చూడండి.

2. మనం ఎలా ప్రార్థించాలి?

యెహోవా మన సృష్టికర్త కాబట్టి మనం ఆయన్నే ఆరాధించాలి, ఆయనకే ప్రార్థించాలి. (మత్తయి 4:10; 6:​9) అంతేకాదు మనం యేసు పేరున ప్రార్థించాలి. ఎందుకంటే మనం అపరిపూర్ణులం, మన పాపాల కోసం యేసు చనిపోయాడు. (యోహాను 14:6) మనం బట్టీపట్టి చేసే ప్రార్థనలు, పుస్తకంలో చూసి చేసే ప్రార్థనలు యెహోవాకు నచ్చవు. మన ప్రార్థనలు హృదయంలో నుండి రావాలని ఆయన కోరుకుంటున్నాడు.—మత్తయి 6:7; ఫిలిప్పీయులు 4:6, 7 చదవండి.

మనం మనసులో ప్రార్థించుకున్నా మన సృష్టికర్త వినగలడు. (1 సమూయేలు 1:12, 13) నిద్రలేచినప్పుడు, పడుకునేటప్పుడు, తినేటప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అలా ఏ సమయంలోనైనా తనకు ప్రార్థించమని ఆయన చెప్తున్నాడు.—కీర్తన 55:22; మత్తయి 15:36 చదవండి.

3. క్రైస్తవులు ఎందుకు కూటాలకు వెళ్తారు?

క్రైస్తవ కూటంలో ప్రజలు బైబిలు చదువుతున్నారు

మన చుట్టూ దేవుని మీద విశ్వాసంలేని ప్రజలే ఉన్నారు కాబట్టి మనం దేవునికి దగ్గరవ్వడం అంత తేలిక కాదు. వాళ్లు, భూమ్మీదికి శాంతి తెస్తానని దేవుడు చేసిన వాగ్దానాన్ని ఎగతాళి చేస్తారు. (2 తిమోతి 3:1, 4; 2 పేతురు 3:3, 13) అందుకే ప్రోత్సాహాన్నిచ్చే తోటి విశ్వాసుల సహవాసం మనందరికీ అవసరం.—హెబ్రీయులు 10:24, 25 చదవండి.

దేవున్ని ప్రేమించేవాళ్లతో సహవసిస్తే మనం ఆయనకు దగ్గరవ్వగలుగుతాం. యెహోవాసాక్షుల కూటాలకు వెళ్లినప్పుడు తోటివాళ్ల విశ్వాసం చూసి మనం ప్రోత్సాహం పొందుతాం.—రోమీయులు 1:11, 12 చదవండి.

4. దేవునికి మీరెలా దగ్గరవ్వవచ్చు?

ఒకతను పని స్థలంలో విరామ సమయంలో దేవుని వాక్యం చదువుతున్నాడు

బైబిల్లో నేర్చుకున్న విషయాల గురించి లోతుగా ఆలోచిస్తే మీరు యెహోవాకు దగ్గరవ్వవచ్చు. ఆయన పనుల గురించి, సలహాల గురించి, వాగ్దానాల గురించి ఆలోచించండి. ప్రార్థన చేసుకుని ధ్యానించినప్పుడు దేవుని ప్రేమ, తెలివి ఎంత గొప్పవో అర్థమౌతుంది.—యెహోషువ 1:8; కీర్తన 1:1-3 చదవండి.

దేవుని మీద విశ్వాసం ఉంటేనే మీరు ఆయనకు దగ్గరవ్వగలరు. మన శరీరం బలంగా ఉండాలంటే ఆహారం తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మన విశ్వాసం బలంగా ఉండాలంటే, మన నమ్మకాలకు గల కారణాల గురించి ఆలోచిస్తూ ఉండాలి.—మత్తయి 4:4; హెబ్రీయులు 11:1, 6 చదవండి.

5. దేవునికి దగ్గరవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?

యెహోవా తనను ప్రేమించేవాళ్ల గురించి పట్టించుకుంటాడు. వాళ్ల విశ్వాసాన్ని పాడుచేసే, వాళ్లు శాశ్వత జీవితం పొందకుండా చేసే దేనినుండైనా ఆయన వాళ్లను కాపాడగలడు. (కీర్తన 91:1, 2, 7-10) మన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని పాడుచేసే వాటికి దూరంగా ఉండమని ఆయన హెచ్చరిస్తున్నాడు. అంతేకాదు, శ్రేష్ఠమైన విధంగా జీవించడం యెహోవా మనకు నేర్పిస్తున్నాడు.—కీర్తన 73:27, 28; యాకోబు 4:4, 8 చదవండి.

స్నేహితులు కలిసి సమయం గడుపుతున్నారు

ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు? పుస్తకంలో 17వ అధ్యాయం చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి