కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • fg పాఠం 9 ప్రశ్నలు 1-5
  • మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?
  • దేవుడు చెప్తున్న మంచివార్త!
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • మీ కుటుంబ జీవితాన్ని ఎలా సంతోషభరితం చేసుకోవచ్చు?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • పెళ్లి దేవుడు ఇచ్చిన బహుమతి
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • భార్యాభర్తలుగా సంతోషంగా ఉంటూ, మీ బంధాన్ని బలపర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
మరిన్ని
దేవుడు చెప్తున్న మంచివార్త!
fg పాఠం 9 ప్రశ్నలు 1-5

9వ పాఠం

మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?

1. కలిసి జీవించాలనుకునేవాళ్లు పెళ్లి చేసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

తమ వివాహాన్ని చట్టబద్ధంగా రిజిస్టర్‌ చేసుకుంటున్న ఒక జంట

మంచివార్త చెప్తున్న యెహోవా సంతోషంగల దేవుడు, కాబట్టి కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. (1 తిమోతి 1:11) వివాహ ఏర్పాటును చేసింది ఆయనే. చట్టబద్ధంగా పెళ్లి చేసుకుంటే భార్యాభర్తలకు, వాళ్ల పిల్లలకు భద్రత ఉంటుంది, కుటుంబం సంతోషంగా ఉంటుంది. క్రైస్తవులు తమ ప్రాంతంలోని చట్టాల ప్రకారం తమ పెళ్లిని రిజిస్టరు చేయించుకోవాలి.—లూకా 2:1, 4, 5 చదవండి.

వివాహ బంధాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడు? అది స్త్రీపురుషుల మధ్య ఒక శాశ్వత బంధంగా ఉండాలనేది ఆయన కోరిక. భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. (హెబ్రీయులు 13:4) విడాకులంటే ఆయనకు అసహ్యం. (మలాకీ 2:16) కానీ భార్యాభర్తల్లో ఒకరు వ్యభిచారం చేసినప్పుడు, రెండో వ్యక్తి విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకోవచ్చని ఆయన చెప్తున్నాడు.—మత్తయి 19:3-6, 9 చదవండి.

2. భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎలా ఉండాలి?

సంతోషంగా ఉన్న భర్త, భార్య

ఒకరికొకరు సాటియైన సహాయంగా ఉండేలా యెహోవా పురుషుణ్ణి, స్త్రీని సృష్టించాడు. (ఆదికాండం 2:18) భర్త కుటుంబ శిరస్సు కాబట్టి తన కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడం, వాళ్లకు దేవుని గురించి బోధించడం ఆయన బాధ్యత. భర్త తన సొంత ప్రయోజనం చూసుకోకుండా భార్య మీద ప్రేమ చూపించాలి. భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, గౌరవించుకోవాలి. ఇద్దరిలోనూ లోపాలు ఉంటాయి కాబట్టి, వాళ్ల కాపురం ఆనందంగా సాగిపోవాలంటే ఒకరినొకరు క్షమించుకోవడం చాలా అవసరం.—ఎఫెసీయులు 4:31, 32; 5:22-25, 33; 1 పేతురు 3:7 చదవండి.

3. సమస్యలు వస్తే విడిపోవడమే పరిష్కారమా?

వివాహంలో సమస్యలు వస్తే, భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ఇంకా ఎక్కువగా ప్రేమ చూపించుకోవడానికి కృషి చేయాలి. (1 కొరింథీయులు 13:​4, 5) వివాహ జీవితంలో సాధారణంగా వచ్చే సమస్యలకు విడిపోవడమే పరిష్కారమని బైబిలు చెప్పట్లేదు.—1 కొరింథీయులు 7:10-13 చదవండి.

4. పిల్లలూ, మీరెలా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు?

ఇంట్లో పిల్లలకు సహాయం చేస్తున్న తల్లిదండ్రులు

మీరు సంతోషంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. మీ యౌవనాన్ని ఆనందించడానికి ఆయన చక్కని సలహాలు ఇస్తున్నాడు. మీ అమ్మానాన్నల మాట వింటూ వాళ్ల తెలివి నుండి, అనుభవం నుండి ప్రయోజనం పొందమని ఆయన చెప్తున్నాడు. (కొలొస్సయులు 3:20) అలాగే తనకు, తన కుమారునికి నచ్చే పనులు చేస్తూ సంతోషంగా ఉండమని కూడా యెహోవా చెప్తున్నాడు.—ప్రసంగి 11:9–12:1; మత్తయి 19:13-15; 21:15, 16 చదవండి.

5. తల్లిదండ్రులారా, పిల్లలు సంతోషంగా ఉండాలంటే మీరేం చేయాలి?

తన పిల్లవాడితో మాట్లాడుతున్న ఒక తండ్రి

మీరు కష్టపడి పనిచేస్తూ మీ పిల్లలకు ఆహారం, ఇల్లు, బట్టలు ఉండేలా చూసుకోవాలి. (1 తిమోతి 5:8) అయితే మీ పిల్లలు నిజంగా సంతోషంగా ఉండాలంటే మీరు వాళ్లకు దేవున్ని ప్రేమించడం, ఆయన ఉపదేశాన్ని వినడం నేర్పించాలి. (ఎఫెసీయులు 6:4) దేవున్ని ప్రేమించే విషయంలో మీ మంచి ఆదర్శం మీ పిల్లల హృదయాల మీద చెరగని ముద్ర వేస్తుంది. మీరు బైబిలు ప్రకారం బోధిస్తే, మీ పిల్లలు సరిగ్గా ఆలోచించడం నేర్చుకుంటారు.—ద్వితీయోపదేశకాండం 6:4-7; సామెతలు 22:6 చదవండి.

పిల్లల్ని ప్రోత్సహించడం, మెచ్చుకోవడం మంచిది. అయితే వాళ్లను సరిదిద్దడం, క్రమశిక్షణలో పెట్టడం కూడా ముఖ్యమే. అలాంటి శిక్షణ వల్ల పిల్లలు చెడ్డ పనులకు దూరంగా ఉంటారు, సంతోషం కోల్పోకుండా ఉంటారు. (సామెతలు 22:15) అయితే క్రమశిక్షణ ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా, క్రూరంగా ఉండకూడదు.—కొలొస్సయులు 3:21 చదవండి.

ప్రత్యేకంగా తల్లిదండ్రుల కోసం, పిల్లల కోసం యెహోవాసాక్షులు బైబిలు ఆధారంగా ఎన్నో పుస్తకాలు తయారుచేశారు.—కీర్తన 19:7, 11 చదవండి.

ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు? పుస్తకంలో 14వ అధ్యాయం చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి