భాగం 14
మీరు యెహోవాకు ఎలా నమ్మకంగా ఉండవచ్చు?
దేవుని వైపు నిలబడండి. 1 పేతురు 5:6-9
బైబిలుకు విరుద్ధమైన ఆచారాలన్నిటికీ దూరంగా ఉండండి. అలా ఉండాలంటే ధైర్యం అవసరం.
రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చకండి. మనం యెహోవాకు, ఆయన రాజ్యానికి మాత్రమే మద్దతిస్తాం.
దేవుడు చెప్పేది వినాలని నిర్ణయించుకోండి, అదే సరైనది. మత్తయి 7:24, 25
యెహోవాసాక్షులతో సహవసించండి, దేవునికి దగ్గరవ్వడానికి వాళ్లు మీకు సహాయం చేస్తారు.
దేవుని గురించి నేర్చుకుంటూ ఉండండి, ఆయన ఆజ్ఞలు పాటించడానికి ప్రయత్నించండి.
యెహోవాపై మీ విశ్వాసం బలపడిన తర్వాత మీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకోవాలి.—మత్తయి 28:19.
దేవుడు చెప్పేది వినండి. బైబిలు చదవండి. దాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని యెహోవాసాక్షుల్ని అడగండి. నేర్చుకున్నవాటిని పాటించండి. అలా చేస్తే మీరు నిరంతరం జీవిస్తారు.—కీర్తన 37:29.