కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ll భాగం 6 పేజీలు 14-15
  • జలప్రళయం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జలప్రళయం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
  • దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • భాగం 6
    దేవుడు చెప్పేది వినండి
  • జలప్రళయం గురించి చెప్పినప్పుడు ఎవరు విన్నారు? ఎవరు వినలేదు?
    దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
  • ఆయన, ‘మరి ఏడుగురు’ రక్షణ పొందారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • మీ విశ్వాసమునుబట్టి మీరు లోకముపై నేరస్థాపన చేయుదురా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి
ll భాగం 6 పేజీలు 14-15

భాగం 6

జలప్రళయం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

దేవుడు చెడ్డవాళ్లను నాశనం చేశాడు. నోవహును, ఆయన కుటుంబాన్ని రక్షించాడు. ఆదికాండం 7:11, 12, 23

ఓడ నీళ్లమీద తేలుతోంది, చెడ్డ ప్రజలు మునిగిపోతున్నారు, దేవునికి ఎదురుతిరిగిన దేవదూతలు పరలోకానికి వెళ్లిపోతున్నారు

నలభై రోజులపాటు ఆగకుండా వర్షం పడడం వల్ల భూమంతా నీళ్లతో నిండిపోయింది. చెడ్డ వాళ్లందరూ చనిపోయారు.

దేవునికి ఎదురుతిరిగిన దేవదూతలు మళ్లీ పరలోకానికి వెళ్లిపోయారు, వాళ్లే చెడ్డదూతలు.

ఓడలోనుండి బయటికి వస్తున్న నోవహు, ఆయన కుటుంబం, అలాగే జంతువులు. ఆకాశంలో ఇంద్రధనుస్సు కనిపిస్తోంది

ఓడలో ఉన్నవాళ్లు మాత్రం సురక్షితంగా ఉన్నారు. తర్వాత కొంతకాలానికి నోవహు, ఆయన కుటుంబ సభ్యులు చనిపోయారు. అయితే భవిష్యత్తులో దేవుడు వాళ్లను తిరిగి బ్రతికించి, నిరంతరం జీవించే అవకాశం ఇస్తాడు.

దేవుడు మళ్లీ చెడ్డవాళ్లను నాశనం చేస్తాడు, మంచివాళ్లను రక్షిస్తాడు. మత్తయి 24:37-39

సాతాను, అతని చెడ్డదూతలు ప్రజల్ని మోసం చేయడానికి రకరకాల పద్ధతులు వాడుతున్నారు

సాతాను, అతని చెడ్డదూతలు ఇప్పటికీ ప్రజల్ని మోసం చేస్తున్నారు.

నోవహు కాలంలోని ప్రజల్లాగే నేడు చాలామంది యెహోవా ప్రేమతో చెప్తున్న మాటల్ని వినట్లేదు. యెహోవా త్వరలోనే చెడ్డ వాళ్లందర్నీ నాశనం చేస్తాడు.—2 పేతురు 2:5, 6.

యెహోవాసాక్షులు బైబిలు ఉపయోగించి ఒకతనికి ప్రకటిస్తున్నారు; ఒకతను బైబిలు చదువుతున్నాడు

నోవహులాగే కొంతమంది దేవుడు చెప్పేది వింటున్నారు, పాటిస్తున్నారు. వాళ్లే యెహోవాసాక్షులు.

  • జీవానికి నడిపించే దారిని ఎంచుకోండి.—మత్తయి 7:13, 14.

  • చెడ్డవాళ్లు నాశనం అవుతారు, వినయస్థులు శాంతిగా జీవిస్తారు.—కీర్తన 37:10, 11.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి