కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • be అధ్యాయం 39 పేజీ 220-పేజీ 222 పేరా 6
  • సమర్థమైన ముగింపు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సమర్థమైన ముగింపు
  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • తగిన ముగింపు, మీ సమయము
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నిర్దేశక పుస్తకము
  • మంచి ముగింపు
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • ముఖ్యాంశాలు నొక్కిచెప్పడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • సంక్షిప్త ప్రతిని తయారు చేసుకోవడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
మరిన్ని
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
be అధ్యాయం 39 పేజీ 220-పేజీ 222 పేరా 6

39

సమర్థమైన ముగింపు

మీరు ఏమి చెయ్యాలి?

తాము విన్నదాన్ని అమలులో పెట్టేందుకు శ్రోతలను కదిలించే మాటలను తయారు చేసుకొని ముగింపు వాక్యాల్లో చెప్పండి.

ఎందుకు ప్రాముఖ్యం?

తరచూ ముగింపులో చెప్పిన మాటలే దీర్ఘకాలం గుర్తుంటాయి. అవి మొత్తం ప్రసంగ సాఫల్యతపై ప్రభావం చూపిస్తాయి.

మీరు మీ ప్రసంగపు ముఖ్యభాగం కోసం, సమాచారాన్ని జాగ్రత్తగా పరిశోధించి క్రమబద్ధంగా పొందుపరుచుకొని ఉండవచ్చు. ఆసక్తిని రేకెత్తించే ఉపోద్ఘాతాన్ని కూడా సిద్ధం చేసుకొనివుండవచ్చు. అయితే మరొకటి కూడా అవసరం. అది సమర్థమైన ముగింపు. దాని ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయకండి. తరచూ, చివరలో చెప్పిందే చిరకాలం గుర్తుండిపోతుంది. ముగింపు బలహీనంగా ఉంటే దాని ముందు చెప్పిన సమాచారం ప్రభావం కూడా చాలా తగ్గిపోవచ్చు.

ఆలోచించండి: యెహోషువ తన జీవిత చరమాంకంలో, ఇశ్రాయేలు జనాంగపు పెద్దలకు మరపురాని ఒక ప్రసంగాన్నిచ్చాడు. యెహోవా అబ్రాహాము కాలము మొదలుకొని ఇశ్రాయేలుతో వ్యవహరించిన విధానాన్ని గురించి చెప్పిన తర్వాత, యెహోషువ ప్రధానాంశాలను కేవలం సంగ్రహరూపంలో మళ్ళీ చెప్పాడా? లేదు. అలా చెప్పే బదులు, “యెహోవాయందు భయభక్తులుగలవారై, ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించు”డని ప్రగాఢమైన భావాలతో ప్రజలకు ఉద్బోధించాడు. యెహోషువ 24:14,15 లో వ్రాయబడిన యెహోషువ చెప్పిన ముగింపు మాటలను మీకై మీరు చదువుకోండి.

అపొస్తలుల కార్యములు 2:14-36 లో ఉన్న మరొక గమనార్హమైన ప్రసంగం, అపొస్తలుడైన పేతురు సా.శ. 33 పెంతెకొస్తు పండుగ రోజున యెరూషలేములోని జనసమూహానికి ఇచ్చినదది. దేవుని ఆత్మ కుమ్మరించబడడం గురించిన యోవేలు ప్రవచన నెరవేర్పుకు తాము సాక్షులమని ఆయన మొదట వివరించాడు. తర్వాత, యేసుక్రీస్తు పునరుత్థానం గురించీ ఆయన దేవుని కుడివైపున కూర్చునేంతగా ఉన్నతపర్చబడడం గురించీ ప్రవచించిన కీర్తనల్లోని మెస్సీయ సంబంధ ప్రవచనాలకు అది ఎలా ముడిపడివుందో చూపించాడు. తర్వాత, ప్రేక్షకులందరూ ప్రతిస్పందించవలసిన ఒక వివాదాంశాన్ని ముగింపులో స్పష్టంగా తెలిపాడు. “మీరు సిలువవేసిన [“కొరతవేసిన,” NW] యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలె[ను]” అని ఆయన చెప్పాడు. అక్కడున్నవారు, “సహోదరులారా, మేమేమి చేతు[ము]?” అని అడిగారు. “మీరు మారుమనస్సు పొంది, . . . ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి” అని పేతురు సమాధానమిచ్చాడు. (అపొ. 2:36-38) ఆ రోజు ఆయన ప్రేక్షకుల్లోని దాదాపు 3,000 మంది తాము విన్నదాన్ని బట్టి ఎంతో కదిలించబడి, యేసుక్రీస్తు గురించిన సత్యాన్ని స్వీకరించారు.

మనస్సులో పెట్టుకోవలసిన విషయాలు. మీరు ముగింపులో చెప్పే మాటలు మీ ప్రసంగాంశంతో నేరుగా సంబంధమున్నవై ఉండాలి, మీరు విపులీకరించిన ముఖ్యాంశాలు తర్కబద్ధమైన ముగింపుగా ఉండాలి. మీరు మీ చర్చాంశంలోని కీలకమైన కొన్ని పదాలను ముగింపు మాటల్లో చేర్చాలని అనుకోవచ్చు, కానీ వాటిని ఉన్నవి ఉన్నట్లు చెప్పాలనేమీ లేదు.

సాధారణంగా మీ ప్రసంగ ఉద్దేశం, మీరు అందించిన సమాచారం ఆధారంగా ప్రవర్తించేలా ఇతరులను ప్రోత్సహించాలన్నదే. ముగింపు ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి వాళ్ళు ఏమి చేయాలో చూపించడమే. మీరు చర్చాంశాన్నీ ముఖ్యాంశాలనూ ఎంపిక చేసుకునేటప్పుడు, ఆ సమాచారం మీ ప్రేక్షకులకు ఎందుకు ప్రాముఖ్యమో వాటిని అందించడంలో మీ లక్ష్యం ఏమిటన్నది మీరు శ్రద్ధగా ఆలోచించారా? అలాగైతే, వాళ్ళు ఏ చర్య తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారో మీకు తెలుసన్నమాట. ఇప్పుడు ఆ చర్య ఏమిటో మీరు వివరించాలి. దాన్నెలా చెయ్యాలో వివరించడం కూడా అవసరం కావచ్చు.

మీ ప్రసంగం ముగింపు, మీ ప్రేక్షకులు ఏమి చెయ్యాలో తెలియజేయడమే కాక పురికొల్పును కూడా ఇవ్వాలి. ఆ చర్య తీసుకోవడానికి తగిన కారణాలనూ దానివల్ల రాగల ప్రయోజనాలనూ కూడా చేర్చి తీరాలి. చివరి వాక్యం గురించి శ్రద్ధగా ఆలోచించి మంచి పదబంధాలతో దాన్ని సిద్ధం చేసుకుంటే, అది మీ మొత్తం ప్రసంగం ప్రభావాన్ని మరింత శక్తివంతం చేయవచ్చు.

ప్రసంగం ముగింపుకొస్తోందన్న విషయం మనస్సులో పెట్టుకోండి. మీరు చెప్పే మాటలు దాన్ని సూచించాలి. మీ వేగం కూడా సముచితంగా ఉండాలి. చివరి వరకు వేగంగా మాట్లాడి అకస్మాత్తుగా ముగించేయకండి. మరొకవైపు, మీ స్వరం నెమ్మదిగా తగ్గిపోకుండా చూసుకోండి. మీ స్వరం తగిన విధంగా ఉండాలి, కానీ మరీ ఎక్కువగా ఉండకూడదు. మీరు ముగించబోతున్నారన్న విషయాన్ని మీ చివరి కొన్ని వాక్యాలు సూచించాలి. మీరు చివరి వాక్యాలను చెప్పేటప్పుడు మీరు హృదయపూర్వకంగా నమ్మకంతో మాట్లాడుతున్నారన్నది తెలియాలి. మీరు ప్రసంగానికి గానీ సువార్తను ప్రకటించడానికి గానీ సిద్ధపడుతున్నప్పుడు, ముగింపును అభ్యాసం చెయ్యకుండా ఉండకండి.

ముగింపు ఎంత సేపుండాలి? అది కేవలం గడియారాన్ని బట్టి నిర్ణయించవలసింది కాదు. ముగింపును మరీ సాగదీయకూడదు. అది ఎంతసేపైతే సముచితమన్నది, అది ప్రేక్షకులపై చూపే ప్రభావాన్ని బట్టి ఉండగలదు. సరళమైన సూటైన నిర్మాణాత్మకమైన ముగింపే ఎల్లప్పుడూ మెచ్చుకోబడుతుంది. క్లుప్తమైన ఉపమానం చేర్చబడిన కొంచెం పెద్ద ముగింపు కూడా జాగ్రత్తగా పథకం వేసినదైతే సమర్థంగా ఉండగలదు. ప్రసంగి పుస్తకమంతటికీ ప్రసంగి 12:13,14 లో ఇవ్వబడిన క్లుప్తమైన ముగింపును, అంతకన్నా చిన్న ప్రసంగమైన కొండ మీది ప్రసంగానికి మత్తయి 7:24-27 లో నమోదు చేయబడిన ముగింపుతో పోల్చండి.

క్షేత్ర పరిచర్యలో. క్షేత్ర పరిచర్యలో తప్ప వేరే ఎక్కడా ముగింపుల అవసరం అంత తరచుగా రాదు. మీ సిద్ధపాటుకు ప్రజల మీద ప్రేమపూర్వక ఆసక్తి తోడైనప్పుడు ఎంతో మేలు చేకూర్చగలుగుతారు. ఒక్కొక్క వ్యక్తితో సంభాషించేటప్పుడు కూడా ముందు పేజీల్లో ఇవ్వబడిన సలహాను ప్రయోజనకరమైన విధంగా అన్వయించుకోవచ్చు.

సంభాషణ చాలా క్లుప్తంగా జరుగుతుండవచ్చు. ఆ వ్యక్తి ఏదైనా పనిలో నిమగ్నమై ఉండవచ్చు. మీరు ఒక్క నిమిషమే సంభాషించగలుగుతుండవచ్చు. సముచితమైతే, “మీరు బిజీగా ఉన్నారని నాకు అర్థమయ్యిందండీ, అయితే ప్రోత్సాహకరమైన ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నానండీ. ప్రజలు జీవితాన్ని సదాకాలం ఆనందించగల ప్రదేశంగా ఈ భూమిని చెయ్యాలన్న అద్భుతమైన సంకల్పం మన సృష్టికర్తకు ఉందని బైబిలు తెలియజేస్తోంది. మనం ఆ పరదైసులో ఉండగలం, అయితే అందుకు దేవుడు కోరుతున్న విషయాలేమిటో మనం తెలుసుకోవాలి” అని గానీ ఇలా మరేదైనా మీరు చెప్పవచ్చు. లేదా మరింత అనుకూలమైన సమయంలో తిరిగి వస్తానని మీరు చెప్పవచ్చు.

గృహస్థుడు అకస్మాత్తుగా విషయాన్ని మార్చేస్తున్నందువల్లా పరుషంగా కూడా మాట్లాడడం వల్లా మీరు అక్కడితో ఆపి రావలసివచ్చినప్పటికీ కూడా ఎంతో మంచి జరగవచ్చు. మత్తయి 10:12,13, రోమీయులు 12:17,18 వచనాల్లోని సలహాలను మనస్సులో ఉంచుకోండి. మీ సౌమ్య ప్రతిస్పందన యెహోవాసాక్షుల గురించి ఆయనకున్న అభిప్రాయాన్ని మార్చవచ్చు. దాన్ని సాధించడం నిజంగా ఎంతో మంచిదే.

మరొకవైపు, మీరు గృహస్థునితో సంతృప్తికరమైన సంభాషణ జరిపివుండవచ్చు. ఆయన గుర్తుంచుకోవాలని మీరు అనుకుంటున్న ముఖ్య విషయాన్ని మళ్ళీ ఎందుకు చెప్పకూడదు? ఆ విషయానికి సంబంధించినది ఏదైనా చేసేందుకు ఆయనను పురికొల్పే మాటలను కూడా చెప్పండి.

మీరు మరొక సమయంలో మరెక్కువగా చర్చించే అవకాశమున్నట్లు గ్రహిస్తే, వాళ్ళు దాని కోసం ఎదురు చూసేందుకు ఏదైనా కారణాన్నివ్వండి. అదెలాగంటే ఒక ప్రశ్న అడగండి, బహుశా లేఖనముల నుండి తర్కించడంలో (ఆంగ్లం) గానీ గృహ బైబిలు అధ్యయనాల కోసం రూపొందించబడిన ప్రచురణలో గానీ చర్చించబడిన ఒక ప్రశ్న అడగవచ్చు. మత్తయి 28:19,20 వచనాల్లో వ్రాయబడినట్లు యేసు ఉంచిన లక్ష్యాన్ని మీ మనస్సులో ఉంచుకోండి.

మీరు ఒక గృహ బైబిలు అధ్యయనాన్ని ముగించబోతున్నారా? చర్చాంశాన్ని మళ్ళీ పేర్కొనడం, చర్చించిన దాన్ని గుర్తుంచుకోవడానికి విద్యార్థికి సహాయపడుతుంది. పునఃసమీక్షా ప్రశ్నలు ఉపయోగించడం విద్యార్థి మనస్సులో కీలకాంశాలను ముద్రించేందుకు సహాయపడుతుంది, ముఖ్యంగా పునఃసమీక్ష నెమ్మదిగా జరిగితే. అధ్యయనం చేసిన సమాచారం విద్యార్థికి ఎలా ప్రయోజనకరంగా ఉండగలదన్న దాని గురించి గానీ ఆ సమాచారాన్ని ఆయన ఎలా ఇతరులతో పంచుకోగలడన్న దాని గురించి గానీ ఒక ప్రశ్న అడగడం, తాను నేర్చుకున్న దాన్ని ఆచరణాత్మకంగా ఉపయోగించుకునేలా ఆలోచించేందుకు ఆయనకు సహాయపడగలదు.—సామె. 4:7.

మీ ముగింపు మాటలు మీ చర్చ అంతటి సాఫల్యతపై ప్రభావం చూపగలవని జ్ఞాపకముంచుకోండి.

ఎలా చెయ్యాలి?

  • ముగింపు, మీరు ఇప్పటికే తెలియజేసిన విషయాలతో సూటిగా ముడిపడివుండేలా చూడండి.

  • శ్రోతలు తాము విన్నదానికి సంబంధించి ఏమి చేయాలో చూపించండి.

  • మీరు చెప్పే మాటల ద్వారా మీరు చెప్పే విధానం ద్వారా మీ శ్రోతలను పురికొల్పండి.

అభ్యాసం: క్షేత్ర పరిచర్య కోసం రెండు ముగింపులను తయారు చేసుకోండి: (1) గృహస్థుడు అకస్మాత్తుగా విషయాన్ని మార్చేస్తున్నప్పుడూ మాట్లాడడానికి ఎక్కువ సమయం లేనప్పుడూ చెప్పవలసిన మాటలు (2) మీ తర్వాతి సందర్శనంలో చర్చను కొనసాగించేందుకు అవసరమైన నిర్దిష్ట ప్రశ్న.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి