కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g20 No. 3 పేజీలు 4-5
  • వాస్తవాలు తెలుసుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వాస్తవాలు తెలుసుకోండి
  • తేజరిల్లు!—2020
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సమస్య
  • బైబిలు సలహా
  • వాస్తవాల్ని తెలుసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి?
  • మీరేం చేయవచ్చు?
  • వివక్ష​—⁠అది మీకూ అంటుకుందా?
    తేజరిల్లు!—2020
  • దురభిమానానికి మీరు గురౌతున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • వివక్ష అంతం కావడం
    తేజరిల్లు!—2004
  • వివక్షకు ఉన్న వివిధ రూపాలు
    తేజరిల్లు!—2004
మరిన్ని
తేజరిల్లు!—2020
g20 No. 3 పేజీలు 4-5
ఆటోమొబైల్‌ ఫ్యాక్టరీలో ఇద్దరు మగవాళ్లు ఒకామెను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆమె కంగారుపడుతున్నట్టు కనిపిస్తోంది.

వాస్తవాలు తెలుసుకోండి

సమస్య

సాధారణంగా వివక్షకు కారణం, వాస్తవాలు తెలుసుకోకపోవడమే. ఈ ఉదాహరణలు పరిశీలించండి:

  • సైన్స్‌ లేదా టెక్నికల్‌ రంగాల్లో ఉద్యోగాలు చేయడానికి స్త్రీలు పనికిరారు అని కొంతమంది అనుకుంటారు.

  • తక్కువ కులం వాళ్లను పెళ్లి చేసుకుంటే అపవిత్రం అవుతామనే తప్పుడు అభిప్రాయం చాలామందికి ఉంది.

  • అంగవైకల్యం ఉన్న వాళ్లందరూ ఎప్పుడూ బాధగా, దిగులుగా ఉంటారని చాలామంది పొరపాటు పడతారు.

అలాంటివి నమ్మేవాళ్లు కొన్ని ఉదాహరణలు లేదా రుజువులు చూపించి తమ అభిప్రాయమే సరైనదని వాదిస్తారు. అంతేకాదు తమ అభిప్రాయాన్ని ఒప్పుకోని వాళ్లందర్నీ తెలివితక్కువ వాళ్లలా చూస్తారు.

బైబిలు సలహా

“జ్ఞానం లేకుండా ఉండడం మంచిదికాదు.”—సామెతలు 19:2.

అంటే . . . నిజానిజాలు తెలుసుకోకపోతే మనం తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుంటాం. వాస్తవాల్ని కాకుండా అపోహల్ని నమ్మితే, అనవసరంగా ప్రజల మీద తప్పుడు అభిప్రాయం ఏర్పర్చుకుంటాం.

బైబిలు వివక్షను ప్రోత్సహిస్తుందా?

ప్రోత్సహిస్తుందని కొంతమంది అంటారు. కానీ బైబిలు ఏమంటోంది?

  • మనుషులందరూ ఒకే వ్యక్తి నుండి వచ్చారు: దేవుడు “ఒకే ఒక్క మనిషి నుండి అన్నిదేశాల మనుషుల్ని చేశాడు.”—అపొస్తలుల కార్యాలు 17:26.

  • దేవుడు పక్షపాతి కాదు: “దేవునికి పక్షపాతం లేదు . . . ప్రతీ జనంలో, తనకు భయపడి సరైనది చేసేవాళ్లను ఆయన అంగీకరిస్తాడు.”—అపొస్తలుల కార్యాలు 10:34, 35.

  • దేవుడు పైరూపాన్ని కాదు మనసును చూస్తాడు: “మామూలు మనిషి, కంటికి కనిపించేదాన్నే చూస్తాడు; కానీ యెహోవా హృదయాన్ని చూస్తాడు.”—1 సమూయేలు 16:7.a

a దేవుని పేరు యెహోవా అని బైబిలు చెప్తుంది.

వాస్తవాల్ని తెలుసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి?

ప్రజల గురించి వాస్తవాలు తెలుసుకుంటే, వాళ్ల మీద జరిగే తప్పుడు ప్రచారాన్ని నమ్మం. అంతేకాదు ఏదైనా ఒక వర్గం ప్రజల గురించి మనం విన్న సమాచారం తప్పు అని తెలుసుకున్నప్పుడు, మిగతా వర్గాల ప్రజల గురించి విన్న మాటల్లో కూడా నిజం ఉండకపోవచ్చని గుర్తిస్తాం.

నిజ జీవిత అనుభవం: జోవిక (బాల్కన్స్‌)

ముందటి పేజీల్లో ప్రస్తావించిన జోవిక ఇలా అంటున్నాడు: ‘ఒక మైనారిటీ గుంపు గురించి మా దేశస్థులు తక్కువగా మాట్లాడడం; వాళ్ల గురించి వార్తల్లో, టీవీ కార్యక్రమాల్లో చెడుగా చెప్పడం చిన్నప్పటి నుండి వింటున్నాను. దాంతో నేను ఆ ప్రజల మీద వివక్షను, చివరికి ద్వేషాన్ని పెంచుకున్నాను. అది తప్పేమీ కాదని బలంగా నమ్మాను.’

“కానీ సైన్యంలో చేరాక, ఆ మైనారిటీ గుంపుకు చెందిన వాళ్లతోనే కలిసి ఉండాల్సి వచ్చింది, కలిసి పనిచేయాల్సి వచ్చింది. కొంతకాలానికి నేను వాళ్ల గురించి ఎక్కువ విషయాలు తెలుసుకున్నాను. వాళ్ల భాష నేర్చుకోవడం, వాళ్ల పాటలు వినడం మొదలుపెట్టాను. వాళ్లతో కలిసి ఉండడం నాకు నచ్చింది, వాళ్ల విషయంలో నా అభిప్రాయం మారింది. అయితే, వాళ్ల మీద ఒకప్పుడు నాకున్న వివక్ష మళ్లీ మొదలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ల గురించి చెడుగా చెప్పే వార్తల్ని వినకూడదని నిర్ణయించుకున్నాను. వాళ్లను ఎగతాళి చేసే సినిమాల్ని, కామెడీల్ని చూడడం కూడా మానేశాను. వివక్ష అనేది చివరికి కోపంగా, ద్వేషంగా మారే అవకాశం ఉందని నాకు తెలుసు.”

మీరేం చేయవచ్చు?

  • సాధారణంగా ఒక వర్గం గురించి చెప్పే విషయాలు అందులోని ప్రతీ ఒక్కరికీ వర్తించవు అని గుర్తుంచుకోండి.

  • వాళ్ల గురించి మీకు అన్ని విషయాలూ తెలియకపోవచ్చు అని గుర్తించండి.

  • నమ్మదగిన వాళ్ల నుండి, నమ్మదగిన సంస్థల నుండి వాస్తవాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

వాళ్లు ద్వేషాన్ని విడిచిపెట్టారు

చిత్రాలు: 1. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. 2. ఆ ఇద్దరిలో ఒకతను స్నేహితుల మధ్య నిలబడి నవ్వుతున్నాడు.

వివక్షను తీసేసుకోవడానికి ఒక అరబీయునికి, యూదునికి ఏం సహాయం చేసింది?

విశ్వసనీయ ప్రేమ ద్వేషంపై ఎప్పుడు విజయం సాధిస్తుంది? అనే వీడియో చూడండి. jw.org/teలో ఈ టైటిల్‌ టైప్‌ చేసి వెతకండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి