కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 11/8 పేజీలు 16-17
  • ఆస్వాదించదగిన ఓ అంతర్జాతీయ పండు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆస్వాదించదగిన ఓ అంతర్జాతీయ పండు
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అనాస పండు మరియు దాని చెట్టు
  • దాన్నెలా పండిస్తారు?
  • నిజమైన రుచి
  • ‘బహుగా ఫలించండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • అరటి పండు—ఓ అద్భుతమైన పండు
    తేజరిల్లు!—1994
  • ‘ఓర్పుతో ఫలించేవాళ్లను’ యెహోవా ప్రేమిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
తేజరిల్లు!—1995
g95 11/8 పేజీలు 16-17

ఆస్వాదించదగిన ఓ అంతర్జాతీయ పండు

మెక్సికోలోని తేజరిల్లు! విలేఖరి

దానిని మొదట రుచి చూసిన ఐరోపీయులు 1493లో వెస్ట్‌ ఇండీస్‌ అన్వేషణలోపడ్డ క్రిస్టఫర్‌ కొలంబస్‌ మరియు ఆయన సహచరులే అయ్యుండవచ్చు. అది స్పెయిన్‌ రాజుకు కూడా పంపించబడింది, ఆయన కూడా దాని రుచిని ఆస్వాదించాడు. నావికులు అమెరికా అంతటా దానిని సుప్రసిద్ధం చేశారు, మరియు 1548లో దానిని పండించడానికి ఫిలిప్పీన్‌ దీవుల్లోకి తీసుకువెళ్ళారు.

తరువాత, దాదాపు 1555లో ఆస్వాదించగల ఈ పండు ఫ్రాన్సు అంతటా ప్రయాణం చేసింది. మరి 1700ల నాటికే, కొందరు ఐరోపా రాజుల బల్లలపై ఎంతో సగర్వంగా రుచికరమైన పండుగా ప్రదర్శించబడేది. ఇది ఎంత ప్రసిద్ధమైందంటే, అది తరువాత ఐరోపాలో మిగిలిన ప్రాంతాలకు, ఆసియా మరియు ఆఫ్రికాల్లోనికి కూడా వ్యాపించింది. ప్రస్తుతం, అది ముఖ్యంగా బ్రెజిల్‌, హవాయి, మెక్సికో, ఫిలిప్పీన్స్‌, థాయిలాండ్‌ మరియు దానికనువైన వాతావరణం మరియు నేల గల కొన్ని దేశాల్లోనూ పండించబడుతుంది.

అలా దాదాపు ఐదు శతాబ్దాలు ప్రయాణించిన తరువాత, అది దాని పుట్టినిల్లయిన అమెరికా నుండి సుదూర ప్రదేశాల్లోకి చేరుకుంది. మేము ఏ పండు గురించి మాట్లాడుతున్నామో మీకు తెలుసా? అదే, ఆస్వాదించదగిన ఆ అనాసపండు గురించే.

మెక్సికోలో మాట్సాటిల్‌ అని, కరీబియాలో ఆననా అని, మధ్య మరియు దక్షిణ అమెరికాల్లో నానా అని అది పిలువబడుతుంది. అది పైన్‌ వృక్ష ఫలంలా (దేవదారు పండులా) ఉంటుంది గనుక దానిని పీన్యా అని పిలిచింది స్పెయిన్‌వారేనని అనిపిస్తుంది. నేడు అది ఆంగ్లంలో పైన్‌ఆపిల్‌ అని పిలువబడుతుండగా, స్పానిష్‌ భాషలో పీన్యా లేదా ఆననాస్‌ అని పిలువబడుతుంది. దాని పేరు ఏదైనప్పటికీ, దాని రుచించి చూసినవారు అది నోటికి ఎంతో ఆస్వాద్యమైనదని ఒప్పుకుంటారు.

అనాస పండు మరియు దాని చెట్టు

అనాస పండు చూడడానికి ఎలా ఉంటుంది? అది అండాకారంలో ఉండి, చెట్టు మధ్యలో ఉంటుంది. ఆ పండు గట్టి పెంకుతో కప్పబడి ఉంటుంది, దాని పై భాగంలో చిన్నవిగా ఉండి, కొంత గట్టిదనం గల పచ్చని అనేక ఆకులతో తయారైన ముచ్చుక ఉంటుంది. పొడుగ్గా ఉండే, చాకుల ఆకారంలోని అనాస చెట్టు ఆకులు దాని మొదలు నుండే వివిధ దిశల్లోకి పెరుగుతాయి. మొక్క 60 నుండి 90 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది, మరి పండు రెండు నుండి నాలుగు కిలోల బరువు ఉండవచ్చు.

అది ఇంకా చిన్నగా ఉన్నప్పుడు, అది పైన్‌ వృక్ష ఫలంలాగా ఉండి, దాని తొక్క వంగ వన్నెలో ఉంటుంది. అది పక్వానికి వచ్చినప్పుడు ఆకుపచ్చ రంగుకు వస్తుంది, సాధారణంగా అది పండినప్పుడు పసుపుపచ్చ రంగులోకి, ఆకుపచ్చ రంగు కలగలిసిన ఊదారంగులోకి, లేదా ఎర్రని ఛాయలోకి మారుతుంది. దాని గుజ్జు పండినప్పుడు, దాని రుచి తియ్యగా మంచివాసనతో, రసముతో నిండి ఉంటుంది.

దాన్నెలా పండిస్తారు?

మీరు అనాసపండును ఎలా పండిస్తారు? మొట్టమొదట, ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపించేటటువంటి ఇసుకతో ఉన్న, సేంద్రియ పదార్థం మెండుగాగల, ఆమ్లము, తక్కువ ఖనిజ లవణం, ఎక్కువ తేమ గల నేల దానికి అవసరం. తర్వాత, పండు మొదలు చుట్టూ మొలకెత్తేవియు మరియు పండును కోసిన తర్వాత కూడా మిగిలి ఉండే చిన్న అంకురాలను నాటాలి. లేదా అనాస పండు పైన ఉండే ముచ్చుకను కోసివేసి నాటవచ్చు. అది పెద్దదై కాయ కాసేందుకు ఒక సంవత్సరానికి పైగా పడుతుంది కనుక, దాని ఫలాన్ని తిని ఆనందించాలంటే కొంత సహనం అవసరం.

అనాస పండ్లను 25 సంవత్సరాలకు పైగా పండిస్తున్న ఆంటోనియా ఉపయోగించిన ఒక పద్ధతిని ఈ విధంగా వివరించాడు: “కాయలు పెరగనారంభించక ముందే చెట్టు మధ్యలో కొంత కాల్షియమ్‌ కార్బైడ్‌ను వేయడం అవసరం. ఇలా చేయడం ద్వారా పంటనంతా ఒకేసారి కోయవచ్చు, ఎందుకంటే సహజంగా పెరగనిస్తే, కొన్ని కాయలు మిగిలినవాటి కన్నా ఎంతో వేగంగా పెరుగుతాయి, పంట కోయడం మరింత కష్టంగా ఉంటుంది.”

అనాసపండు పక్వానికి వచ్చినప్పటికీ ఇంకా పండనప్పుడు అది సూర్యరశ్మి వల్ల వాడి పోకుండా ఉండేందుకు దానిని కప్పి పెట్టాలి. దానిని కాగితంతోనో లేదా అదే మొక్క ఆకులతోనో కప్పుతారు. పండే సమయమైన తరువాత, అనాసపండు కోతకు సిద్ధంగా ఉందన్నమాట. దాని పెంకును కోసి పారేసి, దాని ముక్కలను ఆస్వాదించండి! కాని జాగ్రత్తగా ఉండండి. పండు మధ్య భాగాన్ని తినడం నాలుకకు దురద కలిగిస్తుంది. అందుకే కొందరు ప్రజలు గుజ్జును మాత్రమే తిని మధ్య భాగాన్ని పారవేస్తారు.

తియ్యని రసము గల అనాస పండును తిని చూడాలని మీరనుకుంటే, అది పైకి ఎలా కనిపిస్తుంది అనే దాన్ని బట్టి తీసుకోకండి. ఆంటోనియా వాటిలో కొన్నింటిని మాకు చూపిస్తూ ఈ విధంగా వివరిస్తున్నాడు: “కొందరు అనాస పండు పైరంగును చూసి, అంటే ఆకుపచ్చ రంగులో ఉందా లేక పసుపుపచ్చ రంగులో ఉందా అని చూసి ఎన్నుకుంటారు. కాని పైన అది ఆకుపచ్చ రంగులో ఉన్నప్పటికి ఆ అనాస పండి ఉండవచ్చు. మీ వ్రేళ్ళతో దానిని కొట్టి చూడాలి. బొంగు ధ్వని లేదా ఏమీ లేని ధ్వని వస్తే, దాని గుజ్జు తెల్లగా ఉండి, దాని రుచి చప్పగా ఉంటుంది. అయితే నీళ్ళు ఉన్నాయా అన్నట్లు చప్పుడు గట్టిగా వస్తే, దానిని తినవచ్చు, అది తియ్యగాను రసంతోను ఉంటుంది.” ఈ పండ్లలో అనేక రకాలు ఉన్నాయి, కాని ఎక్కువ ప్రసిద్ధమైనది మెత్తగా ఉండే కేన్‌ (కెయినా) అని పిలువబడే పండే.

నిజమైన రుచి

రసం లేదా పండు ముక్కల యొక్క ఆహ్లాదకరమైన రుచిని ఆస్వాదించడమే కాక, కొన్ని దేశాల్లో ముందుగా సిద్ధం చేయబడి లభ్యమయ్యే సిరప్‌గా కూడా త్రాగి ఆనందించవచ్చు. అలాగే, అనాస పండులో కార్బోఫైడ్రేట్‌లు, పీచు, మరియు A మరియు C విటమిన్లు కూడా ఉన్నాయి.

మెక్సికోలో పైనాపిల్‌ తొక్కలతో తయారు చేసిన సేదతీర్చే పానీయాలను ఆస్వాదించగలరు. మీకై మీరే తయారు చేసుకోవాలంటే, ఒక గాజు పాత్రలో నీళ్ళలో పంచదార వేసి, తొక్కలను అందులో రెండో మూడో రోజులు ఉంచాలి. అది ఒకసారి పుల్లగైన తరువాత, మీరు దానిని ఐస్‌లో వేసుకుని చల్లని పానీయంగా సేవించవచ్చు. ఇది చక్కగా సేదతీర్చే పానీయం, టెపాకె అని ఇది పిలువబడుతుంది, దీని రుచి తియ్యగాను పుల్లగాను ఉంటుంది. మీకొక గ్లాసెడు కావాలా? ఫిలిప్పీన్స్‌లో, పీచు కొరకు వాటి ఆకుల కొరకు అనాసను పండిస్తారు. మసకగా ఉండే తెల్లని పల్చని మంచి వస్త్రాల తయారీలో వీటిని ఉపయోగిస్తారు. చేతి రుమాళ్ళు, తువాళ్ళు, బెల్టులు, చొక్కాలు, మరియు పిల్లల, స్త్రీల వస్త్రాల తయారీలోను దీనిని ఉపయోగిస్తారు.

గత కొన్ని శతాబ్దాలుగా అనాస పండు అది పండించబడని అనేక దేశాలకు ఎగుమతి చేయబడుతోంది. దాని రుచిని ఆస్వాదించేవారందరూ అది ప్రపంచమంతటా తన ప్రయాణాన్ని కొనసాగించి, మానవజాతికి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉండాలని ఆశిస్తారు.

[Picture Credit Line on page 16]

Above: Pineapple. Century Dictionary

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి