కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g95 3/8 పేజీలు 11-12
  • మనం బాధపడుతుంటే చూడడం దేవునికి ఇష్టమా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మనం బాధపడుతుంటే చూడడం దేవునికి ఇష్టమా?
  • తేజరిల్లు!—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను”
  • స్వయంగా కలిగించుకున బాధనుబట్టి దేవుడు సంతోషిస్తాడా?
  • ఉపవాసం దేవునికి దగ్గరవడానికి సహాయం చేస్తుందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ఉపవాసం గురించి బైబిలు ఏమి చెప్తుంది?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • జ్ఞానానికి సన్యాసమే కీలకమా?
    తేజరిల్లు!—1997
  • ఉపవాసానికి కాలం చెల్లిందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
మరిన్ని
తేజరిల్లు!—1995
g95 3/8 పేజీలు 11-12

బైబిలు ఉద్దేశము

మనం బాధపడుతుంటే చూడడం దేవునికి ఇష్టమా?

ఓ పెద్ద చెక్క సిలువ యొక్క బరువును మోయడానికి కష్టపడుతూ, శిరస్సుపై ఉన్న ముళ్ల కిరీటంనుండి రక్తపు బొట్లు చిందుతుండగా, ఓ మనిషి జనుల మధ్యనుండి తొట్రుపడ్తూ వెళ్తున్నాడు. “శిక్షను అమలుచేసే” స్థలానికి చేరుకున్న తర్వాత, ఆయనను సిలువపై పడుకోబెట్టి; పెద్దపెద్ద మేకులను ఆయన చేతుల్లోకి దిగ్గొట్టారు. మేకులు శరీరాన్ని చీల్చుతుంటే ఆయన బాధతో మెలికలు తిరుగుతున్నాడు. ఆ సిలువ నిలబెట్టబడినప్పుడు, ఆ బాధ మరింత తీవ్రమవుతుంది. ఫిలిప్పైన్‌ పత్రికైన పనోరమ ప్రకారం, ఫిలిప్పైన్స్‌లో అటువంటి బాధాకరమైన ఆచారాలు పరిశుద్ధ వార ఉత్సవాల్లో క్రమంగా ఆచరింపబడ్తూనే ఉంటాయి.

పైన వివరించినది యేసు అనుభవించిన బాధల ఆధునిక-దిన వివరణ మాత్రమే. అయితే ఈ మనిషి కేవలం నాటకంలోని ఓ ఘట్టాన్ని నటించలేదు. ఆ మేకులు, ఆ రక్తం, ఆ బాధ—అవన్నీ వాస్తవమైనవే.

మరోచోట, రోమన్‌ కాథోలిక్‌ భక్తులు, యేసుయొక్క బాధలను అనుభవించాలన్న తమ కోరికతో, బహిరంగంగా తమనుతాము కొరడాలతో కొట్టుకుంటూ కనిపిస్తారు. ఎందుకు? తమ బాధలు అనారోగ్యంగా ఉన్న తమ ప్రియమైన వారు స్వస్థత పొందటం వంటి అద్భుతాలను ఉత్పన్నంచేయగలవన్న నమ్మకంతో కొంతమంది అలా చేస్తారు. మరికొంతమంది తమ పాపాలను పరిహరించుకోడానికి అలా చేస్తారు. తమ స్వంత రక్తం చిందించబడేంత వరకు వాటికి పరిహారం లభించదని వారి భయం. “బాధ అనేది మనస్సును, ఆత్మను మంచిగా శుద్ధీకరిస్తుంది. . . . ఒక పాపి బాధవలన, పాపాలనుండి శుద్ధీకరించబడి, భారాలనుండి విడిపించబడి స్వచ్ఛంగా రావలసిందిగా భావించబడతాడని” ది ఫిలిప్పినోస్‌ అనే పుస్తకం వివరిస్తుంది.

అయితే, స్వయంగా బాధ కలిగించుకోవడం ఫిలిప్పైన్స్‌లోని కాథోలిక్కులకు మాత్రమే పరిమితంకాదు. వేర్వేరు మతాలు మరియు వివిధ ప్రాంతాల ప్రజలు, స్వయంగా కలిగించుకునే బాధలు దేవుని యెదుట యోగ్యతను సంపాదించగలవని నమ్ముతారు.

ఉదాహరణకు, బుద్ధుడైన సిద్ధార్థ గౌతముడు సత్యాన్ని గూర్చిన తన అన్వేషణలో భార్యను కుమారున్ని వదిలిపెట్టి అరణ్యానికి పోయి, అక్కడ ఆరు సంవత్సరాలు సన్యాసి జీవితాన్ని గడిపాడు. ఆయన వికృతమైన మరియు బాధాకరమైన భంగిమల్లో గంటల తరబడి కూర్చున్నానని, ఆ తర్వాత దీర్ఘకాలంపాటు రోజుకు ఒక బియ్యపు గింజను మాత్రమే తింటూ ఉన్నానని చెప్పాడు, అలా చేయడం వలన ఆయన ఎంతగా కృంగి కృశించిపోయాడంటే: “నా ఉదరముపైన ఉన్న చర్మము వచ్చి నా వెన్నెముకను అంటిపెట్టుకున్నది” అని చెప్పాడు. అయితే స్వయంగా హింసించుకోవడం ఆయన అనుకున్న జ్ఞానాభివృద్ధిని ఎంతమాత్రం కలిగించలేదు.

అదేమాదిరిగా, ఇండియాలోని హిందూ సన్యాసులు వివిధ తపస్సులను చేశారు అవి కొన్నిసార్లు తీవ్రస్థాయిలో కూడా ఉండేవి—అగ్నిలో పడుకోవడం, గ్రుడ్డివాళ్లయ్యేంతవరకు సూర్యునివైపు చూస్తుండటం, ఎక్కువ సమయం వరకూ ఒకే కాలుపై నిలబడటం లేక మరొక విధమైన వికృత భంగిమల్లో ఉండటం వంటివి. కొంతమంది సన్యాసుల గొప్పదనం, ఒక పట్టణాన్ని శత్రువుల దాడినుండి కూడా కాపాడగలిగేంత అధికంగా ఉండేదని తలంచబడేది.

అదేవిధంగా, బైబిలు చెప్పినట్లుగా బయలు ఆరాధికులు, “రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతోను తమ దేహములను కోసికొనుచు” వాళ్ల దేవత అవధానాన్ని పొందటానికి వృథాగా ప్రయత్నించారు.—1 రాజులు 18:28.

“మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను”

యెహోవా తాను ఎన్నుకున్న జనాంగానికి “మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను,” అని ఆజ్ఞాపించడం వాస్తవమే అయినప్పటికీ, అది ఉపవాసం ఉండటమని సాధారణంగా భావించబడుతుంది. (లేవీయకాండము 16:31) అలా ఉపవాసం చేయటం, పాపాల గురించి దుఃఖాన్ని మరియు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తుంది లేక కృంగదీసే పరిస్థితులను సూచిస్తుంది. అలా, ఉపవాసమనేది స్వయంగా విధించుకున్న శిక్షలాంటిది కాదుగానీ, దేవుని యెదుట తనను తాను తగ్గించుకోడాన్ని సూచిస్తుంది.—ఎజ్రా 8:21.

కొంతమంది యూదులైతే, ఆత్మను బాధించుకోవడంలో ఇమిడివున్న కృంగుదలకు యోగ్యత ఉందని మరియు అది తిరిగి దేవుడు వారికి ఎంతో కొంత చెల్లింప బద్ధుడ్ని చేస్తుందనే తప్పుడు అభిప్రాయాన్ని కల్గివున్నారు. అటువంటి ప్రతిఫలం ఏమీ లభించకపోతే, తాము పాత్రులమని వారభిప్రాయపడిన ప్రతిఫలాన్ని గూర్చి అహంకారపూరితంగా ఇలా అడుగుతారు: “మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు?”—యెషయా 58:3.

అయితే వాళ్లు చేసింది తప్పు. సరైన మత ఉపవాసంలో సన్యాసత్వంగాని, శారీరక బాధకు లేక అసౌకర్యానికి ఏదో యోగ్యత ఉన్నట్లు, శరీరాన్ని ఆకలితో బాధించుకోవడం గానీ ఇమిడిలేదు. తీవ్రమైన భావోద్రేకాలు వారి ఆకలిని తగ్గించి ఉండవచ్చు. మనస్సు సమస్యలతో నొక్కి పెట్టబడితే, శరీరంకూడా ఆహారాన్ని కోరకపోవచ్చు. ఉపవాసం చేస్తున్నతని తీవ్రభావాలను ఇది దేవునికి తెలియజేస్తుంది.

స్వయంగా కలిగించుకున బాధనుబట్టి దేవుడు సంతోషిస్తాడా?

ప్రేమగల సృష్టికర్త ప్రజలు తమను తాము హింసించుకోవడం చూసి సంతోషిస్తాడా? క్రైస్తవులు ‘క్రీస్తు శ్రమలలో పాలివారు కావలసి’ వస్తుందనేది వాస్తవమైననూ, క్రైస్తవులు తమకై తాము శ్రమలను అధికం చేసుకోవాలని లేక హతసాక్షి కిరీటాన్ని పొందేందుకు ఎదురుచూడాలని దాని అర్థం కాదు.

కచ్చితంగా, యేసు సన్యాసి కానేకాదు. ఆయన శిష్యులు ఉపవాసం చేయలేదని మతనాయకులు ఫిర్యాదు చేశారు, ‘వీడు తిండిబోతును మద్యపాని’ అని కూడా ఆయనను వాళ్లు నిందించారు. (మత్తయి 9:14; 11:19) యేసు అన్నింటియందు పరిమితిని కనపర్చాడు, తననుండి లేక ఇతరులనుండి సహేతుకమైన దానికంటే ఎక్కువేమి అపేక్షించలేదు.—మార్కు 6:31; యోహాను 4:6.

జీవితావసరాలను లేక సౌకర్యాలను త్యజించడం దేవుని అనుగ్రహాన్ని సంపాదించగలదన్నట్లు, వైరాగ్యానికి ఏ ఆధారం ఉన్నట్లు మనం లేఖనాల్లో కనుగొనలేము. అపొస్తలుడైన పౌలు అటువంటి బాధాకరమైన ఆచారాలనుగూర్చి చెబుతున్న మాటలను గమనించండి: “అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను దేహశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని యెంచబడుచున్నవేగాని, శరీరేచ్ఛా నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు.”—కొలొస్సయులు 2:23.

మార్టిన్‌ లూథర్‌, సన్యాసిగా ఉన్నప్పుడు, అక్షరార్థంగా తనను తాను హింసించుకున్నాడు. దేవుని దగ్గరకు చేరడానికి అవి రెండు మార్గాలను అంటే ఉన్నతమైనదాన్ని, తుచ్ఛమైనదాన్ని ప్రోత్సహిస్తాయని, అయితే, యేసుక్రీస్తుపై, ఆయన తండ్రియైన యెహోవాపై విశ్వాసముంచటమే—రక్షణ పొందడానికి ఏకైక మార్గమని లేఖనాలు బోధిస్తున్నాయని చెబుతూ ఆయన తర్వాత, ఆ అలవాట్లను నిరాకరించాడు. (యోహాను 17:3) మరోవైపు, బాధాకరమైన ఆచారాలను కొందరు స్వయం-రక్షణగా దృష్టిస్తున్నారు.

వైరాగ్యాన్ని గురించి చర్చ్‌ హిస్టరీ ఇన్‌ ప్లేన్‌ లాంగ్వేజ్‌ అనే పుస్తకం ఇలా వ్యాఖ్యానిస్తుంది: “సన్యాసత్వానికి మద్దతునివ్వడమనేది మానవుడ్ని వికృతంగా దృష్టించటమే. మృత దేహానికి సంకెళ్లు వేయబడిన ఖైదీవలె, ఆత్మ శరీరానికి బంధించబడి ఉందని సన్యాసులు చెబుతున్నారు. మానవ జీవితాన్నిగూర్చిన బైబిలు దృక్పథం అది కాదు.” అవును, స్వయంగా కలిగించుకునే బాధ దేవున్ని ప్రీతిపరుస్తుందనే అభిప్రాయం లేఖనరహితమైనది. దేహంతో సంబంధం ఉన్న ప్రతిదీ దుష్టమైనదని మరియు ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే దాన్ని ఎంతమేరకు వీలైతే అంతమేరకు కష్టపెట్టుకోవాలన్న దుష్టబోధపై అది ఆధారితమై ఉంది.

మనం సంతోషంగా ఉండాలని యెహోవా కోరుకుంటాడు కాబట్టి, సంతోషంగల దేవుడ్ని ఆరాధించడంలో సన్యాసిగా మారాలనే విషయం ఎక్కడా లేనేలేదు. (ప్రసంగి 7:16) కావున, స్వయంగా కలిగించుకునే బాధలు రక్షణకు మార్గమని మనకు లేఖనాల్లో ఎక్కడ కూడా చెప్పబడలేదు. దానికి భిన్నంగా, క్రీస్తు రక్తం అలాగే దానియందు మనం విశ్వాసముంచడం మాత్రమే మన పాపాలను శుద్ధీకరించగలదని దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తుంది.—రోమీయులు 5:1; 1 యోహాను 1:7.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి