మీరు శ్రద్ధగా ఆలకిస్తారా?
ఒక ఖరీదైన బహుమానాన్ని మీ జీవితమందు ప్రతి వ్యక్తికి ఇవ్వగలిగే స్తోమత మీకుందని ఊహించండి. వారెంతగా సంతోషించి, మెచ్చుకుంటారో కదా! వారికి నిజంగా అవసరమైన ఒక విశేషమైన బహుమానాన్ని మీరు ఇవ్వ గలరు. ఒక్క పైసా కూడా ఖర్చుకాదు. ఆ బహుమానం ఏమిటి? మీ దయాపూర్వకమైన శ్రద్ధే. అనేకమంది ప్రజలు శ్రద్ధచూపబడాలని కోరుకుంటారు, వారు దానిని పొందినప్పుడు మెప్పుదలతో ప్రతిస్పందిస్తారు. శ్రేష్ఠమైన శ్రద్ధను చూపడానికి, మీరు శ్రద్ధగా ఆలకించేవారైయుండాలి.
మీరు తండ్రి (తల్లి) స్థానంలో లేక ఒక యజమాని లేక సలహా మరియు నడిపింపు కొరకు మీ వద్దకు ప్రజలు వచ్చే ఏ స్థానమందైనా ఉండి పనిచేస్తున్నట్లయితే, మీరు శ్రద్ధగా ఆలకించవలసివుంది. మీరు శ్రద్ధగా విననట్లయితే, మీలోని అశ్రద్ధను ప్రజలు పసిగట్టగలరు, మరియు దాని మూలంగా మీ మంచి పేరు పోతుంది.
సలహా ఇవ్వమని మిమ్మల్ని తరుచుగా అడగక పోయినప్పటికిని, ఒక స్నేహితుడు ఓదార్పు కొరకు మీ దగ్గరకు వస్తున్నట్లుగానే మీరు ప్రజలను శ్రద్ధగా ఆలకించాల్సిన అవసరముంది. బైబిలు సామెత ఒకటి చెబుతున్నట్లుగా, వినక ముందు మాట్లాడుట వలన అవమానము కలుగవచ్చును. (సామెతలు 18:13) అట్లయిన, మీరు శ్రద్ధగా ఆలకించేవారని చూపించుకొనగల్గే కొన్ని మార్గాలు ఏమిటి?
ఇమిడి ఉండడం
శ్రద్ధగా ఆలకించేవాడు అంటే ఏమిటి? వెబ్‌స్టర్స్ న్యూ కాలేజియేట్ డిక్షనరీ “శ్రద్ధను” ఇలా నిర్వచిస్తోంది: “మరొకని భావాలలో లేక తలంపులలో భాగం వహించే సామర్థ్యము.” అదే డిక్షనరీ “ఆలకించుటను” ఇలా నిర్వచిస్తోంది: “ఆలోచనా పూర్వకశ్రద్ధతో వినడము.” కాబట్టి శ్రద్ధగా ఆలకించువాడు ఒకడు చెబుతున్న దానిని వినడం కన్నా ఎక్కువే చేస్తాడు. అతను శ్రద్ధను నిలుపుతాడు, ఒకని ఆలోచనల్లో మరియు భావాల్లో భాగం వహిస్తాడు.
మీ మనస్సును పరిభ్రమింపనివ్వక, మీరు వింటున్న దాంట్లో ఇమిడిపోవడం దీనికవసరం. మీరు ఎలా ప్రత్యుత్తరమివ్వాలని ఆలోచించడము కూడా, వినడాన్నుండి ప్రక్కకు మళ్లిస్తుంది. అవతలి వ్యక్తి చెబుతున్న దానిపై స్థిరంగా కేంద్రీకరించేటట్లు మిమ్మల్ని మీరు తర్ఫీదు చేసుకోండి.
మీతో మాట్లాడుతున్న వ్యక్తిని సూటిగా చూడండి. మీరు ఎటో చూస్తున్నట్లయితే, మీకు ఇష్టంలేనట్లు కన్పడతారు. అతని ముఖకవళికలను, కదలికలను గమనించండి. అతను చిరునవ్వు నవ్వుతున్నాడా లేక ముఖం చిట్లించుకొని యున్నాడా? అతని కన్నులు హాస్యాన్ని, విచారాన్ని లేక అనుమానాన్ని ప్రతిబింబిస్తున్నాయా? అతను చెబుతున్నవేమైనా చెప్పుకోకూడనివి అని సూచిస్తున్నాయా? మీ ప్రత్యుత్తరాన్ని గూర్చి మీరు బాధపడకండి; మీరు శ్రద్ధనిలిపి ఆలకించడం వల్లనే అది జరుగుతుంది.
ఆలకిస్తున్నప్పుడు, మీ తలను ఊపుతూ, ‘ఆహా’, ‘అలాగా’ అనే భరోసాలను ఇవ్వండి. మీరు వాటిపై మనస్సు నిలిపారని అది చూపిస్తుంది. మీరు నిజంగా వినకపోయినప్పటికిని, మీరు తల ఊపడం, భరోసాలివ్వడం మీరు ఆలకిస్తున్నారని ప్రజలు అనుకునేటట్లు చేస్తాయని అనుకోవద్దు. నిజానికి, అలాగే తల ఊపుతూనే ఉండడం మీ అసహనాన్ని వెల్లడి చేయగలదు. అది మీరు, ‘చెప్పదల్చుకున్నదేదో, తొందరగా చెప్పు’ అని చెపుతున్నట్లుగా ఉంటుంది.
ఏ పరిస్థితులలోనైనా, ఆలకించే పద్ధతులను గురించి మీరు ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదు. మీరు సహజంగా వినేలా చేసుకోండి, మీ ప్రత్యుత్తరాలు మీ యథార్థతను ప్రతిబింబిస్తాయి.
మంచి ప్రశ్నలు కూడా మీరు ఇమిడిపోయారని, మనస్సున పెడ్తున్నారని చూపిస్తాయి. మీరు ఆసక్తి కలిగి ఉన్నారని అవి చూపుతాయి. చెప్పుకోలేని లేక అర్థంకాని విషయాలను వివరంగా తెలుసుకోడానికి అడగండి. వివరణాత్మకంగా తనను గురించి చెప్పుకొనేటట్టు అవతలి వ్యక్తిని ప్రశ్నించండి. అప్పుడప్పుడు అంతరాయం కల్గిస్తున్నానని చింతించకండి, అయితే మరీ అధికంగా చేయవద్దు. విషయాలను బాగా అర్థంచేసుకోవడమనేది ఆలకించే విధానంలో ఒక భాగము. ఎక్కువగా అంతరాయం కల్గించనట్లైతే, అతను చెపుతున్న వాటిని పూర్తిగా గ్రహించాలనే మీ అభిలాషను అవతలి వ్యక్తి మెచ్చుకుంటాడు.
అర్థంచేసుకున్నట్లు చూపండి
మీతో మాట్లాడుతున్న వ్యక్తి యెడల నిజంగా శ్రద్ధ చూపుతున్నప్పటికి, ఇది క్లిష్టమైన భాగం కాగలదు. మీ దగ్గరకు నిరాశచెందిన ఒక వ్యక్తి వచ్చినప్పుడు, ఆశాపూరితమైన సలహాలు, పరిష్కారాలు వెంటనే చెబుతారా? బాధపడిన మరో వ్యక్తితో పోల్చి పరిస్థితి అంత దుఃఖకరమైనదేమీ కాదని సూచించడానికి మీరు తొందరపడ్తున్నారా? ఇది సహాయకరమైనదిగా కనబడుతుంది, అయినా అది ప్రతికూలమైన ప్రభావాన్ని కల్గి ఉండగలదు.
మీరు వినడాన్ని ఆపేసి, పరిష్కరించడాన్ని ప్రారంభించాలనే ముగింపుకి రావడానికి అనేక కారణాలు ఉండవచ్చును. మీ శ్రద్ధగల సలహాలు బాధితుని ఉత్సాహపర్చడానికి మాత్రమేనని మీరు తలంచవచ్చును. లేక “తప్పు” ఏదో దానిని “సరిదిద్దడమే” మీ బాధ్యతని, మరియు అది మీరు చేయలేకపోతే, మీరు సహాయం చేయలేక పోతున్నారని లేక “మీ బాధ్యతను నిర్వహించడం” లేదని, దానిని గురించి మీరు భావించగలరు.
అయినా, పరిష్కారాలను గూర్చిన మీ మొదటి ప్రయత్నం, నిరుత్సాహపర్చే వర్తమానాలను ఇస్తుండవచ్చును. అవి ఇలా ఉండవచ్చు: ‘మీ సమస్య మీరు అనుకున్నదానికన్నా చాలా చిన్నదని నేను గ్రహించాను.’ లేక ‘మీ క్షేమం కన్నా ఒక సమస్యను-పరిష్కరించేవానిగా నా పేరుప్రతిష్ఠల యెడల నేనెక్కువ మక్కువ చూపుతున్నాను.’ లేక, ‘నేను అర్థం చేసుకోలేను—అర్థం చేసుకొనాలని ఇష్టం లేదు.’ మరియు బాధితుని సమస్యను ఇతరుల సమస్యలతో పోల్చడం సాధారణంగా ఇలా తెలియ జేస్తుంది: ‘మీ కన్నా ఎక్కువగా ఇతర ప్రజలు బాదింప బడుతున్నందున కలతనొందిన భావాలతో మీరు సిగ్గుపడతారు.’
అటువంటి క్రుంగదీసే సమాచారాలను మీరు అనుకోకుండా వ్యక్తం చేస్తే, అతను చెప్పేది మీరు నిజంగా వినలేదని, అతన్ని అర్థంచేసుకోలేదని మీ స్నేహితుడు తలస్తాడు. అతని కన్నా మీరు ఉన్నతులని మీరు తలస్తున్నట్లు అతడనుకోవచ్చును. మరో సారి, అతను ఓదార్పు కొరకు మరొకరిపై అవధానాన్ని నిలుపుతాడు.—ఫిలిప్పీయులు 2:3, 4.
అనవసరంగా మీ స్నేహితుడు కలత చెందినట్లైతే అప్పుడేమిటి? ఉదాహరణకు, బలమైన కారణం లేకుండానే అతను దోషియని భావించవచ్చును. అతను మంచిగా భావించడం ప్రారంభించగలడని అతనితో చెప్పడానికి మీరు తొందరపడ్తున్నారా? తొందర పడకండి, ఎందుకంటే మీరు మొదట అతనిని విననట్లైతే, మీరు ధైర్యపర్చడం కొంచెమే ఓదార్పునిస్తుంది. ఉపశమనం పొందాడని తలంచడానికి బదులుగా, తన దోషత్వాన్ని ఇంకా తాను భరిస్తున్నాననేలా, తన బరువును ఇంకా దించుకోలేదని అతను భావిస్తాడు. హెన్రీ డేవిడ్ థొరియో అనే 19-శతాబ్దపు తత్వవేత్త “సత్యాన్ని చెప్పుకోడానికి ఇద్దరు అవసరము, దానిని తెలియజేయడానికి ఒకరు మరియు దానిని వినడానికి మరొకరు,” అని చెప్పాడు.
బైబిలు నడిపింపు ఎంత సమయోచితమైనది: “వినుటకు వేగిరపడువాడును మాట్లాడుటకు నిదానించువాడునై యుండవలెను.” (యాకోబు 1:19) మరియు శ్రద్ధతో వినడం కూడా ఎంతో ప్రాముఖ్యమైనది! మీయందు నమ్మకముంచుచున్న వాని భావాలతో పాలుపంచుకోండి. అతని సమస్యలకున్న క్లిష్టతను, వేదన యొక్క లోతును గుర్తించండి. ‘మీ సమస్య కేవలం తాత్కాలికమైనదే’ లేక ‘సంగతులంత దుఃఖకరంగా లేవే’ అనేటటువంటి వ్యాఖ్యానాలతో అతనికున్న సమస్యను తక్కువ అంచనా వేయకండి. అనుకోకుండా, అటువంటి తక్కువ అంచనా కలతచెందిన అతని భావాలను తీవ్రం చేయవచ్చును. మరియు మీరు అతని సమాచారాన్ని గంభీరంగా లక్ష్యపెట్టలేనందున అతను భంగపర్చ బడతాడు. కాబట్టి చెప్పిన దానిని మీరు విన్నారని, విషయాలను గురించి అతను ఇప్పుడు ఆలోచిస్తున్న విధానాన్ని మీరు అంగీకరిస్తున్నారని మీ ప్రత్యుత్తరాలు చూపనివ్వండి.
మీయందు నమ్మకముంచిన వ్యక్తితో మీరు ఏకీభవించాలని శ్రద్ధగా వినడం కోరదు. “నా ఉద్యోగాన్ని అసహ్యించుకుంటున్నానని” తెలియజేస్తున్నప్పుడు అది కారణసహితం కాదని మీరు విశ్వసించవచ్చును! అయినా మీరు ఆ అనంగీకారానికి (‘నీవలా భావించకూడదని’) ప్రతిస్పందించినట్లైతే లేక (‘నీవు చెప్పేది సరియైనది కాదని’) తిరస్కరిస్తే, మీరు అర్థం చేసుకోలేదనే ముగింపుకి అతను వస్తాడు. మీ వ్యాఖ్యానాలు మీరు అర్థం చేసుకున్న దానిని ప్రతిబింబింప చేస్తాయి. తన ఉద్యోగాన్ని అసహ్యించుకుంటున్న వ్యక్తికి, మీరిలా చెప్పవచ్చు: ‘అది ఒత్తిడితో నిండినదే.’ తరువాత వివరాలను విశదపర్చుకొనుటకు అడగండి. అలా అతను తన ఉద్యోగాన్ని అసహ్యించు కొంటున్నాడనే ముగింపుకు మీరు రానవసరంలేదు గాని అతను ప్రస్తుతం ఎలా భావిస్తున్నాడనే దానిని గుర్తించడమే. ఆ విధంగా మీరు వింటున్నారని, అతని భావాలతో పూర్తిగా భాసిస్తున్నారనే తృప్తిని అతనికి ఇస్తారు. తరుచుగా, సమస్యను పంచుకోవడము దాని తీవ్రతను తగ్గిస్తుంది.
అదేవిధంగా, ‘నా భార్య ఈరోజు పరీక్ష చేయించుకుంటుందని’ ఒక వ్యక్తి చెబుతుండడం, ‘నేను విచారిస్తున్నాననే’ భావాన్ని ఇవ్వగలదు. మీ ప్రత్యుత్తరం దీన్ని గుర్తించనీయండి. అతని భావాన్ని అలక్ష్యం చేసి, దానిని పట్టించుకోకుండా ఉండడం కన్నా, అతని మాటల వెనుకనున్న భావాన్ని మీరు విన్నారనేది లేక అతన్ని బాధపడొద్దని అతనితో చెప్పడం ద్వారా అతనిని కుదుట పర్చడానికి ప్రయత్నించడం మరింత ఓదార్పుకరంగా ఉంటుంది.—రోమీయులు 12:15.
బాగుగా వినువారు మాట్లాడతారు కూడా!
వింటున్నా చాలా తక్కువగా మాట్లాడే వారిని గూర్చి ది ఆర్ట్ ఆఫ్ కన్వర్సేషన్ యిలా తెలియజేస్తుంది: “వారికి అది గౌరవాన్ని ఇవ్వదని ఆలోచిస్తారు.” సంభాషణా భారాన్ని పూర్తిగా భరించేటట్టు అవతలి వ్యక్తిని ఇది ఒత్తిడి చేస్తుంది. అది అనాగరికమైనది. మరొక రీతిగా కూడా, ఇది అనాగరికమైనది, మరియు మీరు వింటున్న వ్యక్తి మిమ్మల్ని మాట్లాడడానికి అనుమతించకుండా ఏకధాటిగా మాట్లాడడాన్ని కొనసాగిస్తున్నట్లైతే, విసుగు పుట్టిస్తుంది. కాబట్టి మీరు ఒక మంచి వినువారిగా ఉండాలంటే, కొంత సహాయకరమైన దానిని మీరు చెప్పబోతున్నారని అవతలి వ్యక్తి తెలుసుకోవాలని మీరు ఇష్టపడుతుండ వచ్చును.
మీరేమి చెబుతారు? మీ స్నేహితుడు చెబుతుండగా గౌరవప్రదంగా విని, ఇప్పుడు మీరు సలహాను ఇస్తారా? దానికి మీరు అర్హులైనట్లైతే, ఇవ్వ వచ్చును. మీ స్నేహితుని కష్టాన్ని తొలగించే కీలకాన్ని మీరు కల్గి ఉన్నట్లైతే, కచ్చితంగా మీరు దానిని అతనితో పంచుకోవచ్చు. మొదట వినడానికి సమయాన్ని మీరు వినియోగించగా, మీ పలుకులు కొంత ప్రభావవంతమైనవిగా అవుతాయి. అతనికి అవసరమైన నడిపింపు లేక సహాయాన్ని మీ స్నేహితునికి ఇవ్వగలిగే అవసరమైన విశ్వసనీయ ఆధారాలు మీ దగ్గర లేకపోతే, వాటిని అందించగల్గే స్థానమందున్న మరొకరిని అతను కలుసుకొనేలా ప్రయత్నించండి.
అయినను, కొన్ని పరిస్థితుల్లో, సలహా అవసరమవ్వొచ్చు లేక కోరబడవచ్చు. కాబట్టి ఎక్కువ మాటలను చేర్చడం వల్ల మీరు వినే మంచి ప్రభావాన్ని బలహీనపర్చకుండా జాగ్రత్త పడండి. మీ స్నేహితుడు, అణచుకోలేని ఒక పరిస్థితిని సహించాల్సి ఉండవచ్చును లేక అతని ప్రతికూల భావాలను అధిగమించేలా పాటుపడడానికి సమయం పడుతుంది. అతని సమస్యను పంచుకోడానికి మీ దగ్గరకు వచ్చాడు. మీరు విన్నారు. అతని భావాలను పంచుకున్నారు. మీరు అతని యెడల శ్రద్ధ కల్గివున్నారని, మీ ఆలోచనల్లోను, ప్రార్థనల్లోను జ్ఞాపకం చేసుకుంటారనే నమ్మకాన్నిచ్చారు. మరల మీ దగ్గరకు రావడానికి అతను ఆహ్వానితుడేనని లేక అతని సమస్యల యొక్క ఆంతరంగిక స్వభావాన్ని మీరు గౌరవిస్తున్నారని అతనిని తెలుసుకోనివ్వండి. అతని సమస్యను పరిష్కరించడానికి మీరు ప్రయత్నం చేయడం కన్నా అతనికి అటువంటి ఓదార్పు అవసరమవ్వవచ్చును.—సామెతలు 10:19; 17:17; 1 థెస్సలొనీకయులు 5:14.
వింటున్నప్పుడు సలహా యిచ్చినా లేక యివ్వకపోయినా, అది ఇరు పక్షాల వారికి లాభాన్ని చేకూరుస్తుంది. తన్ను విని అర్థం చేసుకొనడం వల్ల మాట్లాడుతున్నవాడు సంతృప్తి చెందుతాడు. తనను వినడాన్ని బట్టి ఎవరో ఒకరు నన్ను లక్ష్యపెడ్తున్నారని అతడు ఓదార్పు నొందుతాడు. వినువాడు కూడా ప్రతిఫలం పొందుతాడు. ఇతరులు అతని శ్రద్ధను మెచ్చుకుంటారు. పరిస్థితిని అతను పూర్తిగా గ్రహించేంత వరకు అతను మాట్లాడనందు వలన అతను సలహాను యిచ్చినట్లైతే, అది విశ్వసనీయమైనది. శ్రద్ధగా ఆలకించడం సమయాన్ని తీసుకుంటుందనేది వాస్తవం. అయినా ఎంత యోగ్యమైన పెట్టుబడో కదా! నిశ్చయంగా, మీ ఆలోచనాపూర్వకమైన అవధానాన్ని ప్రజలపై నిలపడం వల్ల, మీరు వారికి ఒక విశేషమైన బహుమానాన్ని బహుకరిస్తున్నారు.