కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • nwt పేజీలు 1894-1895
  • B1 బైబిల్లోని సందేశం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • B1 బైబిల్లోని సందేశం
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సా.శ.పూ. 4026 తర్వాత
  • సా.శ.పూ. 1943
  • సా.శ.పూ. 1070 తర్వాత
  • సా.శ. 29
  • సా.శ. 33
  • దాదాపు సా.శ. 1914
  • భవిష్యత్తులో
  • మనందరికీ ఎంతో ప్రాముఖ్యమైన ఒక ప్రవచనం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • యెహోవా తన సంకల్పాన్ని క్రమక్రమంగా వెల్లడి చేశాడు
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • సర్ప సంతానం—ఎలా బయల్పరచబడింది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
B1 బైబిల్లోని సందేశం

B1

బైబిల్లోని సందేశం

ముద్రిత ప్రతి

పరిపాలించే హక్కు యెహోవా దేవునికే ఉంది. ఆయన పరిపాలనా విధానమే అత్యుత్తమమైనది. భూమి విషయంలో, మనుషుల విషయంలో ఆయన సంకల్పం నెరవేరుతుంది.

ఏదెను తోటలో ఆదాముహవ్వలు, దగ్గర్లో పాము

సా.శ.పూ. 4026 తర్వాత

“సర్పం” యెహోవా పరిపాలనా హక్కును, ఆయన పరిపాలనా విధానాన్ని ప్రశ్నించింది. చివరికి ఆ సర్పాన్ని, అంటే సాతానును చితగ్గొట్టే ‘సంతానాన్ని’ లేదా ‘విత్తనాన్ని’ పుట్టిస్తానని యెహోవా మాటిచ్చాడు. (ఆదికాండం 3:1-5, 15, అధస్సూచి) అయితే, మనుషులు సాతాను ప్రభావం కింద తమను తాము పరిపాలించుకోవడానికి యెహోవా సమయం ఇచ్చాడు.

అబ్రాహాము దేవుని వాగ్దానం వింటున్నాడు

సా.శ.పూ. 1943

వాగ్దాన “సంతానం” అబ్రాహాము వంశం నుండి వస్తాడని యెహోవా అతనికి చెప్పాడు.—ఆదికాండం 22:18.

దావీదు రాజు

సా.శ.పూ. 1070 తర్వాత

వాగ్దాన ‘సంతానం’ వాళ్ల వంశంలో నుండే వస్తాడని యెహోవా దావీదు రాజుకు, ఆ తర్వాత అతని కుమారుడైన సొలొమోనుకు హామీ ఇచ్చాడు.—2 సమూయేలు 7:12, 16; 1 రాజులు 9:3-5; యెషయా 9:6, 7.

బాప్తిస్మం తీసుకుంటున్న యేసు

సా.శ. 29

దావీదు సింహాసనానికి వారసుడైన ఆ వాగ్దాన “సంతానం” యేసే అని యెహోవా తెలియజేశాడు.—గలతీయులు 3:16; లూకా 1:31-33; 3:21, 22.

చనిపోతున్న సమయంలో యేసు

సా.శ. 33

సర్పం, అంటే సాతాను యేసును చంపించడం ద్వారా వాగ్దాన ‘సంతానాన్ని’ తాత్కాలికంగా గాయపర్చాడు. యెహోవా యేసును పరలోకంలో జీవించేలా పునరుత్థానం చేసి, యేసు అర్పించిన పరిపూర్ణ ప్రాణం విలువను అంగీకరించాడు; అలా ఆదాము పిల్లల పాపాల్ని క్షమించడానికి, వాళ్లకు శాశ్వత జీవితం ఇవ్వడానికి మార్గం తెరుచుకుంది.—ఆదికాండం 3:15; అపొస్తలుల కార్యాలు 2:32-36; 1 కొరింథీయులు 15:21, 22.

ప్రకటనలో చెప్పినట్టు సర్పం లేక సాతాను భూమ్మీదికి పడేయబడుతున్నాడు

దాదాపు సా.శ. 1914

యేసు ఆ సర్పాన్ని, అంటే సాతానును భూమ్మీద పడేసి కొంతకాలం అతన్ని భూమికే పరిమితం చేశాడు.—ప్రకటన 12:7-9, 12.

ప్రకటనలో చెప్పినట్టు తన పరలోక సింహాసనం నుండి యేసు భూమిని పరిపాలిస్తున్నాడు

భవిష్యత్తులో

యేసు 1,000 ఏళ్లపాటు సాతానును బంధిస్తాడు; ఆ తర్వాత యేసు అతన్ని నాశనం చేస్తాడు, అలా అతని తలను చితగ్గొడతాడు. భూమి విషయంలో, మనుషుల విషయంలో యెహోవా సంకల్పం నెరవేరుతుంది; ఆయన పేరు మీద వేయబడిన నిందలన్నీ తొలగిపోతాయి; ఆయన పరిపాలనా విధానమే సరైనదని రుజువౌతుంది.—ప్రకటన 20:1-3, 10; 21:3, 4.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి