కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwex ఆర్టికల్‌ 7
  • అతను ఖైదీల నుండి నేర్చుకున్నాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అతను ఖైదీల నుండి నేర్చుకున్నాడు
  • అనుభవాలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అన్ని సందర్భాల్లోనూ రాజ్యసువార్తను వ్యాపింపజేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • “ఈ లోకసంబంధమైనది” కాని రాజ్యం కోసం ఎదురుచూడడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • విశ్వాసం కారణంగా జైలు పాలైన యెహోవాసాక్షులు—ప్రాంతాల వారిగా
    విశ్వాసం కారణంగా జైలు పాలైనవాళ్లు
  • యెహోవాపై ఆధారపడడాన్ని నేర్చుకున్నాను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
మరిన్ని
అనుభవాలు
ijwex ఆర్టికల్‌ 7
తోటి ఖైదీతో ఆహారం పంచుకుంటున్న ఒక ఖైదీ

అతను ఖైదీల నుండి నేర్చుకున్నాడు

2011లో, ఒకతను ఎరిట్రియ నుండి నార్వేకు శరణార్థిగా వచ్చాడు. యెహోవాసాక్షులు అతన్ని కలిసి మాట్లాడినప్పుడు, తను ఎరిట్రియలో ఉన్నప్పుడే యెహోవాసాక్షుల్ని కలిశానని చెప్పాడు. అతను అక్కడ మిలిటరీలో పనిచేసేటప్పుడు, తమ విశ్వాసం కారణంగా సాక్షులు జైలు పాలవ్వడం చూశాడు. సాక్షుల్ని ఎంత బలవంతం చేసినా, చాలా కఠినంగా ప్రవర్తించినా వాళ్లు సైన్యంలో చేరలేదు.

అనుకోని పరిస్థితుల వల్ల అతను కూడా జైలు పాలయ్యాడు. అక్కడ అతను పౌలోస్‌ ఈయాసూ, నెగెడె టెక్లెమార్యామ్‌, ఈసాక్‌ మోగోస్‌ అనే ముగ్గురు సాక్షుల్ని కలిశాడు. వాళ్లు తమ విశ్వాసం కారణంగా 1994లో జైల్లో వేయబడ్డారు. అప్పటినుండి వాళ్లు జైల్లోనే ఉన్నారు.

ఈ వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు, యెహోవాసాక్షులు తాము బోధించేదానికి అనుగుణంగా జీవిస్తారని స్వయంగా గమనించాడు. వాళ్లు నిజాయితీగా ఉండడం, తమ ఆహారాన్ని తోటి ఖైదీలతో పంచుకోవడం అతను చూశాడు. తన తోటి ఖైదీలైన ఆ సాక్షులు ప్రతీరోజు కలిసి బైబిలు చదవడం, దానికి ఇతరుల్ని కూడా ఆహ్వానించడం అతను గమనించాడు. తమ విశ్వాసాన్ని విడిచిపెడుతున్నామని సంతకం పెడితే జైలు నుండి విడుదల చేస్తాం అని చెప్పినప్పుడు, వాళ్లు అందుకు ఒప్పుకోలేదు.

ఆ అనుభవం అతని మనసుపై చెరగని ముద్ర వేసింది. దాంతో అతను నార్వేకు వెళ్లిన తర్వాత, అసలు యెహోవాసాక్షులు ఎందుకంత బలమైన విశ్వాసం కలిగివుంటారో తెలుసుకోవాలనుకున్నాడు. కాబట్టి యెహోవాసాక్షులు అతన్ని కలిసినప్పుడు, వెంటనే బైబిలు అధ్యయనం తీసుకుని, కూటాలకు రావడం మొదలుపెట్టాడు.

సెప్టెంబరు 2018లో, అతను బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షి అయ్యాడు. ఎరిట్రియ, సూడాన్‌ ప్రజలతో బైబిలు అధ్యయనం చేయడానికి, బలమైన విశ్వాసం పెంపొందించుకునేలా సహాయం చేయడానికి ఇప్పుడు అతను శాయశక్తులా కృషిచేస్తున్నాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి