కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwex ఆర్టికల్‌ 3
  • వాళ్లు ఆగి సహాయం చేశారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వాళ్లు ఆగి సహాయం చేశారు
  • అనుభవాలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అలయ వద్దు
    మన రాజ్య పరిచర్య—1991
  • టైర్లు మీ జీవితం వాటిపై ఆధారపడగలదు!
    తేజరిల్లు!—2004
  • నేను త్రాగుడు ఎలా మానుకోగలను?
    తేజరిల్లు!—1993
  • “మేమున్నాము! మమ్మల్ని పంపించండి!”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
మరిన్ని
అనుభవాలు
ijwex ఆర్టికల్‌ 3
బాబ్‌ హైవే పక్కన అతని చక్రాల కుర్చీలో కూర్చుని ఉండగా, యువ యెహోవాసాక్షులు అతని వ్యాన్‌ టైర్‌ మారుస్తున్నారు

వాళ్లు ఆగి సహాయం చేశారు

కెనడాలో ఉన్న అల్బర్టాలో బాగా చల్లగా, గాలులు వీస్తున్న ఒక రోజు బాబ్‌ అనే అతను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వ్యాన్‌ను నడుపుతున్నాడు. అప్పుడు వెనక టైర్‌ పంక్చర్‌ అయింది. ఏమి జరిగిందో మొదట బాబ్‌కు తెలీలేదు, కాబట్టి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి ఆగకుండా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

స్థానిక యెహోవాసాక్షుల సంఘానికి రాసిన ఉత్తరంలో తర్వాత ఏమి జరిగిందో బాబ్‌ వివరించాడు. ఆయన ఇలా రాశాడు, “వేరే కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు నా పక్కకు వచ్చి వాళ్ల కిటికీ అద్దాన్ని దించారు. వ్యాన్‌ టైర్‌ పంక్చర్‌ అయిందని నాకు చెప్పారు. మేము మా వాహనాలను పక్కకు ఆపుకున్నాక, వాళ్లు టైర్‌ని మారుస్తామని అడిగారు. వేరే టైర్‌ గానీ, జాక్‌ గానీ ఉన్నాయో లేవో కూడా నాకు తెలీదు. నేను హైవే పక్కనే నా చక్రాల కుర్చీలో కూర్చుని ఉండగా, వాళ్లు వ్యాన్‌ కిందకి వెళ్లి అక్కడ అదనంగా ఉన్న టైర్‌ని, జాక్‌ని తీసి, టైర్‌ మార్చారు. గడ్డ కట్టిపోయేంత చల్లగా ఉంది, మంచు కురుస్తూ ఉంది. వాళ్లు చాలా మంచి బట్టలు వేసుకుని ఉన్నారు, కానీ వాళ్లు టైర్‌ మార్చి, నేను చక్కగా మళ్లీ వెళ్లగలిగేలా సహాయం చేశారు. నేను ఒక్కడినే ఆ పని చేయగలిగే వాడిని కాదు.”

“నాకు సహాయం చేసిన ఆ ఐదుగురు పిల్లలకు చాలా థాంక్స్‌. వాళ్లు ఆ ప్రాంతంలో ప్రజలకు ప్రకటించడానికి వెళ్తూ దారిలో ఉన్నారు. ఈ పిల్లలు వాళ్లు చెప్పిన విషయాలను ఖచ్చితంగా పాటిస్తున్నారు. వాళ్లు నన్ను చాలా పెద్ద కష్టం నుండి బయట పడేశారు. నేను వాళ్లకు నిజంగా రుణపడి ఉంటాను. ఆ రోజు హైవేలో అలాంటి యువ దేవదూతలు ఉంటారని ఎవరికి తెలుసు?”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి