కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwyp ఆర్టికల్‌ 114
  • నాకు బ్రతకాలని లేదు—నేనేం చేయాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నాకు బ్రతకాలని లేదు—నేనేం చేయాలి?
  • యువత అడిగే ప్రశ్నలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నాకు చనిపోవాలని ఉంది—ఆత్మహత్య చేసుకోవాలని అనిపించినప్పుడు బైబిలు నాకు సహాయం చేయగలదా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • డిప్రెషన్‌ నుండి నేనెలా బయటపడాలి?
    యువత అడిగే ప్రశ్నలు
  • హఠాత్తుగా ఆరోగ్యం పాడైతే ఏం చేయాలి?
    అదనపు అంశాలు
  • నా ఆరోగ్య సమస్యతో నేనెలా జీవించాలి? (3వ భాగం)
    యువత అడిగే ప్రశ్నలు
మరిన్ని
యువత అడిగే ప్రశ్నలు
ijwyp ఆర్టికల్‌ 114
డిప్రెషన్‌లో ఉన్న ఒక టీనేజీ అమ్మాయి బయట వర్షం పడుతుంటే కిటికీలో నుండి చూస్తుంది.

యువత అడిగే ప్రశ్నలు

నాకు బ్రతకాలని లేదు—నేనేం చేయాలి?

“కొన్ని సంవత్సరాల క్రితం నాకెంత ఆందోళనగా ఉండేదంటే, ప్రతీరోజు నాతో నేనే యుద్ధం చేస్తున్నట్లు అనిపించేది. చాలాసార్లు, ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాను. నాకు నిజంగా చనిపోవాలని లేదు, ఆ ఒత్తిడి తట్టుకోలేక అలా అనిపించింది అంతే.”—జోనాతన్‌, 17.

దాదాపు 14,000 మంది హైస్కూల్‌ విద్యార్థుల మీద సర్వే చేసినప్పుడు, వాళ్లలో దాదాపు ప్రతీ ఐదుగురిలో ఒకరు, గత 12 నెలల్లో ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని చెప్పారు.a మీకు కూడా అలానే అనిపిస్తుంటే, మీరేం చేయవచ్చు?

  • కాస్త ఆలోచించండి. క్షణికావేశంలో నిర్ణయం తీసుకోకండి. మీ సమస్యలు చాలా పెద్దవిగా అనిపించవచ్చు కానీ, చావు ఒక్కటే పరిష్కారం కాదు. వాటిని తట్టుకోవడానికి వేరే దారులు కూడా ఉన్నాయి.

గందరగోళంగా ఉన్న సందుల్లో చిక్కుకున్న ఒక టీనేజీ అమ్మాయి బయటికొచ్చే దారి కోసం వెతుక్కుంటుంది.

గందరగోళంగా ఉన్న సందుల్లో చిక్కుకుపోయినట్లు మీకు అనిపించవచ్చు. కానీ అనిపించినవన్నీ నిజాలు కాదు. దానినుండి బయటికి రావడానికి దారి ఉంది. మీరు సరైన సహాయం తీసుకుంటే, అనుకున్నదాని కన్నా తొందరగా బయటపడవచ్చు.

  • బైబిలు సలహా: “మమ్మల్ని అన్నివైపులా కష్టాలు చుట్టుముడుతున్నాయి, కానీ పూర్తిగా కదల్లేని స్థితిలో లేము; అయోమయంలో ఉన్నాం, కానీ దిక్కుతోచని స్థితిలో లేము.”—2 కొరింథీయులు 4:8.

    సలహా: ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన మిమ్మల్ని అదేపనిగా వేధిస్తుంటే, మీకెలాంటి సహాయం అందుబాటులో ఉందో తెలుసుకోండి. ఉదాహరణకు, కొన్ని దేశాల్లో అయితే హెల్ప్‌లైన్‌ నంబర్లు ఉంటాయి, లేదా హాస్పిటల్లో ప్రత్యేకంగా దీనికోసమే ఒక విభాగం ఉంటుంది. అక్కడ, ఈ విషయాల్లో సహాయం చేయడానికి ట్రైనింగ్‌ తీసుకున్నవాళ్లు ఉంటారు. వాళ్లు నిజంగా మీకు సహాయం చేయాలని కోరుకుంటారు.

  • ఎవరితోనైనా మాట్లాడండి. మిమ్మల్ని పట్టించుకునేవాళ్లతో లేదా మీకు సహాయం చేయాలని కోరుకునేవాళ్లతో మాట్లాడండి. వాళ్లు మీ ఫ్రెండ్స్‌ కావచ్చు, లేదా ఇంట్లోవాళ్లు కావచ్చు. మీరు చెప్తేనే మీ బాధేంటో వాళ్లకు తెలుస్తుంది.

ఒక టీనేజీ అమ్మాయి కళ్లజోడు పెట్టుకుంటుంది.

చూపు సరిగ్గా కనిపించని కొంతమందికి కళ్లజోడు అవసరం. అలాగే మీ సమస్యల్ని సరిగ్గా చూడడానికి, బ్రతకాలనే ఆశను మీలో తిరిగి కలిగించడానికి మీకొక ఫ్రెండ్‌ అవసరం.

  • బైబిలు సలహా: ‘నిజమైన స్నేహితుడు కష్టకాలంలో సహోదరుడిలా ఉంటాడు.’—సామెతలు 17:17.

    సలహా: మీరు ఇలా మొదలుపెట్టవచ్చు: “నాకు ఈమధ్య కొంతకాలంగా చాలా నెగెటివ్‌ ఆలోచనలు వస్తున్నాయి. నీతో దానిగురించి మాట్లాడవచ్చా?” లేదా “నాకు నేనుగా పరిష్కరించుకోలేని కొన్ని సమస్యలు ఉన్నాయి, నువ్వు నాకు హెల్ప్‌ చేస్తావా?”

  • డాక్టర్‌కి చూపించుకోండి. ఆందోళన లేదా డిప్రెషన్‌ వంటి సమస్యలు ఉన్నవాళ్లకు బ్రతకాలని అనిపించదు. కానీ మంచి విషయం ఏంటంటే, అవి నయం అయ్యే సమస్యలే.

ఒంట్లో బాగోలేని ఒక టీనేజీ అమ్మాయి దిగాలుగా కూర్చుంది. తన ముందు పెట్టిన ఆహారం కూడా తినట్లేదు.

జలుబు చేసినప్పుడు ఏమీ తినబుద్ధి కాకపోవచ్చు, అదేవిధంగా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు బ్రతకాలని అనిపించకపోవచ్చు. కానీ, ఆ రెండూ నయం అయ్యే సమస్యలే.

  • బైబిలు సలహా: “ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు వైద్యుడు అవసరంలేదు, రోగులకే అవసరం.”—మత్తయి 9:12.

    సలహా: కంటినిండా నిద్రపోండి, ఎక్సర్‌సైజ్‌ చేయండి, మంచి ఆహారం తీసుకోండి. మీ ఆరోగ్యం బాగుంటే జీవితం మీద ఆశ పెరగవచ్చు.

  • ప్రార్థించండి. మన సృష్టికర్త “మన హృదయాల కన్నా గొప్పవాడని, ఆయనకు అన్నీ తెలుసని” బైబిలు చెప్తుంది. (1 యోహాను 3:20) ఆయనకు ఈరోజే ఎందుకు ప్రార్థించకూడదు? మీరు ప్రార్థిస్తున్నప్పుడు యెహోవా అనే ఆయన పేరును ఉపయోగించండి. అలాగే, మీ మనసులో ఉన్నదంతా ఆయనకు చెప్పండి.

ఒక టీనేజీ అమ్మాయి ఒక పెద్ద అట్టపెట్టె మోయడానికి చాలా కష్టపడుతోంది.

కొన్ని బరువుల్ని మీరు ఒక్కరే మోయలేరు. వాటిని మోయడంలో సహాయం చేయడానికి, మీ సృష్టికర్త అయిన యెహోవా సిద్ధంగా ఉన్నాడు.

  • బైబిలు సలహా: “మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి . . . అప్పుడు, మానవ అవగాహనకు మించిన దేవుని శాంతి … మీ హృదయాలకు, మీ మనసులకు కాపలా ఉంటుంది.”—ఫిలిప్పీయులు 4:6, 7.

    సలహా: యెహోవాకు మీ సమస్యల గురించి చెప్పడంతో పాటు, ఈరోజు ఆయన చేసిన కనీసం ఒక్క మేలుకు థాంక్స్‌ చెప్పడానికి ప్రయత్నించండి. (కొలొస్సయులు 3:15) కృతజ్ఞత ఉంటే, మీకు జీవితం మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది.

మీకు బ్రతకాలని అనిపించకపోతే, సహాయం తీసుకోండి. ఈ ఆర్టికల్‌ మొదట్లో చూసిన జోనాతన్‌ అదే చేశాడు. అతనిలా అంటున్నాడు: “నేను చాలాసార్లు మా మమ్మీడాడీతో మాట్లాడాల్సి వచ్చింది, అలాగే డాక్టర్‌కి కూడా చూపించుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు నేను బాగున్నాను. నా జీవితంలో ఇప్పటికీ ఆటుపోట్లు ఉన్నాయి కానీ, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలైతే ఇప్పుడు లేవు.”

a 2019 లో యూ.ఎస్‌. సెంటర్స్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ వాళ్లు ఈ సర్వే చేశారు.

మీ వయసువాళ్లు ఏమంటున్నారు?

అలెక్సాండ్ర.

“శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. కాకపోతే తేడా ఏంటంటే, చెయ్యి విరిగితే బయటికి కనిపిస్తుంది కానీ, మనసులో ఉన్న బాధ బయటికి కనిపించకపోవచ్చు. మీ సమస్య గురించి ఎవరో ఒకరితో మాట్లాడడానికి భయపడకండి. సహాయం అడగడం సిగ్గుపడాల్సిన విషయం కాదు.”—అలెక్సాండ్ర.

ఇయాన్‌.

“జీవితంలో పరిష్కరించలేని లేదా భరించలేని సమస్యంటూ ఏది లేదని, చిన్నప్పుడు మా మమ్మీడాడీ నాకు నేర్పించారు. మన బాధలు చెప్పుకోవడానికి ఎవరో ఒకరు ఉంటే, మన సమస్యని సరిగ్గా చూడగలుగుతాం. నాకైతే, మా మమ్మీడాడీ ఆ విషయంలో చాలా సహాయం చేశారు.”—ఇయాన్‌.

ఉపయోగపడే బైబిలు వచనాలు

నిరుత్సాహంలో ఉన్నప్పుడు సహాయం చేసే బైబిలు వచనాల్ని మీరు ఒకచోట రాసి పెట్టుకోవచ్చు. ఉదాహరణకు, ఇక్కడ కొన్ని ఉన్నాయి:

కీర్తన 34:18: “విరిగిన హృదయంగలవాళ్లకు యెహోవా దగ్గరగా ఉంటాడు; నలిగిన మనస్సుగలవాళ్లను ఆయన కాపాడతాడు.”

అంటే … కష్టాల వల్ల నలిగిపోయిన వాళ్లమీద యెహోవా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తాడు. వాళ్లకు సహాయం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు.

కీర్తన 46:1: “దేవుడే మన ఆశ్రయం, మన బలం, కష్టకాలాల్లో ఆయన ఎప్పుడూ సహాయం చేస్తాడు.”

అంటే … మీకు ఎప్పుడు ఆందోళనగా అనిపించినా యెహోవాకు ప్రార్థించవచ్చు. మీకు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.

కీర్తన 94:18, 19: “‘నా పాదం జారుతోంది’ అని నేను అనుకున్నప్పుడు, యెహోవా, నీ విశ్వసనీయ ప్రేమ నన్ను ఆదుకుంటూ వచ్చింది. ఆందోళనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు నువ్వే నన్ను ఓదార్చావు, ఊరడించావు.”

అంటే … దేవుడు మీకు కావాల్సిన ఓదార్పును తన వాక్యమైన బైబిలు ద్వారా ఇస్తాడు. ఒక్కరోజు కూడా బైబిలు చదవడం మిస్‌ అవ్వకండి!

కీర్తన 139:23, 24: “దేవా, నన్ను పరిశోధించి . . . నన్ను కలవరపెడుతున్న ఆలోచనల్ని తెలుసుకో. హానికరమైన మార్గంలోకి తీసుకెళ్లేది ఏదైనా నాలో ఉందేమో చూడు, శాశ్వత మార్గంలో నన్ను నడిపించు.”

అంటే … మీ గురించి మీకన్నా యెహోవాకే బాగా తెలుసు. మీలో హానికరమైన ఆలోచనలు ఏవైనా ఉంటే, వాటిని సరిచేసుకుని ఆనందాన్ని తిరిగి పొందడానికి ఆయన మీకు సహాయం చేయగలడు.

యెషయా 41:10: “ఆందోళనపడకు, ఎందుకంటే నేను నీ దేవుణ్ణి. నేను నిన్ను బలపరుస్తాను, అవును, నీకు సహాయం చేస్తాను.”

అంటే … మనకు ఏ కష్టం వచ్చినా, దాన్ని తట్టుకోవడానికి కావాల్సిన బలాన్ని యెహోవా ఇవ్వగలడు.

వీటిని గుర్తుచేసుకుందాం: నాకు బ్రతకాలని లేదు—నేనేం చేయాలి?

  • కాస్త ఆలోచించండి. క్షణికావేశంలో నిర్ణయం తీసుకోకండి. మీ సమస్యలకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. వాటిని తట్టుకోవడానికి వేరే దారులు కూడా ఉన్నాయి.

  • ఎవరితోనైనా మాట్లాడండి. మీ బాధేంటో మీరు చెప్తేనే మీ ఫ్రెండ్స్‌కి, ఇంట్లోవాళ్లకు తెలుస్తుంది.

  • డాక్టర్‌కి చూపించుకోండి. డిప్రెషన్‌ ఉన్నవాళ్లకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఉంటాయి. కానీ అది నయం అవుతుంది.

  • మీకు ఏమనిపిస్తుందో ప్రార్థనలో దేవునికి చెప్పండి. మీ గురించి మీకన్నా దేవునికే బాగా తెలుసు, అంతేకాదు ఆయన మీకు సహాయం చేయాలనుకుంటున్నాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి