కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 ఆగస్టు పేజీ 31
  • పాఠకుల ప్రశ్న

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్న
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని రాజ్యం శత్రువులను నాశనం చేయడం
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • భవిష్యత్తులో యెహోవా తీర్పులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • హార్‌మెగిద్దోన్‌ ఒక శుభవార్త!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
  • “మహాశ్రమ” కాలంలో నమ్మకంగా ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 ఆగస్టు పేజీ 31

పాఠకుల ప్రశ్న

మనం ప్రీచింగ్‌ చేయడం ఎప్పుడు ఆపేస్తాం?

యేసు ఇలా చెప్పాడు: “అన్నిదేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా, ఈ రాజ్య సువార్త భూమంతటా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది.” (మత్త. 24:14) ఈ వచనంలో అలాగే 6, 13 వచనాల్లో “అంతం” అనే దగ్గర, టేలోస్‌ అనే గ్రీకు పదాన్ని వాడారు. ఈ పదం, హార్‌మెగిద్దోన్‌లో సాతాను లోకం అంతమవ్వడాన్ని సూచిస్తుంది. (ప్రక. 16:14, 16) కాబట్టి, హార్‌మెగిద్దోన్‌లో సాతాను లోకం అంతమవ్వడానికి కాస్త ముందువరకు, మనం మంచివార్త ప్రకటిస్తూ ఉంటాం. ఇది మన అవగాహనలో వచ్చిన మార్పు.

మహాబబులోను నాశనమై, మహాశ్రమ మొదలైనప్పుడు మంచివార్త ప్రకటించడం ఆపేస్తామని ఇప్పటివరకు అనుకున్నాం. (ప్రక. 17:3, 5, 15, 16) మహాశ్రమ మొదలవ్వడంతో “యెహోవా అనుగ్రహ సంవత్సరం” ముగుస్తుందని నమ్మాం. (యెష. 61:2) అంతేకాదు మహాశ్రమను తప్పించుకునేవాళ్లు, మహాశ్రమ కంటే ముందే యెహోవాకు నమ్మకంగా ఉన్నారని నిరూపించుకోవాలని అనుకున్నాం. ఎందుకంటే, క్రీ.పూ. 607లో యెరూషలేము నాశనాన్ని తప్పించుకున్న యూదులు యెహోవాను నమ్మకంగా ఆరాధించారు, చెడును అసహ్యించుకున్నారు కాబట్టి, వాళ్లు రక్షించబడాలని ముందే యెహోవా వాళ్ల నొసళ్ల మీద ముద్ర వేశాడు. (యెహె. 5:11; 9:4) కానీ దానికి, మత్తయి 24:14 లో ఉన్న యేసు మాటలకు సంబంధం లేదు. హార్‌మెగిద్దోన్‌లో సాతాను లోకం అంతమవ్వడానికి కాస్త ముందువరకు, ప్రజలు మంచివార్తకు స్పందించే అవకాశం ఉందని యేసు చెప్తున్నాడు.

మత్తయి 24:14కి సంబంధించిన అవగాహనలో మార్పు వచ్చింది కాబట్టి, ప్రకటన 16:21 లో ఉన్న వడగండ్ల లాంటి సందేశం విషయంలో కూడా మన అవగాహన మారింది. ఇంకా లోతుగా పరిశీలించిన తర్వాత, ఆ రెండు లేఖనాల్లో ఉన్న సందేశాలు వేర్వేరు కాదని మనం అర్థం చేసుకున్నాం. ఎలా? మత్తయి 24:14లో ఉన్న రాజ్య సందేశానికి, మహాశ్రమ మొదలైన తర్వాత కొంతమంది ఎలా స్పందిస్తారో ప్రకటన 16:21 చెప్తుందంతే! “రక్షణ పొందేవాళ్లకేమో” అది మంచివార్త అలాగే “జీవదాయక పరిమళం” లాంటిది అనీ, దేవుని శత్రువులకేమో అది చెడ్డవార్త అలాగే “మరణకరమైన పరిమళం” లాంటిది అనీ అపొస్తలుడైన పౌలు రాశాడు. (2 కొరిం. 2:15, 16) వాళ్లకు రాజ్య సందేశం అంటే ఎందుకు గిట్టదు? ఎందుకంటే వాళ్లు ప్రేమిస్తున్న ఈ లోకం చెడ్డదని, దాని పరిపాలకుడు సాతానని, త్వరలోనే అది నాశనమౌతుందని ప్రకటిస్తూ మనం దాని బండారం బయటపెడుతున్నాం.—యోహా. 7:7; 1 యోహా. 2:17; 5:19.

ఆ వడగండ్ల తుఫాను “చాలా తీవ్రంగా” ఉంటుందని కూడా గమనించండి. దానర్థం మహాశ్రమ సమయంలో మనం ప్రకటించే మంచివార్త ఇంకా గట్టిగా తగులుతుంది, అంటే ముందెప్పుడూ లేనంతగా యెహోవా పేరు మారుమ్రోగిపోతుంది. (యెహె. 39:7) ఆ సమయంలో కూడా అంటే, మహాబబులోను నాశనమైన తర్వాత కూడా, కొంతమంది సుగంధ పరిమళానికి ఆకర్షితులైనట్టు రాజ్య సందేశానికి ఆకర్షితులౌతారా? ఛాన్స్‌ ఉంది. వాళ్లు మహాబబులోను నాశనాన్ని కళ్లారా చూశాక, బహుశా దీని గురించే అనుకుంటా యెహోవాసాక్షులు ఇన్నేళ్లుగా చెప్పుకొచ్చింది అని గుర్తుచేసుకోవచ్చు లేదా అప్పుడే కొత్తగా తెలుసుకోవచ్చు.

దీన్ని అర్థం చేసుకోవడానికి, ఐగుప్తులో పది తెగుళ్లు వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూడండి. యెహోవా ‘ఐగుప్తు దేవుళ్లందరి మీద తీర్పులు అమలు చేసిన’ తర్వాత “చాలామంది విదేశీయులు” అంటే ఇశ్రాయేలీయులుకాని వాళ్లు దేవుని ప్రజలతో కలిశారు. (నిర్గ. 12:12, 37, 38) ఈ విదేశీయులు, మోషే చెప్పిన పది తెగుళ్లు నిజమవ్వడం కళ్లారా చూశాక యెహోవా వైపు తిరిగి ఉండొచ్చు.

మహాబబులోను నాశనమయ్యాక యెహోవా వైపు తిరిగేవాళ్లకు, ఇంకా భూమ్మీద ఉన్న క్రీస్తు సహోదరులకు మద్దతిచ్చి, గొర్రెలుగా తీర్పు పొందే చక్కని అవకాశం ఉంటుంది. (మత్త. 25:34-36, 40) అయితే, ఆ అవకాశం హార్‌మెగిద్దోన్‌కు కాస్త ముందు, అభిషిక్తులు పరలోకానికి వెళ్లిపోయినప్పుడు మూసుకుపోతుంది.

మన అవగాహనలో వచ్చిన ఈ మార్పు యెహోవా గొప్ప ప్రేమకు, కరుణకు అద్దం పడుతుంది. అవును, “ఎవ్వరూ నాశనమవ్వడం ఆయనకు ఇష్టంలేదు. ఆయన, అందరికీ పశ్చాత్తాపపడే అవకాశం దొరకాలని కోరుకుంటున్నాడు.”—2 పేతు. 3:9.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి