అధ్యయనం చేయడానికి ఐడియాలు
మీ హృదయాన్ని సిద్ధం చేసుకోండి
మనం బైబిల్ని అధ్యయనం చేసినప్పుడు, యెహోవా ఆలోచనలు మన హృదయాన్ని లేదా అంతరంగాన్ని మార్చాలని కోరుకుంటాం. ఈ విషయంలో ఎజ్రా మంచి ఆదర్శాన్ని ఉంచుతూ “యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించడానికి … తన హృదయాన్ని సిద్ధం చేసుకున్నాడు.” (ఎజ్రా 7:10) మరి మన హృదయాన్ని ఎలా సిద్ధం చేసుకోవచ్చు?
ప్రార్థించండి. మీ అధ్యయనాన్ని ప్రార్థనతో మొదలుపెట్టండి. మీరు నేర్చుకునేవాటిని అర్థం చేసుకుని, పాటించేలా సహాయం చేయమని యెహోవాను అడగండి.—కీర్త. 119:18, 34.
వినయం పెంచుకోండి. గర్వంతో సొంత తెలివి మీద ఆధారపడే వాళ్ల నుండి దేవుడు సత్యాన్ని దాచిపెడతాడు. (లూకా 10:21) వేరేవాళ్లు మనల్ని మెచ్చుకోవాలనే ఉద్దేశంతో పరిశోధన చేయకండి. మీ ఆలోచనకు దేవుని ఆలోచనకు తేడా ఉందని మీరు గమనిస్తే, వెంటనే మీ ఆలోచనను వినయంగా మార్చుకోండి.
రాజ్య గీతాన్ని వినండి. మన మనసును కదిలించే శక్తి సంగీతానికి ఉంది. అది ఆరాధనకు మన హృదయాన్ని సిద్ధం చేస్తుంది. కాబట్టి అధ్యయనం మొదలుపెట్టే ముందు రాజ్య గీతాన్ని వినండి.