కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 ఏప్రిల్‌ పేజీ 32
  • చిత్రాల నుండి ఎక్కువ నేర్చుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • చిత్రాల నుండి ఎక్కువ నేర్చుకోండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఇలాంటి మరితర సమాచారం
  • “ఆహా, ఈ చిత్రం ఎంత బాగుందో!”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • పరిపాలక సభ నుండి ఉత్తరం
    నా బైబిలు పుస్తకం
  • వీడియోలతో, చిత్రాలతో బోధించడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • సాతాను ఎక్కడ ఉంటాడు?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 ఏప్రిల్‌ పేజీ 32

అధ్యయనం చేయడానికి ఐడియాలు

చిత్రాల నుండి ఎక్కువ నేర్చుకోండి

మన ప్రచురణల్లో, ముఖ్యమైన విషయాలు చెప్పడానికి రకరకాల చిత్రాలు వాడతారు. మరి, వాటి నుండి ఎక్కువ నేర్చుకోవడం ఎలా?

  • ఆర్టికల్‌ చదవడానికి ముందే చిత్రాల్ని చూడండి. సాధారణంగా, మన కళ్లు ముందుగా చిత్రాల వైపే వెళ్తాయి, అవి చూశాక ఇక ఆర్టికల్‌ చదవకుండా ఉండలేం అనిపిస్తుంది. గుమగుమలాడే వంటకాన్ని ప్లేట్‌లో చూసినప్పుడు ఇక దాన్ని నోట్లో పెట్టుకోకుండా ఉండలేం. అలాగే, ఆర్టికల్‌ చదవాలని అనిపించాలంటే, ముందు చిత్రాలు చూడండి.—ఆమో. 7:7, 8.

  • ఆర్టికల్‌ చదువుతున్నప్పుడు అసలు ఆ చిత్రాన్ని ఎందుకు వాడారో ఆలోచించండి. ఆ చిత్రం కిందున్న సమాచారాన్ని లేదా చిత్రం వివరణను చదవండి. ఆ చిత్రానికీ, ఆర్టికల్‌లో ఉన్న సమాచారానికీ సంబంధం ఏంటో ఆలోచించండి. ఆ చిత్రం నుండి నేర్చుకున్నది మీరెలా పాటించవచ్చో ఆలోచించండి.

  • చదవడం పూర్తయ్యాక, ఆర్టికల్‌లోని ముఖ్యమైన విషయాల్ని నెమరు వేసుకోవడానికి కూడా చిత్రాలు పనికొస్తాయి. మీరేం చేయొచ్చంటే, కళ్లు మూసుకొని ఆర్టికల్‌లో ఉన్న చిత్రాల్ని గుర్తుతెచ్చుకోండి, వాటినుండి ఏం నేర్చుకున్నారో ఆలోచించుకోండి.

  • ఈ పత్రికలో ఉన్న చిత్రాలతోనే మొదలుపెట్టి చూడండి. వీటిలో మీరు నేర్చుకున్న విషయాలు గుర్తున్నాయో లేవో తెలుసుకోండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి