ముందుమాట
యుద్ధాలు లేదా దాడులు జరగని లోకంలో జీవించాలని మీరు కల కంటున్నారా? చాలామందికి ఆ కల నిజమైతే బాగుండని అనిపిస్తుంది. కానీ, అది పగటి కలగానే మిగిలిపోతుందని వాళ్లు అనుకుంటారు. అయితే, మనుషులు ఎన్ని ప్రయత్నాలు చేసినా యుద్ధాల్ని ఎందుకు ఆపలేకపోతున్నారో బైబిలు చెప్తుంది. అంతేకాదు, ప్రపంచమంతా శాంతిగా ఉండే రోజు నిజంగా వస్తుందని, దాన్ని మనం పూర్తిగా నమ్మవచ్చని కూడా బైబిలు చెప్తుంది.
ఈ పత్రికలో ఉపయోగించిన “యుద్ధం” లేదా “దాడి” అనే పదాలు రాజకీయ గుంపులు లేదా దేశాల మధ్య ఆయుధాలతో జరిగే పోరును సూచిస్తున్నాయి. ఇందులో చెప్పిన వ్యక్తుల పేర్లలో కొన్ని మార్చాం.