కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w24 అక్టోబరు పేజీ 32
  • ముఖ్యమైన విషయాల్ని నెమరు వేసుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ముఖ్యమైన విషయాల్ని నెమరు వేసుకోండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • ఇలాంటి మరితర సమాచారం
  • ముఖ్యాంశాలను ప్రత్యేకంగా గుర్తించబడేలా చెప్పడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ముఖ్యాంశాలు నొక్కిచెప్పడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
  • విషయాంశాన్ని, ముఖ్యాంశాలను ఉన్నతపరచుట
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నిర్దేశక పుస్తకము
  • సంక్షిప్త ప్రతిని తయారు చేసుకోవడం
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
w24 అక్టోబరు పేజీ 32

అధ్యయనం చేయడానికి ఐడియాలు

ముఖ్యమైన విషయాల్ని నెమరు వేసుకోండి

చదివిన విషయాల్ని గుర్తు తెచ్చుకోవడం మీకు ఎప్పుడైనా కష్టంగా అనిపించిందా? మన అందరికీ అలా అవుతూ ఉంటుంది. అయితే ముఖ్యమైన విషయాల్ని నెమరు వేసుకోవడం మీకు సహాయం చేస్తుంది.

అధ్యయనం చేస్తున్నప్పుడు మధ్యమధ్యలో ఆగి, ముఖ్యాంశాలు ఏంటో ఆలోచించండి. పౌలు కూడా తన ఉత్తరాన్ని చదివే వాళ్లకు సహాయం చేస్తూ ఇలా రాశాడు: “మేము చెప్తున్నవాటి ముఖ్యాంశం ఇదే.” (హెబ్రీ. 8:1) దానివల్ల పౌలు ఏం చెప్పాలనుకుంటున్నాడో అలాగే ఆయన మాటలకి, ఆయన ఎంచుకున్న అంశానికి సంబంధం ఏంటో వినేవాళ్లు తేలిగ్గా అర్థం చేసుకోగలిగారు.

అధ్యయనం పూర్తయిన తర్వాత నేర్చుకున్న వాటిలో ముఖ్యమైన పాయింట్స్‌ని గుర్తుతెచ్చుకోవడానికి ఓ పది నిమిషాలైనా కేటాయించండి. మీకు వెంటనే గుర్తురాకపోతే సబ్‌హెడింగ్‌లను లేదా పేరాల్లో మొదటి వాక్యాలను తిరగేయండి. మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటే, దాన్ని మీ సొంత మాటల్లో వివరించడానికి ప్రయత్నించండి. ఇలా ముఖ్యమైన విషయాల్ని నెమరు వేస్తే మీకు అవి గుర్తుండిపోవడమే కాదు, వాటిని మీ జీవితంలో ఎలా పాటించాలో కూడా ఇంకా బాగా అర్థమౌతుంది.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి