కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w24 సెప్టెంబరు పేజీ 32
  • కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపనతో చదవండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపనతో చదవండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా ఆయన ప్రజలను చూసుకుంటాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • యెహోవా ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారం నుండి పూర్తి ప్రయోజనం పొందండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • అధ్యయనం ప్రతిఫలదాయకంగా ఉంటుంది
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • రాజుల మాదిరిని అనుసరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
w24 సెప్టెంబరు పేజీ 32

అధ్యయనం చేయడానికి ఐడియాలు

కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపనతో చదవండి

అధ్యయనం మొదలుపెట్టేటప్పుడు మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు, ‘నేను ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాను?’ అయితే మనం ముందే అనుకున్న విషయాలు కాకుండా యెహోవా మనకు వేరే కొత్త విషయాల్ని కూడా నేర్పించడానికి ప్రయత్నిస్తుండవచ్చు. కాబట్టి ఫలానా విషయాల్నే నేర్చుకుంటామని ముందే ఒక ముగింపుకు రాకూడదు. మరి కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపనతో చదవడానికి మనకు ఏం సహాయం చేస్తుంది?

తెలివి కోసం ప్రార్థించండి. మీరు ఇప్పుడు ఏం నేర్చుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడో దాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థించండి. (యాకో. 1:5) కేవలం మీ సొంత అవగాహన మీద ఆధారపడకండి.—సామె. 3:5, 6.

బైబిలుకున్న ప్రత్యేక శక్తి మీ జీవితంపై పనిచేసేలా అనుమతించండి. “దేవుని వాక్యం సజీవమైనది.” (హెబ్రీ. 4:12) బైబిలు చదివిన ప్రతీసారి మన జీవితానికి ఉపయోగపడే వేర్వేరు కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. కానీ అలా నేర్చుకోవాలంటే దేవుడు నేర్పిస్తున్నవి మనకు అవసరమని గుర్తించాలి.

యెహోవా బల్ల మీదున్న ప్రతీదాన్ని విలువైనదిగా ఎంచండి. ఆయన ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారం ‘శ్రేష్ఠమైన వంటకాల విందు’ లాంటిది. (యెష. 25:6) మీకు నచ్చదు అనిపించే వాటిని తీసుకోకుండా ఉండకండి. అలా మీరు అన్నిటిని ఆస్వాదిస్తే ప్రయోజనం పొందడం మాత్రమే కాదు, దేవుని వాక్యంలో ఉన్న ఆనందాన్ని కూడా రుచి చూస్తారు!

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి