అధ్యయనం చేయడానికి ఐడియాలు
యెహోవాను సంతోషపెట్టాలని అనుకునేవాళ్లు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు
ఏశావు అలాగే యాకోబు తెలివైన నిర్ణయాలు తీసుకున్నారో లేదో తెలుసుకోవడానికి ఆదికాండం 25:29-34 చదవండి.
సందర్భాన్ని లోతుగా తవ్వండి. ఈ సంఘటనకు ముందు ఏం జరిగింది? (ఆది. 25:20-28) దాని తర్వాత ఏం జరిగింది?—ఆది. 27:1-46.
వివరాల్ని లోతుగా తవ్వండి. ఆ రోజుల్లో పెద్ద కొడుకుకు ఎలాంటి హక్కులు, బాధ్యతలు ఉండేవి?—ఆది. 18:18, 19; w10-E 5⁄1 13వ పేజీ.
ఒక వ్యక్తి మెస్సీయ పూర్వీకుడు అవ్వాలంటే అతను పెద్ద కొడుకు అయ్యుండాలా? (w17.12 14-15 పేజీలు)
ఏం నేర్చుకున్నారో ఆలోచించండి, దాన్ని పాటించండి. జ్యేష్ఠత్వపు హక్కు ఏశావు కన్నా యాకోబు ఎందుకంత ప్రాముఖ్యంగా ఎంచాడు? (హెబ్రీ. 12:16, 17; w03 10⁄15 28-29 పేజీలు) ఆ ఇద్దరు అన్నదమ్ముల్ని చూసి యెహోవాకు ఎలా అనిపించింది? ఎందుకు? (మలా. 1:2, 3) మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఏశావు ఏం చేసుంటే బాగుండేది?
ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను వారం మొత్తంలో చేసే పనుల్లో యెహోవాకే మొదటిస్థానం ఇస్తున్నానా? కుటుంబ ఆరాధనకు కూడా సమయాన్ని ఇస్తున్నానా?’