కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w21 ఏప్రిల్‌ పేజీ 30-పేజీ 31 పేరా 5
  • పాఠకుల ప్రశ్న

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్న
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు చివరి మాటల నుండి ఏం నేర్చుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • యేసు ఎందుకు చనిపోయాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • దేవుని నీతిని యేసు ఎలా ఘనపరుస్తున్నాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • యెహోవా చెప్పేది వినండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
w21 ఏప్రిల్‌ పేజీ 30-పేజీ 31 పేరా 5
యేసు ఇద్దరు నేరస్తుల మధ్య హింసాకొయ్య మీద వేలాడుతున్నాడు, ఆకాశంలో చీకటి కమ్ముకుంది.

పాఠకుల ప్రశ్న

చనిపోవడానికి కాస్త ముందు కీర్తన 22:1 లోని మాటల్ని యేసు ఎందుకు అన్నాడు?

యేసు తను చనిపోవడానికి కాస్త ముందు, మత్తయి 27:46 లో రాయబడిన ఈ మాటల్ని అన్నాడు: “నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టావు?” అలా అనడం ద్వారా ఆయన కీర్తన 22:1 లోని దావీదు మాటల్ని నెరవేర్చాడు. (మార్కు 15:34) యేసు అలా అన్నాడంటే, ఆయన నిరుత్సాహపడ్డాడనో లేదా ఆ క్షణంలో ఆయన విశ్వాసం తగ్గిపోయిందనో మనం అనుకోకూడదు. తను ఎందుకు చనిపోవాలో యేసుకు బాగా తెలుసు, అంతేకాదు తన ప్రాణం అర్పించడానికి ఆయన ఇష్టపూర్వకంగా ముందుకొచ్చాడు. (మత్త. 16:21; 20:28) తను చనిపోయేటప్పుడు, యెహోవా తనను కాపాడడం ఆపేయాల్సి ఉంటుందని కూడా యేసుకు తెలుసు. (యోబు 1:10) అలా ఆపేయడం వల్ల, ఎంత కష్టమైన మరణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినా నమ్మకంగా ఉంటానని నిరూపించుకునే అవకాశం యేసుకు దొరికింది.—మార్కు 14:35, 36.

మరైతే ఈ కీర్తనలోని మాటల్ని యేసు ఎందుకు అన్నాడు? ఆయన ఎందుకు అలా అన్నాడో మనకు ఖచ్చితంగా తెలీదు, కానీ బహుశా ఆయన ఎందుకు అలా అనివుంటాడో తెలిపే కొన్ని కారణాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.a

బహుశా తను చనిపోయేటప్పుడు యెహోవా సహాయం చేయడని యేసు స్పష్టం చేస్తుండవచ్చు. ఆయన యెహోవా సహాయం లేకుండానే విమోచన క్రయధనాన్ని అర్పించాలి. ‘ప్రతీ మనిషి కోసం మరణాన్ని రుచి చూసేందుకు’ ఆయన చనిపోవాలి.—హెబ్రీ. 2:9.

బహుశా వినేవాళ్లు ఆ కీర్తన అంతటి గురించి ఆలోచించాలని యేసు కోరుకుని ఉండవచ్చు. ఆ కాలంలో, యూదా ప్రజలు చాలా కీర్తనల్ని కంఠస్థం చేసేవాళ్లు. ఏదైనా కీర్తనలోని ఒక వచనం విన్నప్పుడు, వాళ్లకు సహజంగానే మొత్తం కీర్తన గుర్తొచ్చేది. ఒకవేళ యేసు ఉద్దేశం అదే అయితే, తన మరణం గురించి ఆ కీర్తనలో ఉన్న ఎన్నో ప్రవచనాల్ని తనను అనుసరిస్తున్న యూదులకు గుర్తుచేయాలన్నది ఆయన కోరిక అయ్యుండవచ్చు. (కీర్త. 22:7, 8, 15, 16, 18, 24) అంతేకాదు, ఆ కీర్తనలోని చివరి వచనాలు యెహోవా రాజరికం భూమంతటా విస్తరిస్తుందని చెప్తున్నాయి.—కీర్త. 22:27-31.

బహుశా తను నిర్దోషినని యేసు స్పష్టం చేస్తుండవచ్చు. యేసు చనిపోవడానికి ముందు, మహాసభ ఆయన్ని చట్ట వ్యతిరేకంగా విచారణ చేసి, దైవదూషకుడని తీర్పు తీర్చింది. (మత్త. 26:65, 66) మహాసభ సభ్యులందరూ రాత్రికిరాత్రే సమకూడి, చట్టానికి విరుద్ధంగా విచారణ చేశారు. (మత్త. 26:59; మార్కు 14:56-59) “నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టావు?” అని అడగడం ద్వారా, తను ఏ తప్పూ చేయకపోయినా ఇలా అన్యాయంగా శిక్షిస్తున్నారనే వాస్తవాన్ని యేసు స్పష్టం చేస్తుండవచ్చు.

ఈ కీర్తనను రాసిన దావీదు కూడా బాధలు అనుభవించాడు, అంతమాత్రాన ఆయన యెహోవా ఆమోదం కోల్పోయినట్టు కాదని యేసు గుర్తు చేస్తుండవచ్చు. దావీదు అలా అడిగాడంటే ఆయన విశ్వాసం కోల్పోయాడని కాదు. ఆ ప్రశ్న అడిగిన తర్వాత, యెహోవా రక్షణ శక్తి మీద తనకున్న నమ్మకాన్ని దావీదు తెలియజేశాడు, యెహోవా కూడా ఆయన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. (కీర్త. 22:23, 24, 27) అదేవిధంగా, ‘దావీదు కుమారుడైన’ యేసు హింసాకొయ్య మీద బాధను అనుభవిస్తున్నంత మాత్రాన, యెహోవా ఆమోదం కోల్పోయినట్టు కాదు.—మత్త. 21:9.

తన యథార్థతను పూర్తిగా నిరూపించుకోవడం కోసం యెహోవా తనను కాపాడడం ఆపేయాల్సి ఉంటుంది, ఆ వాస్తవాన్ని బట్టి తనకు ఎంత బాధగా ఉందో యేసు తెలియజేస్తుండవచ్చు. యెహోవా తన కుమారుణ్ణి సృష్టించింది బాధలు అనుభవించి, చనిపోవడం కోసం కాదు. కానీ, ఆదాముహవ్వలు తిరుగుబాటు చేసిన తర్వాత ఆయన అలా చేయాల్సి వచ్చింది. యేసు ఏ తప్పూ చేయలేదు. అయినా, సాతాను లేవదీసిన ప్రశ్నలకు జవాబివ్వడానికి, అలాగే మనుషులు కోల్పోయిన దాన్ని తిరిగి కొనడానికి యేసు బాధలు అనుభవించి, చనిపోవాల్సి వచ్చింది. (మార్కు 8:31; 1 పేతు. 2:21-24) యెహోవా కొన్ని క్షణాల పాటు యేసును కాపాడడం ఆపేస్తేనే అది సాధ్యం అవుతుంది. యెహోవా యేసును అలా విడిచిపెట్టడం ఇదే మొట్టమొదటిసారి.

ఈ విధంగా చనిపోవడానికి యెహోవా ఎందుకు అనుమతిస్తున్నాడో తన అనుచరులు అర్థం చేసుకునేలా యేసు సహాయం చేస్తుండవచ్చు.b తను నేరస్తునిలా హింసాకొయ్య మీద చనిపోవడం చాలామందికి అడ్డురాయిగా ఉంటుందని యేసుకు తెలుసు. (1 కొరిం. 1:23) ఆయన మరణానికి అసలు కారణం ఏంటో తెలుసుకుంటే, ఆయన అనుచరులు దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటారు. (గల. 3:13, 14) అప్పుడు వాళ్లు ఆయన్ని నేరస్తునిలా కాకుండా, రక్షకునిలా చూడగలుగుతారు.

యేసు ఈ మాటలు అనడానికి కారణం ఏదైనా, తను అనుభవిస్తున్నది యెహోవా ఇష్టంలో భాగమని ఆయనకు తెలుసు. కీర్తనలోని ఆ మాటలు అన్న కాసేపటికి, “అంతా పూర్తయింది!” అని యేసు అన్నాడు. (యోహా. 19:30; లూకా 22:37) అవును, కొన్ని క్షణాల పాటు యెహోవా తనను కాపాడడం ఆపేసినందు వల్లే, తను భూమ్మీదికి వచ్చిన పనిని యేసు పూర్తిగా నెరవేర్చగలిగాడు. అంతేకాదు తన గురించి “ధర్మశాస్త్రంలో, ప్రవక్తల పుస్తకాల్లో, కీర్తనల పుస్తకంలో రాసినవన్నీ” ఆయన నెరవేర్చగలిగాడు.—లూకా 24:44.

a ఈ పత్రికలోని “యేసు చివరి మాటల నుండి ఏం నేర్చుకోవచ్చు?” ఆర్టికల్‌లో 9, 10 పేరాలు కూడా చూడండి.

b పరిచర్య చేసేటప్పుడు, యేసు కొన్నిసార్లు అన్న మాటల్లో లేదా అడిగిన ప్రశ్నల్లో ఉన్నవి నిజానికి ఆయన అభిప్రాయాలు కావు. తన అనుచరులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం కోసం ఆయన అలా మాట్లాడేవాడు.—మార్కు 7:24-27; యోహా. 6:1-5; కావలికోట, అక్టోబరు 15, 2010, 4-5 పేజీలు చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి