మన క్రైస్తవ జీవితం
పునరుత్థానం జరిగే వరకు ఎలా భరించాలి?
మనం ప్రాణంగా ప్రేమించినవాళ్లు చనిపోయినప్పుడు పునరుత్థాన నిరీక్షణే మనలో ఆశను నింపుతుంది. పాపం, మరణం అనే శత్రువులు మనల్ని నీడలా వెంటాడుతూ పట్టిపీడిస్తున్నాయి. (యెష. 25:7, 8) వాటివల్లే “సృష్టి అంతా ఏకస్వరంతో మూల్గుతూ వేదన పడుతోంది.” (రోమా. 8:22) మరి పునరుత్థానం జరిగే వరకు ఆ బాధను ఎలా భరించాలి? మనకు ఊరటనిచ్చే సూత్రాలు దేవుని వాక్యమైన బైబిల్లో ఉన్నాయి.
మనకిష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు . . . వీడియో చూడండి. తర్వాత, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
డానియేల్ అలాగే మసాహీరో యోషిమి జంట ఎలాంటి బాధను అనుభవించారు?
వాళ్లకు సహాయం చేసిన ఐదు విషయాలు ఏంటి?
ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనకు ఓదార్పును ఇవ్వగలిగేది ఎవరు?—2కొ 1:3, 4