చక్కగా సువార్త ప్రకటిద్దాం | శిష్యుల్ని చేసే పనిలో ఆనందం పొందండి
చెడుసహవాసాలకు దూరంగా ఉండేలా బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి
బైబిలు విద్యార్థులు యెహోవాతో స్నేహం చేయాలంటే, వాళ్లు మంచి స్నేహితుల్ని ఎంచుకోవాలి. (కీర్త 15:1, 4) సరైనది చేసేలా వాళ్లు సహాయం చేస్తారు.—సామె 13:20; lff 48వ పాఠం.
బైబిలు విద్యార్థులు చెడుసహవాసాలు విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం వాళ్ల పట్ల సహానుభూతి చూపించాలి. లోకంలో ఉన్న స్నేహితుల్ని విడిచిపెట్టడం వాళ్లకు కష్టంగా ఉండవచ్చు. కాబట్టి బైబిలు స్టడీ చేసేటప్పుడే కాదు మిగతా సమయాల్లో కూడా వాళ్ల పట్ల నిజమైన శ్రద్ధ చూపించాలి. అంటే ఫోన్ చేయవచ్చు, మెసేజ్ చేయవచ్చు, సరదాగా కలిసి మాట్లాడవచ్చు. మీ బైబిలు విద్యార్థి ప్రగతి సాధిస్తుండగా సంఘంలో ఇతరులతో కలిసి సమయం గడిపేలా ఏర్పాట్లు చేయవచ్చు. అలా చేసినప్పుడు వాళ్లు పోగొట్టుకున్న దానికంటే ఇంకా ఎక్కువే పొందుతున్నారని అర్థంచేసుకుంటారు. (మార్కు 10:29, 30) అంతేకాదు వాళ్లు యెహోవా కుటుంబంలో భాగం అవుతున్నందుకు మీరు కూడా ఆనందం పొందుతారు.
మీ బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి . . . చెడుసహవాసాలకు దూరంగా ఉండేలా వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
చెడుసహవాసాలు అంటే ఏంటి?—1కొ 15:33
క్రైస్తవులు సరదాగా సమయం గడపడం అంటే జాస్మిన్ ఏమని ఊహించుకుంది?
చెడుసహవాసాలు విడిచిపెట్టేలా నీతా జాస్మిన్కు ఎలా సహాయం చేసింది?