చక్కగా సువార్త ప్రకటిద్దాం | శిష్యుల్ని చేసే పనిలో ఆనందాన్ని పొందండి
కూటాలకు హాజరయ్యేలా బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి
స్వచ్ఛారాధనలో క్రైస్తవ కూటాలకు ప్రాముఖ్యమైన స్థానం ఉంది. (కీర్త 22:22) యెహోవాను ఆరాధించడానికి వచ్చే వాళ్లందరూ సంతోషాన్ని, దీవెనల్ని పొందుతారు. (కీర్త 65:4) కూటాలకు క్రమంగా హాజరైనప్పుడు బైబిలు విద్యార్థులు త్వరగా ప్రగతి సాధిస్తారు.
కూటాలకు హాజరయ్యేలా మీ బైబిలు విద్యార్థులకు ఎలా సహాయం చేయవచ్చు? కూటాలకు హాజరవ్వమని ఆహ్వానిస్తూ ఉండండి. రాజ్యమందిరం అంటే ఏంటి? వీడియో చూపించండి. కూటాలకు హాజరవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో వివరించండి. (lff 10వ పాఠం) కూటాల్లో మీరు నేర్చుకున్న విషయాల్లో ఒకదాని గురించి లేదా జరగబోయే కూటాల్లో చర్చించుకునే ఒక విషయం గురించి చెప్పండి. కూటాల్లో చర్చించే ప్రచురణలు మీ బైబిలు విద్యార్థికి ఇవ్వండి. వాటిని ఎలా ఉపయోగించాలో చూపించండి. అంతేకాదు మొదట్లో మీరే వాళ్లను కూటాలకు తీసుకెళ్లాల్సిరావచ్చు. మొదటిసారి మీ బైబిలు విద్యార్థులు కూటాలకు రావడానికి మీరు చేసే ఏ ప్రయత్నమైనా చాలా విలువైనది.—1కొ 14:24, 25.
మీ బైబిలు విద్యార్థులకు సహాయం చేయండి . . . కూటాలకు హాజరయ్యేలా వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
జాస్మిన్ను కూటాలకు ఆహ్వానించడానికి నీతా ఎలాంటి అవకాశాన్ని ఉపయోగించుకుంది?
బైబిలు విద్యార్థి కూటాలకు హాజరైనప్పుడు మనం ఎందుకు ఆనందిస్తాం?
“దేవుడు నిజంగా మీ మధ్య ఉన్నాడు”
మొదటిసారి కూటాలకు వెళ్లినప్పుడు జాస్మిన్కు ఎలా అనిపించింది?