కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 సెప్టెంబరు పేజీ 5
  • మీ వివేచనా సామర్థ్యాలకు శిక్షణ ఇస్తూ ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీ వివేచనా సామర్థ్యాలకు శిక్షణ ఇస్తూ ఉండండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనం మంచి నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • విశ్వాసం చూపిస్తూ తెలివైన నిర్ణయాలు తీసుకోండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • దేవుణ్ణి ఘనపర్చే నిర్ణయాలు తీసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ముందుమాట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2024
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 సెప్టెంబరు పేజీ 5

మన క్రైస్తవ జీవితం

మీ వివేచనా సామర్థ్యాలకు శిక్షణ ఇస్తూ ఉండండి

ఒక నైపుణ్యంగల క్రీడాకారుడు ఎప్పుడూ తన కండరాలకు శిక్షణ ఇచ్చుకుంటాడు. అదేవిధంగా, మన వివేచనా సామర్థ్యాలకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చుకోవడానికి కృషి చేస్తూ ఉండాలి. (హెబ్రీ 5:14) ఇతరులు తీసుకున్నలాంటి నిర్ణయాల్నే తీసుకోవాలని మనకు అనిపించవచ్చు, కానీ మనం సొంతగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే, మనం తీసుకునే నిర్ణయాలకు మనలో ప్రతీ ఒక్కరం లెక్క అప్పజెప్పాల్సి ఉంటుంది.—రోమా 14:12.

బాప్తిస్మం తీసుకొని ఎక్కువ సంవత్సరాలైంది కాబట్టి మనం మంచి నిర్ణయాలే తీసుకుంటామని అనుకోకూడదు. మనం తెలివైన నిర్ణయాలు తీసుకోవాలంటే యెహోవాపై, ఆయన వాక్యంపై, ఆయన సంస్థపై పూర్తిగా ఆధారపడాలి.—యెహో 1:7, 8; సామె 3:5, 6; మత్త 24:45.

“మంచి మనస్సాక్షిని కాపాడుకోండి” వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • “మంచి మనస్సాక్షిని కాపాడుకోండి” అనే వీడియో నుండి ఒక సన్నివేశం. ఎమ్మా, ఆమె భర్త వివాహ ఆహ్వానాన్ని చూస్తున్నారు.

    ఎమ్మా ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది?

  • “మంచి మనస్సాక్షిని కాపాడుకోండి” అనే వీడియో నుండి ఒక సన్నివేశం. తన బలమైన అభిప్రాయాన్ని చెప్తున్న యేమీ.

    మనస్సాక్షికి సంబంధించిన విషయాల్లో మనమెందుకు సొంత అభిప్రాయాల్ని చెప్పకూడదు?

  • “మంచి మనస్సాక్షిని కాపాడుకోండి” అనే వీడియో నుండి ఒక సన్నివేశం. షార్లెట్‌ అలాగే ఆలెన్‌ను సలహా అడుగుతున్న ఎమ్మా.

    ఒక జంట ఎమ్మాకు ఏ తెలివైన సలహా ఇచ్చారు?

  • “మంచి మనస్సాక్షిని కాపాడుకోండి” అనే వీడియో నుండి ఒక సన్నివేశం. తన కంప్యూటర్‌లో “కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ” ఉపయోగించి పరిశోధన చేస్తున్న ఎమ్మా.

    తన పరిస్థితికి ఉపయోగపడే సమాచారం ఎమ్మాకు ఎక్కడ దొరికింది?

నిర్ణయాలు తీసుకునేటప్పుడు నేను వేటి మీద ఆధారపడాలి?

  • సొంత అభిప్రాయం

  • ఇతరుల అభిప్రాయాలు

  • బైబిలు సూత్రాలు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి