కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 జనవరి పేజీ 11
  • యెహోవాను సేవించాలని నిర్ణయించుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాను సేవించాలని నిర్ణయించుకోండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • బాప్తిస్మం తీసుకోవాలనే లక్ష్యం పెట్టుకోండి!
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • బాప్తిస్మం—ఒక ప్రాముఖ్యమైన చర్య
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • బాప్తిస్మానికి ఉన్న అర్థం తెలుసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2026
  • క్రైస్తవ బాప్తిస్మానికి అర్హులవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 జనవరి పేజీ 11
మలుపులు తిరిగివున్న రోడ్డు యెహోవా సేవకు నడిపించే మార్గాన్ని సూచిస్తుంది. రోడ్డు వెంబడి ఉన్న సైన్‌ బోర్డులు బైబిలు స్టడీ, కూటాలకు హాజరవడం, ప్రకటించడం, బాప్తిస్మం వంటి పనులను సూచిస్తున్నాయి.

బాప్తిస్మానికి నడిపించే మార్గంలో మీరు ఎక్కడ ఉన్నారు?

మన క్రైస్తవ జీవితం

యెహోవాను సేవించాలని నిర్ణయించుకోండి

మీరు బాప్తిస్మం తీసుకోని యౌవనులా? లేదా బైబిలు విద్యార్థులా? అయితే మీకు బాప్తిస్మం తీసుకోవాలనే లక్ష్యం ఉందా? ఇంతకీ, మీరు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? యెహోవాతో ఒక ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉండడానికి సమర్పణ, బాప్తిస్మం సహాయం చేస్తాయి. (కీర్త 91:1) అంతేకాదు, రక్షణ పొందడానికి సహాయం చేస్తాయి. (1పే 3:21) మీరు బాప్తిస్మానికి అర్హులు కావాలంటే ఏం చేయవచ్చు?

ఇదే సత్యమని నమ్మకం కుదుర్చుకోండి. మీ సందేహాలను తీర్చుకోవడానికి పరిశోధన చేయండి. (రోమా 12:2) మీరు ఏ మార్పులు చేసుకోవాలో గుర్తించండి. ఆ మార్పులు చేసుకుంటున్నప్పుడు యెహోవాను సంతోషపెట్టడం మీ లక్ష్యమై ఉండాలి. (సామె 27:11; ఎఫె 4:23, 24) సహాయం కోసం ఆయనకు ప్రార్థిస్తూ ఉండండి. యెహోవా తన శక్తివంతమైన పవిత్రశక్తిని ఇచ్చి మిమ్మల్ని బలపరుస్తాడని, మీకు మద్దతిస్తాడని నమ్మండి. (1పే 5:10, 11) మీరు చేసే కృషి వృథా కాదు. యెహోవాను సేవించడం కన్నా శ్రేష్ఠమైన జీవితం మరొకటి లేదు!—కీర్త 16:11.

బాప్తిస్మానికి నడిపించే మార్గం వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వండి:

  • బాప్తిస్మం తీసుకోవడానికి కొంతమంది ఎలాంటి సవాళ్లను అధిగమించారు?

  • యెహోవాకు సమర్పించుకోవడానికి అవసరమైన విశ్వాసాన్ని మీరెలా పెంపొందించుకోవచ్చు?

  • బాప్తిస్మానికి అర్హత సాధించేలా కొంతమంది ఏం చేశారు?

  • యెహోవాను సేవించాలని నిర్ణయించుకునేవాళ్లు ఎలాంటి దీవెనలు పొందుతారు?

  • సమర్పించుకోవడం, బాప్తిస్మం తీసుకోవడం అంటే ఏంటి?

బాప్తిస్మ ప్రసంగం చివర్లో, బాప్తిస్మ అభ్యర్థులను లేచి నిలబడి, ఈ రెండు ప్రశ్నలకు బిగ్గరగా జవాబు చెప్పమని ప్రసంగీకుడు అడుగుతాడు:

మీ పాపాల విషయంలో పశ్చాత్తాపపడి, యెహోవాకు సమర్పించుకుని, ఆయన యేసుక్రీస్తు ద్వారా చేసిన రక్షణ ఏర్పాటును మీరు అంగీకరించారా?

మీ బాప్తిస్మం ద్వారా మీరు యెహోవాసాక్షుల్లో ఒకరిగా గుర్తించబడతారని, యెహోవా సంస్థలో భాగమౌతారని అర్థం చేసుకున్నారా?

ఆ ప్రశ్నలకు అవునని ఇచ్చే జవాబులు, బాప్తిస్మ అభ్యర్థులు తమకు విమోచన క్రయధనం మీద విశ్వాసం ఉందని, యెహోవాకు హృదయపూర్వకంగా సమర్పించుకున్నామని అందరిముందు ఒక “బహిరంగ” ప్రకటనగా ఉంటాయి.—రోమా 10:9, 10.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి