దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఆదికాండం 38-39
యెహోవా యోసేపును ఎప్పుడూ విడిచిపెట్టలేదు
యోసేపు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు, అతను చేసే ప్రతీ పనిని యెహోవా “సఫలం” చేశాడు. అంతేకాదు, చెరసాల ముఖ్య అధికారి దృష్టిలో అతను “అనుగ్రహం పొందేలా” యెహోవా చేశాడు. (ఆది 39:2, 3, 21-23) ఈ వృత్తాంతం నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?
కష్టాలు వచ్చినంత మాత్రాన మనం యెహోవా అనుగ్రహం కోల్పోయామని కాదు.—కీర్త 34:19
యెహోవా మనల్ని ఎలా దీవిస్తున్నాడో గుర్తించడానికి ప్రయత్నించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి.—ఫిలి 4:6, 7
సహాయం కోసం యెహోవాపై ఆధారపడాలి.—కీర్త 55:22