కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 డిసెంబరు పేజీ 8
  • భూమి “నదిని మింగేసింది”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • భూమి “నదిని మింగేసింది”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • విశ్వాసం కారణంగా జైలు పాలైన యెహోవాసాక్షులు—ప్రాంతాల వారిగా
    విశ్వాసం కారణంగా జైలు పాలైనవాళ్లు
  • రాజ్య ప్రచారకులు కోర్టును ఆశ్రయించడం
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • హింసలు ఎదుర్కొంటున్న సహోదరుల కోసం ప్రార్థించండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • దేవుని రాజ్యం ఆరంభమైంది!
    ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 డిసెంబరు పేజీ 8
కొరియాలో యెహోవాసాక్షులను జైల్లో వేసిన కేసుకు సంబంధించి యునైటెడ్‌ నేషన్స్‌ ఇచ్చిన కొన్ని చట్టపరమైన డాక్యుమెంట్ల చిత్రం, వెనుక చిత్రంలో ఖైదీ బట్టలు వేసుకుని ఉన్న కొరియా సహోదరులు

మన క్రైస్తవ జీవితం

భూమి “నదిని మింగేసింది”

చరిత్రంతటిలో, లోక అధికారులు యెహోవా ప్రజలకు సహాయం చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. (ఎజ్రా 6:1-12; ఎస్తే 8:10-13) మనకాలంలో కూడా, “మహాసర్పం” అయిన సాతాను వెళ్లగక్కుతున్న హింస అనే “నదిని” “భూమి” మింగేయడం మనం గమనించాం. ఈ లోకంలో అధికారం, పలుకుబడి ఉన్న కొంతమంది వ్యక్తులను “భూమి” సూచిస్తుంది. (ప్రక 12:16) ‘పూర్ణరక్షణ కలుగజేసే దేవుడైన’ యెహోవా, తన ప్రజలకు సేదదీర్పు ఇవ్వడానికి కొన్నిసార్లు మానవ పరిపాలకుల్ని ఉపయోగించుకుంటాడు.—కీర్త 68:20; సామె 21:1.

మీ విశ్వాసాన్ని బట్టి మిమ్మల్ని జైల్లో వేస్తే అప్పుడేంటి? యెహోవా మిమ్మల్ని గమనించట్లేదేమో అని ఎన్నడూ సందేహించకండి. (ఆది 39:21-23; కీర్త 105:17-20) మీ విశ్వాసానికి తగిన ప్రతిఫలం పొందుతారనే నమ్మకంతో ఉండండి. మీ యథార్థత ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ సహోదరులను ప్రోత్సహిస్తుంది. —ఫిలి 1:12-14; ప్రక 2:10.

కొరియాలోని సహోదరులు జైలు నుండి విడుదలయ్యారు వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:

  • ఎన్నో ఏళ్లుగా, దక్షిణ కొరియాలోని వేలమంది సహోదరులు ఎందుకు జైల్లో వేయబడ్డారు?

  • మన సహోదరుల్లో కొంతమంది త్వరగా విడుదలవ్వడానికి ఏ కోర్టు తీర్పులు సహాయం చేశాయి?

  • ప్రపంచవ్యాప్తంగా, తమ విశ్వాసాన్ని బట్టి ప్రస్తుతం జైల్లో ఉన్న సహోదరులకు మనం ఎలా సహాయం చేయవచ్చు?

  • మనకు ప్రస్తుతం ఉన్న స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకోవచ్చు?

  • న్యాయస్థానాల్లో మనం సాధించే విజయాలకు అసలు కారణం ఎవరు?

ఒకప్పుడు యెహోవాసాక్షులను ఉంచిన కొరియాలోని జైలు; జైల్లో ఉన్న సహోదరులకు ఉత్తరాలు రాసి కొరియా బ్రాంచికి పంపిన యెహోవాసాక్షులు, బ్రాంచి వాటిని జైల్లో ఉన్న సహోదరులకు అందజేసింది; జైలు నుండి విడుదలైన కొడుకును కౌగిలించుకున్న తండ్రి

నాకున్న స్వేచ్ఛను నేను ఎలా ఉపయోగించుకుంటున్నాను?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి