దేవుని వాక్యంలో ఉన్న సంపద | రోమీయులు 9-11
ఒలీవ చెట్టు ఉదాహరణ
ఒలీవ చెట్టులోని భాగాలు వేటిని సూచిస్తున్నాయి?
చెట్టు: అబ్రాహాము ఒప్పందం విషయంలో దేవుని సంకల్పం నెరవేరడం
మొద్దు: అబ్రాహాము సంతానంలో ప్రధాన భాగమైన యేసు
కొమ్మలు: అబ్రాహాము సంతానంలో రెండవ భాగమైన వాళ్లందరూ
‘విరిచిన’ కొమ్మలు: యేసును తిరస్కరించిన సహజ యూదులు
‘అంటుకట్టిన’ కొమ్మలు: అన్యజనుల్లో నుండి వచ్చిన అభిషిక్త క్రైస్తవులు
ముందే చెప్పినట్టు అబ్రాహాము సంతానం, అంటే యేసు అలాగే 1,44,000 మంది “లోకానికి” దీవెనలు తెస్తారు.—రోమా 11:12; ఆది 22:18
అబ్రాహాము సంతానం విషయంలో తన సంకల్పం నెరవేర్చిన తీరును బట్టి, యెహోవా గురించి నేను ఏమి నేర్చుకోవచ్చు?