దేవుని వాక్యంలో ఉన్న సంపద | యిర్మీయా 25-28
యిర్మీయాలా ధైర్యంగా ఉండండి
యెరూషలేము కూడా షిలోహులా నాశనం అయిపోతుందని యిర్మీయా హెచ్చరించాడు
యెహోవా సన్నిధికి గుర్తుగా ఉన్న నిబంధన మందసం ఒకప్పుడు షిలోహులో ఉంది
ఫిలిష్తీయులు వచ్చి మందసాన్ని తీసుకుని వెళ్లిపోవడానికి యెహోవా అనుమతించాడు. తర్వాత మళ్లీ ఆ మందసం షిలోహుకు రాలేదు
యాజకులు, ప్రవక్తలు, ప్రజలందరూ యిర్మీయాను చంపుతామని బెదిరించారు
యెరూషలేముకు, ఆలయానికి వ్యతిరేకంగా ప్రవచిస్తున్నందుకు ప్రజలు యిర్మీయాను పట్టుకున్నారు
యిర్మీయా భయపడలేదు, పారిపోలేదు
యెహోవా యిర్మీయాను కాపాడాడు
యిర్మీయా ధైర్యంగా ఉన్నందుకు, యెహోవా ఆయనను విడిచిపెట్టలేదు
యిర్మీయాను కాపాడడానికి దేవుడు ధైర్యవంతుడైన అహీకామును కదిలించాడు
ప్రజలకు నచ్చని సందేశాన్ని యెహోవా మద్దతుతో, ప్రోత్సాహంతో యిర్మీయా 40 సంవత్సరాలు ప్రకటించగలిగాడు