మన క్రైస్తవ జీవితం
మీకున్న నిరీక్షణను బట్టి సంతోషించండి
నిరీక్షణ లంగరు లాంటిది. (హెబ్రీ 6:19) సముద్రంలో తుఫానులు వచ్చినప్పుడు ఓడ బద్దలవ్వకుండా కాపాడే లంగరులా నిరీక్షణ మనం ఆధ్యాత్మికంగా దెబ్బతినకుండా కాపాడుతుంది. (1 తిమో 1:18, 19) మనం అనుకున్నవి జరగకపోవడం, ఆస్తి నష్టం, చాలాకాలంగా ఉన్న అనారోగ్యం, ప్రియమైన వాళ్లు చనిపోవడం, లేదా మన యథార్థతకు ప్రమాదం కలిగించే ఇంకేవైనా, సముద్రంలో వచ్చే తుఫానుల్లాంటివే.
విశ్వాసం, నిరీక్షణ మనకు వాగ్దానం చేసిన బహుమానాన్ని స్పష్టంగా చూడడానికి సహాయం చేస్తాయి. (2 కొరిం 4:16-18; హెబ్రీ 11:13, 26, 27) కాబట్టి మన నిరీక్షణ పరలోకం అయినా, భూమ్మీద అయినా దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాలను క్రమంగా ధ్యానిస్తూ శక్తిని పొందుతూ ఉండాలి. అప్పుడు, మనం బాధల వల్ల కృంగిపోయినా మన ఆనందాన్ని కాపాడుకోవచ్చు.—1 పేతు 1:6, 7.
నిరీక్షణను బట్టి సంతోషించండి అనే వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
మనం అనుకరించడానికి మోషే ఎందుకు ఒక మంచి ఉదాహరణ?
కుటుంబ యజమానులకు ఏ బాధ్యత ఉంది?
కుటుంబ ఆరాధన ప్రాజెక్టులుగా మీరు ఏ అంశాలను పరిశీలించవచ్చు?
పరీక్షలను ధైర్యంగా ఎదుర్కోవడానికి నిరీక్షణ మీకెలా సహాయం చేస్తుంది?
మీరు దేని కోసం ఎదురు చూస్తున్నారు?