మన క్రైస్తవ జీవితం
పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం ఆసక్తి ఉన్నవాళ్లు మీటింగ్‌కి వచ్చేలా ప్రోత్సహించండి
ఎందుకు ప్రాముఖ్యం? క్రమంగా యెహోవాను స్తుతించడానికి, ఆయనకు స్తోత్రగీతములు పాడడానికి మీటింగ్స్ అవకాశాన్ని ఇస్తాయి. (కీర్త 149:1) మీటింగ్స్‌లో మనం యెహోవాకు ఇష్టమైన పనులు చేయడం నేర్చుకుంటాం. (కీర్త 143:10) ఆసక్తి ఉన్నవాళ్లు, బైబిలు విద్యార్థులు మీటింగ్స్‌కు రావడం మొదలుపెట్టినప్పటి నుండి ఎక్కువ అభివృద్ధి సాధిస్తారు.
ఎలా చేయాలి?
కలిసిన వెంటనే, వీలైనంత త్వరగా మీటింగ్స్‌కి ఆహ్వానించండి. బైబిలు స్టడీ క్రమంగా జరిగే వరకు ఆగాల్సిన అవసరం లేదు.—ప్రక 22:17
మీటింగ్స్ ఎలా ఉంటాయో, జరగబోయే మీటింగ్‌లో ఏ విషయాలు చర్చిస్తారో ఆసక్తి ఉన్నవాళ్లకు వివరించండి. ఈ విషయంలో సంఘ కూటాల ఆహ్వాన పత్రం, రాజ్యమందిరం అంటే ఏంటి? వీడియో, యెహోవా ఇష్టం బ్రోషురులో 5, 7 పాఠాలు మీకు సహాయం చేస్తాయి
సహాయం చేయడానికి ముందుకు రండి. ఆసక్తి ఉన్నవాళ్లు మీటింగ్‌కు రావడానికి ప్రయాణ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉండొచ్చు. మీటింగ్‌లో గౌరవంగా ఉండడానికి ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పాల్సిన అవసరం ఉండొచ్చు. మీటింగ్‌లో వాళ్ల ప్రక్కన కూర్చుని పుస్తకాలు చూపించండి. వేరేవాళ్లకు పరిచయం చేయండి