దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 135-141
యెహోవా మనల్ని అద్భుతంగా తయారు చేశాడు
దేవుని మంచి లక్షణాల గురించి సృష్టిలో ఉన్న రుజువులను దావీదు ధ్యానించాడు. ఆయన పూర్తి నమ్మకంతో యెహోవా సేవ చేయడానికి తన జీవితాన్ని ఉపయోగించాడు.
సృష్టి గురించి దావీదు లోతుగా ఆలోచించినప్పుడు యెహోవాను స్తుతించడానికి ప్రేరణ పొందాడు:
“నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను”
“నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగిన యెముకలును నీకు మరుగై యుండలేదు”
“నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను ... నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను”