దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2015, జూన్ 29తో మొదలయ్యే వారంలో జరిగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం. ప్రతీవారం పాఠశాలకు సిద్ధపడుతున్నప్పుడు పరిశోధన చేయడానికి వీలుగా ప్రతీ ప్రశ్నను ఎప్పుడు చర్చిస్తారో ఆ తేదీని కూడా ఇచ్చారు.
మీకాలు దావీదుతో మాట్లాడిన విధానంలో తప్పేంటి? దీని నుండి భార్యాభర్తలు ఏ పాఠం నేర్చుకోవాలి? (2 సమూ. 6:20-23) [మే 11, w12 1/1 31వ పేజీ, 10వ పేరా]
దావీదు యెహోవా కోసం మందిరం కడతానన్నప్పుడు, నాతాను దానికి సరే అన్నాడు. అందుకు యెహోవా నాతానును సరిదిద్దాడు. అప్పుడు ఆయనెలా స్పందించాడు? (2 సమూ. 7:2, 3) [మే 11, w12 2/15 24వ పేజీ, 6-7 పేరాలు]
“నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు” అని నేరుగా అనే బదులు నాతాను ఎందుకు 2వ సమూయేలు 12:1-7లో ఉన్న ఉదాహరణ ఉపయోగించాడు? మంచి బోధకులవడానికి అది మనకెలా సహాయం చేస్తుంది? [మే 18, w12 2/15 24వ పేజీ, 2-3 పేరాలు]
అబ్షాలోము ఇశ్రాయేలీయులను ఎలా మోసం చేయగలిగాడు? అబ్షాలోము లాంటి వాళ్ల నుండి నేడు మనల్ని మనమెలా కాపాడుకోవచ్చు? (2 సమూ. 15:6) [మే 25, w12 7/15 13వ పేజీ, 7వ పేరా]
దావీదు చాలా దీనస్థితిలో ఉన్నప్పుడు యెహోవా ఆయనకు ఎలా సహాయం అందించాడు? దీని నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (2 సమూ. 17:27-29) [జూన్ 1, w08 9/15 6వ పేజీ, 15-16 పేరాలు]
పరదేశి అయిన ఇత్తయితో దావీదు వ్యవహరించిన తీరు నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (2 సమూ. 18:2) [జూన్ 1, w09 5/15 27వ పేజీ, 7వ పేరా]
బర్జిల్లయి ఉదాహరణ నుండి సంఘంలోని వృద్ధులు ఎలా ప్రయోజనం పొందవచ్చు? (2 సమూ. 19:33-35) [జూన్ 8, w07 7/15 15వ పేజీ, 1-2 పేరాలు]
దేవుని వినయం ఒకవ్యక్తిని ఎలా “గొప్ప” చేస్తుంది? (2 సమూ. 22:36) [జూన్ 15, w12 11/15 17వ పేజీ, 7వ పేరా]
దేవుని పట్ల యథార్థతను నాతాను ఎలా చూపించాడు? నేడు మనం కూడా ఎలా చూపించవచ్చు? (1 రాజు. 1:11-14) [జూన్ 22, w12 2/15 25వ పేజీ; 1, 4-5 పేరాలు]
సొలొమోను చేసినట్లే, ఒక దేవుని సేవకుడు దేవుని ప్రమాణాలను మీరేందుకు ఏయే విషయాల్లో కుంటి సాకులు వెతుకుతూ తప్పుగా ఆలోచించే అవకాశముంది? (1 రాజు. 3:1) [జూన్ 29, w11 12/15 10వ పేజీ, 12-14 పేరాలు]