కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/14 పేజీ 3
  • ప్రశ్నాభాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నాభాగం
  • మన రాజ్య పరిచర్య—2014
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయవచ్చు?—2వ భాగం
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • తల్లిదండ్రులారా, యెహోవాను ప్రేమించేలా మీ పిల్లలకు సహాయం చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • ఆధ్యాత్మికంగా బలమైన కుటుంబాన్ని నిర్మించుకోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • తల్లిదండ్రులారా, మీ కుటుంబాన్ని సంరక్షించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2014
km 5/14 పేజీ 3

ప్రశ్నాభాగం

◼ ఆధ్యాత్మిక పరిణతి సాధించాలంటే పిల్లలు తప్పనిసరిగా ఏమి నేర్చుకోవాలి?

క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లల్ని “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను” పెంచడానికి ఎంతో కృషిచేస్తారు. (ఎఫె. 6:4) ప్రతీ ఉదయం పిల్లలతో కలిసి దినవచనం పరిశీలించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని కొందరు తల్లిదండ్రులు గమనించారు. కుటుంబ ఆరాధనప్పుడు లేదా ఇతర సమయాల్లో కుటుంబమంతా కలిసి ఏదైనా వీడియోను చూసి దానిలోని విషయాలు చర్చించుకోవచ్చు, యువత ఇలా అడుగుతోంది (ఇంగ్లీషు) ఆర్టికల్స్‌లోని అవసరమైన సమాచారాన్ని పరిశీలించవచ్చు, ఏదైనా బైబిలు వృత్తాంతాన్ని నటించవచ్చు లేదా దేన్నైనా ప్రాక్టీసు చేయవచ్చు. అయితే, పిల్లలు పరిణతి సాధించాలంటే వాళ్లకు లోతైన బైబిలు సత్యాలు కూడా నేర్పించాలి.—హెబ్రీ. 6:1.

పరిచర్యలో కలిసేవాళ్లకు మనం ఏమేం నేర్పిస్తాం? మొదటిసారి కలిసినప్పుడు లేదా ఆ తర్వాత చేసే పునర్దర్శనాల్లో, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం ఉపయోగించి వాళ్లతో బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి ప్రయత్నిస్తాం. ఆ పుస్తకం పూర్తయ్యాక, ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ పుస్తకంతో అధ్యయనం కొనసాగిస్తాం. ఎందుకు? లేఖనాల్లోని ప్రాథమిక సత్యాల్ని అర్థం చేసుకోవడానికి బైబిలు బోధిస్తోంది పుస్తకం విద్యార్థికి సహాయం చేస్తుంది. రోజువారీ జీవితంలో బైబిలు సూత్రాల్ని పాటించడమెలాగో దేవుని ప్రేమ పుస్తకం నేర్పిస్తుంది. ఆ రెండు పుస్తకాలూ పరిశీలించడం వల్ల కొత్తవాళ్లు ‘క్రీస్తునందు వేరుపారి, విశ్వాసంలో స్థిరపడగలుగుతారు.’ (కొలొ. 2:6, 7) మరి అలాంటి సమాచారం మన పిల్లలకు కూడా ఉపయోగపడదా? విమోచనా క్రయధనం గురించి, దేవుని రాజ్యం గురించి, చనిపోయినవాళ్ల స్థితి గురించి మన పిల్లలకు కూడా నేర్పించాలి. అలాగే, దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడో, మనం ఈ దుష్ట వ్యవస్థ అంత్యదినాల్లో జీవిస్తున్నామని ఎలా గుర్తించాలో వాళ్లకు తెలియాలి. యెహోవాసాక్షుల దగ్గరే సత్యం ఉందని వాళ్లకు నమ్మకం కుదరాలి. బైబిలు సూత్రాల్ని అర్థం చేసుకుని తమ ‘జ్ఞానేంద్రియాలకు’ ఎలా శిక్షణనివ్వాలో కూడా పిల్లలకు నేర్పించాలి. (హెబ్రీ. 5:14) తల్లిదండ్రులు తమ పిల్లల వయసును, అవగాహనా సామర్థ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. నిజానికి, చాలామంది పిల్లలకు చిన్న వయసులోనే బైబిల్లోని లోతైన సత్యాలను అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుంది.—లూకా 2:42, 46, 47.

ఈ విషయంలో తల్లిదండ్రులకు సహాయపడేలా ఇప్పటినుండి, jw.orgలో బైబిలు బోధిస్తోంది పుస్తకం ఆధారంగా రూపొందించిన స్టడీ గైడ్స్‌ ఉంటాయి. వీటిని మన వెబ్‌సైట్‌లో BIBLE TEACHINGS కింద TEENAGERSలో చూడవచ్చు. ముందుముందు, దేవుని ప్రేమ పుస్తకం ఆధారంగా కూడా కొన్ని స్టడీ గైడ్స్‌ రూపొందిస్తాం. కావాలంటే, ముద్రిత పుస్తకాన్ని కూడా ఉపయోగించవచ్చు. కుటుంబ ఆరాధనలో దీనికి కొంత సమయం కేటాయించాలా? ప్రత్యేకంగా ఒక పిల్లవాడితో బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు దీన్ని ఉపయోగించాలా? వ్యక్తిగత అధ్యయనం ఎలా చేయాలో పిల్లవాడికి నేర్పిస్తున్నప్పుడు దీన్ని ఉపయోగించాలా? అనేది తల్లిదండ్రులు నిర్ణయించవచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి