దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2014 ఫిబ్రవరి 24తో మొదలయ్యే వారంలో జరిగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం.
హవ్వ దేని గురించి ఆలోచించేలా సాతాను చేశాడు, తినొద్దని చెప్పిన పండ్లను తిని హవ్వ ఏమి చూపించింది? (ఆది. 3:6) [జన. 6, w11 5/15 16-17 పేజీలు, 5వ పేరా]
హేబెలు బలమైన విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకున్నాడు, దానివల్ల ఏ ఆశీర్వాదాలు పొందాడు? (ఆది. 4:4, 5; హెబ్రీ. 11:4) [జన. 6, w13 1/1 12వ పేజీ, 3వ పేరా; 14వ పేజీ, 4-5 పేరాలు]
పవిత్ర జంతువులకు, అపవిత్ర జంతువులకు మధ్య తేడా చూపించడానికి ఏది ఆధారంగా ఉపయోగించబడేది? (ఆది. 7:2) [జన. 13, w04 1/1 29వ పేజీ, 7వ పేరా]
ఆదికాండము 19:14-17, 26లోని లోతు, ఆయన భార్య గురించిన వృత్తాంతం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? [జన. 27, w03 1/1 16-17 పేజీలు, 20వ పేరా]
పునరుత్థానం మీద, ఇస్సాకు ద్వారా తన సంతానాన్ని వృద్ధి చేస్తానని యెహోవా ఇచ్చిన వాగ్దానం మీద తనకు విశ్వాసం ఉందని అబ్రాహాము ఎలా చూపించాడు? (ఆది. 22:1-18) [ఫిబ్ర. 3, w09 4/1 15వ పేజీ, 4వ పేరా]
“పెద్దవాడు చిన్నవానికి దాసుడగును” అని ఆదికాండము 25:23లో ఉన్న ప్రవచనం నుండి మనం ఏ ప్రాముఖ్యమైన సత్యాలు నేర్చుకోవచ్చు? [ఫిబ్ర. 10, w03 10/15 29వ పేజీ, 2వ పేరా]
యాకోబుకు కలలో ఒక “నిచ్చెన” కనిపించింది, ఆ కల భావమేమిటి? (ఆది. 28:12, 13) [ఫిబ్ర. 10, w04 1/15 28వ పేజీ, 6వ పేరా]
పుత్రదాతవృక్ష పండ్ల కోసం రాహేలు గర్భధారణా అవకాశాన్ని ఎందుకు వదులుకుంది? (ఆది. 30:14, 15) [ఫిబ్ర. 17, w04 1/15 28వ పేజీ, 7వ పేరా]
ఆశీర్వాదాల కోసం గట్టిగా ప్రయత్నించిన యాకోబును మనమెలా అనుకరించవచ్చు? (ఆది. 32:24-29) [ఫిబ్ర. 24, w04 1/15 28వ పేజీ, 9వ పేరా]
దీనాకు ఎదురైన లాంటి పరిస్థితి మనకు ఎదురవ్వకూడదంటే మనమేమి చేయాలి? (ఆది. 34:1, 2) [ఫిబ్ర. 24, w01 8/1 20-21 పేజీలు]