కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/13 పేజీ 4
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2013
మన రాజ్య పరిచర్య—2013
km 3/13 పేజీ 4

ప్రకటనలు

▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? మార్చి, ఏప్రిల్‌: కావలికోట పత్రిక. ఆసక్తి చూపించినవాళ్లను మళ్లీ కలిసినప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని గానీ ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి, దేవుడు చెప్పేది వినండి లేదా దేవుడు చెప్పేది వినండి—నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని గానీ ఇచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించండి. మే, జూన్‌: ఈ కరపత్రాల్లో ఒకదాన్ని అందించండి: కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి, బాధలన్నీ త్వరలోనే అంతమవుతాయి!, మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు?, విధి మీ జీవితాన్ని నిర్ణయిస్తుందా?, శాంతియుతమైన నూతనలోకంలో జీవితము. ఎవరైనా ఆసక్తి చూపిస్తే, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని గానీ, దేవుడు చెప్పేది వినండి లేదా దేవుడు చెప్పేది వినండి—నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని గానీ ఉపయోగించి బైబిలు అధ్యయనం ఎలా చేస్తారో చూపించండి.

▪ జ్ఞాపకార్థ ఆచరణ, 2013 మార్చి 26 మంగళవారం రోజు జరుగుతుంది. సాధారణంగా మీరు మంగళవారం రోజు కూటాలు జరుపుకుంటున్నట్లయితే, రాజ్యమందిరం అందుబాటులో ఉంటే ఆ వారం జరిగే కూటాలను అదే వారంలోని మరో రోజుకు మార్చుకోండి. ఒకవేళ సేవా కూటాన్ని జరుపుకోవడానికి వీలుకాకపోతే, మీ సంఘానికి వర్తించే భాగాలను మరో వారం జరిగే సేవా కూటంలో చర్చించేలా పెద్దల సభ సమన్వయకర్త, పట్టికలో మార్పులు చేయవచ్చు. ఒకవేళ, జ్ఞాపకార్థ ఆచరణ జరిగే వారంలో ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనం ఉంటే, మంగళవారం జరిగే కూటాలను ఆ వారంలో మరో రోజుకు మార్చుకోవాలి.

▪ అందుబాటులోవున్న కొత్త ప్రచురణలు:

క్రైస్తవ గ్రీకు లేఖనాల నూతనలోక అనువాదం —డీవీడీలో —అమెరికన్‌ సంజ్ఞా భాష

యెహోవాకు కీర్తనలు పాడదాం —నేపాలీ

బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది —మణిపురి

దేవుడు చెప్పేది వినండి —మిజో, మణిపురి

‘వెలిచూపువలన కాక విశ్వాసంతో నడుచుకోండి’—డీవీడీలో —ఆంగ్లం, తమిళం, నేపాలీ, మలయాళం, హిందీ

వినండి, లోబడండి, దీవెనలు పొందండి—డీవీడీలో —అమెరికన్‌ సంజ్ఞా భాష, ఆంగ్లం, కన్నడ, తమిళం, తెలుగు, బెంగాలీ, నేపాలీ, మరాఠీ, మలయాళం, హిందీ

దేవుడు చెబుతున్న మంచివార్త!—డీవీడీలో —అమెరికన్‌ సంజ్ఞా భాష

నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు?—డీవీడీలో —అమెరికన్‌ సంజ్ఞా భాష

▪ మళ్లీ లభ్యమయ్యే ప్రచురణలు:

దేవుడు చెబుతున్న మంచివార్త! —ఆంగ్లం, కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, నేపాలీ, పంజాబీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, మిజో, హిందీ

నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు? —ఆంగ్లం, కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, నికోబారీస్‌, నేపాలీ, పంజాబీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, మిజో, హిందీ

యెహోవాసాక్షులు—క్రియల్లో చూపించిన విశ్వాసం, 2వ భాగం: వెలుగు ప్రకాశించును గాక—డీవీడీలో —ఆంగ్లం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి