ప్రకటనలు
▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? జూలై, ఆగస్టు: మీ ప్రాంతంలోని ప్రజలకు ఆసక్తికరంగా ఉండే, మీ భాషలో అందుబాటులో ఉన్న 32 పేజీల బ్రోషుర్ ఏదైనా ఇవ్వవచ్చు. సెప్టెంబరు: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? మొదటిసారి కలిసినప్పుడే బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి ప్రయత్నించండి. గృహస్థుల దగ్గర ఈ పుస్తకం అప్పటికే ఉంటే, వాళ్లు బైబిలు అధ్యయనం చేయడానికి ఇష్టపడకపోతే వాళ్లకు ఆసక్తివున్న అంశం గురించి తెలియజేసే ఏదైనా పాత పత్రికను లేదా బ్రోషుర్‌ను ఇవ్వవచ్చు. అక్టోబరు: కావలికోట పత్రిక. ఆసక్తివున్న వాళ్లకు మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? అనే కరపత్రం ఇచ్చి బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి కృషిచేయండి.
▪ సమావేశానికి సంబంధించిన సలహాలు, జ్ఞాపికలు పరిశీలించడం కోసం మీ జిల్లా సమావేశానికి ముందు వారంలో జరిగే కూటాలు అవసరమైతే సర్దుబాటు చేసుకోవచ్చు. సమావేశం అయిన ఒకటి లేదా రెండు నెలల తర్వాత, పరిచర్యలో ప్రచారకులకు సహాయకరంగా అనిపించిన సమావేశ అంశాలను పరిశీలించడం కోసం స్థానిక అవసరాలు చర్చించే సమయాన్ని ఉపయోగించవచ్చు.