కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/08 పేజీ 12
  • దృఢమైన విశ్వాసానికి నిదర్శనం!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దృఢమైన విశ్వాసానికి నిదర్శనం!
  • మన రాజ్య పరిచర్య—2008
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘సకల జనములకు సాక్ష్యము’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • మనం “అంత్యదినములలో” జీవిస్తున్నామా?
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • లోకాంతం దగ్గర్లో ఉందా?
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • “నీ రాకడకు సూచనలేవి?”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మన రాజ్య పరిచర్య—2008
km 2/08 పేజీ 12

దృఢమైన విశ్వాసానికి నిదర్శనం!

1 యేసు తన ప్రత్యక్షత గురించి, యుగ సమాప్తి గురించి మాట్లాడుతున్నప్పుడు అపొస్తలులు శ్రద్ధగా విన్నారు. యుద్ధాలు, కరవులు, భూకంపాలు, తెగుళ్ళు వంటి కలవరపరిచే సంఘటనలు మానవాళికి సంభవించాల్సివుంది. తన అనుచరులు ద్వేషింపబడి, కఠినమైన పరీక్షలు ఎదుర్కొని, చనిపోతారని కూడా యేసు చెప్పాడు. అంతేకాక, అబద్ధ ప్రవక్తలు వచ్చి అనేకులను మోసగిస్తారని, అనేకుల ప్రేమ చల్లారిపోతుందని కూడా ఆయన చెప్పాడు.

2 అలాంటి పరిస్థితుల్లో కూడా రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటింపబడుతుందని యేసు చెప్పడం అపొస్తలులను బహుశా ఆశ్చర్యపరచి ఉండవచ్చు. (మత్త. 24:3-14) ఆ ఉత్తేజకరమైన ప్రవచనం నేడు గమనార్హమైనరీతిలో నెరవేరడాన్ని మనం చూస్తున్నాం. మనం అపాయకరమైన కాలాల్లో జీవిస్తున్నప్పటికీ, యెహోవాసాక్షులు సువార్తను ఆసక్తితో ప్రకటిస్తున్నారు. లోకంలో ప్రజల ప్రేమ చల్లారుతుండగా, మన ప్రేమ మాత్రం నానాటికీ పెరుగుతోంది. మనల్ని “అన్ని జనాంగాలు” ద్వేషిస్తున్నా, దాదాపు ప్రతీ జనాంగానికి మనం ప్రకటిస్తున్నాం.

3 ఇందులోని 3 నుండి 6 పేజీల్లో ఇవ్వబడిన చార్టునుబట్టి, గత సేవా సంవత్సరంలో యెహోవాసాక్షుల కార్యకలాపాలను సమీక్షించడం ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందో కదా! ఇప్పటికి 16 సంవత్సరాల నుండి ప్రచారపనిలో, శిష్యులను చేసే పనిలో వందకోట్లకన్నా ఎక్కువ గంటలు వెచ్చింపబడుతున్నాయి. యెహోవాసాక్షుల దృఢమైన విశ్వాసానికి అది ఎంత గొప్ప నిదర్శనమో కదా! పయినీరు సంఖ్యలో 5.8 శాతం, ప్రచారకుల్లో 3.1 శాతం, బైబిలు అధ్యయనాల్లో 4.4 శాతం అభివృద్ధి ఉంది. గత సేవా సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం బాప్తిస్మం తీసుకున్నవారి సంఖ్య 20.1 శాతం పెరిగింది. చరిత్రలోనే మొదటిసారిగా నేడు ఇంతమంది అంటే దాదాపు డెబ్భై లక్షలమంది యెహోవాను నమ్మకంతో సేవించడం చూడడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు చార్టును పరిశీలిస్తున్నప్పుడు ఏది మిమ్మల్ని ఎక్కువగా ప్రోత్సహించింది?

4 గణాంక వివరాలు ఉత్తేజపరిచేవిగా ఉన్నా, తమ విశ్వాసాన్ని నిరూపించుకున్న ప్రజలే ఆ అభివృద్ధికి కారణమని మనం ఎప్పటికీ మరిచిపోకూడదు. ఒక ఉదాహరణ పరిశీలించండి. 1935లో జన్మించిన గిల్యెర్మో బొలీవియాలో పెరిగాడు. ఆయన తన తొమ్మిదవ ఏటనుండే పొగాకు పండించే తోటలో పనిచేయడం ప్రారంభించాడు. కష్టమైన శారీరక పనినుండి ఉపశమనం పొందడం కోసం చిన్నతనం నుండే పొగాకును నములుతుండేవాడు. చివరకు ఆయన తాగుబోతయ్యాడు, సిగరెట్టుకు అలవాటుపడిపోయాడు. అయితే ఆయన, యెహోవా తననుండి ఏమి కోరుతున్నాడో నేర్చుకోవడం ప్రారంభించినప్పటి నుండి సిగరెట్టు త్రాగడం, మద్యాన్ని అతిగా సేవించడం మానేశాడు. తనకు పొగాకు నమిలే అలవాటు ఎప్పటినుండో ఉంది కాబట్టి దానిని మానుకోవడం ఆయనకు చాలా కష్టమనిపించింది. అయినా ఆయన పట్టుదలతో ప్రార్థించడం వల్ల తన అలవాటును మానుకోగలిగాడు. ఆయన తన చెడు అలవాట్లను విడిచిపెట్టి బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయనిలా చెబుతున్నాడు: “ఇప్పుడు నేను పవిత్రంగా, చాలా సంతోషంగా ఉన్నాను.”

5 యెహోవా ప్రజలపట్ల నిజంగా శ్రద్ధ కలిగివున్నాడు. అందరూ మారుమనసు పొందాలన్నదే ఆయన కోరిక. (2 పేతు. 3:9) మన కోరిక కూడా అదే. మనలాగే యథార్థ హృదయులు యెహోవాను తెలుసుకొని, ఆయనను ప్రేమించేలా వారికి సహాయం చేయడానికి మనం శాయశక్తులా ప్రయత్నించేలా మన హృదయాలు మనల్ని ప్రేరేపించును గాక!

[అధ్యయన ప్రశ్నలు]

1. కలవరపరిచే ఏ సంఘటనల గురించి యేసు ప్రవచించాడు?

2. ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటింపబడడం ఎందుకు గమనార్హమైన విషయం?

3. ప్రపంచవ్యాప్త నివేదికలో ఏ ప్రోత్సాహకరమైన అభివృద్ధిని మీరు గమనించారు?

4. బాప్తిస్మం తీసుకోవాలనే ప్రయత్నంలో ఒక వ్యక్తి ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు?

5. మీరేమి కోరుకుంటున్నారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి