దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
పరిచర్య పాఠశాలలో, 2007 అక్టోబరు 29వ తేదీతో ప్రారంభమయ్యే వారంలో ఈ క్రింది ప్రశ్నలు మౌఖికంగా పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2007 సెప్టెంబరు 3 నుండి 2007 అక్టోబరు 29 మధ్య వారాల్లోని నియామకాల సమాచారంపై 30 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు.
ప్రసంగ లక్షణాలు
1. మళ్ళీ చెప్పడం అనేది ప్రాముఖ్యమైన బోధనాపద్ధతి అని ఎందుకు చెప్పవచ్చు? [be 206వ పేజీ, 1-2 పేరాలు, బాక్సు]
2. ప్రసంగపు చర్చాంశాన్ని మనం ఏ యే మార్గాల్లో నొక్కిచెప్పవచ్చు? [be 210వ పేజీ, బాక్సు]
3. ప్రసంగంలోని ముఖ్యాంశాలు అంటే ఏమిటి, మనం వేటి ఆధారంగా వాటిని ఎంపిక చేసుకోవాలి? [be 212వ పేజీ, 1-3 పేరాలు]
4. మన ప్రసంగంలో మరీ ఎక్కువ ముఖ్యాంశాలను ఎందుకు ఉంచుకోకూడదు? [be 213వ పేజీ, 3–5 పేరాలు]
5. మన ఉపోద్ఘాతం ఆసక్తిని రేకెత్తించేదిగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం, దానిని ఎలా చేయవచ్చు? [be 215వ పేజీ, 1వ పేరా; 216వ పేజీ, 1-3 పేరాలు, బాక్సు]
ఒకటవ నియామకం
6. మనం దేవుని వాక్యంపై ఆధారపడవచ్చని అర్థం చేసుకోవడానికి కీర్తన 119:89, 90 వచనాలు ఎలా సహాయం చేస్తున్నాయి? [w05 4/15 15వ పేజీ, 3వ పేరా]
7. యెహెజ్కేలు పుస్తకం ఏ విషయాన్ని నొక్కిచెబుతుంది, ఇప్పుడు తమ జీవితాల్లో యెహోవాను పరిశుద్ధపరిచేవారందరికీ ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? [bsi07 8వ పేజీ, 33వ పేరా]
8. “యెహోవా వాక్కు” మీ హృదయాన్ని ఎలా కాపాడగలదు? (కీర్త. 18:30) [w05 9/1 30వ పేజీ, 2వ పేరా]
9. దానియేలు పుస్తకమంతటా రాజ్య నిరీక్షణ ఎలా నొక్కిచెప్పబడింది? [bsi07 10వ పేజీ, 23వ పేరా]
10. హోషేయ పుస్తకం, యెహోవా ప్రేరేపిత ప్రవచనాల్లో మన విశ్వాసాన్ని ఎలా బలపరుస్తుంది? [bsi07 12వ పేజీ, 14వ పేరా]
వారపు బైబిలు పఠనం
11. యెహెజ్కేలు దర్శనంలో, దేవాలయాన్ని కొలవడం దేనిని సూచిస్తుంది, ఇది నేడు మనకెలాంటి హామీనిస్తోంది? (యెహె. 40:2-5) [w99 3/1 9వ పేజీ, 6వ పేరా; 14వ పేజీ, 7వ పేరా]
12. యెహెజ్కేలు దర్శనంలోని చివరి నెరవేర్పులో ఎవరు ‘అధిపతిగా’ ఉంటారు? (యెహె. 48:21) [w99 3/1 16వ పేజీ, 13-15 పేరాలు; 22-23 పేజీలు, 19-20 పేరాలు]
13. దానియేలు 2:21వ వచనం అర్థమేమిటి? [w98 9/15 12వ పేజీ, 9వ పేరా]
14. దానియేలును యెహోవా దృష్టిలో ‘బహు ప్రియునిగా’ చేసినదేమిటి? (దాని. 9:23) [dp 185వ పేజీ, 12వ పేరా; w04 8/1 12వ పేజీ, 17వ పేరా]
15. ఏ భావంలో “దేవునిగూర్చిన జ్ఞానము” ఇశ్రాయేలు దేశంలో లేదు, ఆ మాటలను వ్యక్తిగతంగా మనమెలా దృష్టించాలి? (హోషే. 4:1, 2, 6) [w05 11/15 21వ పేజీ, 21వ పేరా; jd 57-8 పేజీలు, 5వ పేరా; 61వ పేజీ, 10వ పేరా]