ప్రశ్నా భాగం
◼ సంఘానికి సహాయం అందించడానికి యార్డ్ సేల్‌ను (కానుకగా వచ్చిన వస్తువులను అమ్మి డబ్బు సేకరించడం) లేదా నిధులను సమకూర్చడం లాంటివి చేయడం సరైనదేనా?
నిధులు సమకూర్చడం కోసం విందులను, అమ్మకాలను లేదా ఉత్సవాలను ఏర్పాటు చేయడం మత సంస్థలకు మామూలే. అయితే ఇలా చేయడం మంచి కారణానికేనని కొంతమంది అనుకున్నా, అవి వివిధ రకాలైన చందా సేకరణల క్రిందికే వస్తాయి. యెహోవాసాక్షులు ఆ విధంగా ఆర్థిక సహాయాన్ని పొందరు.
కావలికోట, ఆగస్టు 1879 రెండవ సంచిక, చర్చీలను అనుకరిస్తూ విరాళాల సేకరణను నిరాకరించడం గురించి ఇలా చెప్పింది: “‘జాయన్స్ వాచ్‌టవర్’ పత్రికకు మూలకర్త యెహోవా అని మేము నమ్ముతున్నాము, అందుచేత మద్దతుకొరకు ఇది మనుష్యులను యాచించదు, అర్థించదు. ‘పర్వతాల వెండి, బంగారాలన్నీ నావేగదా అని’ చెబుతున్నవాడు దానికి అవసరమైన ఆర్థికసహాయం అందించకపోతే, పత్రికను నిలిపేయవలసిన సమయం వచ్చిందని మేము అనుకుంటాం.”
“సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను” అనే లేఖన సూత్రాన్ని మనము అనుసరించడంలో కొనసాగుతాము. (2 కొరిం. 9:7) చందా పెట్టెలు రాజ్యమందిరంలో ఉంచబడతాయి, స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని ఇష్టపడేవారు వాటిలో వేయవచ్చు. (2 రాజు. 12:9) అర్థించడంద్వారా విరాళాలు సేకరించబడవు, ఏదైనా తిరిగి పొందాలనే ఉద్దేశంతో అవి ఇవ్వబడవు.