కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/06 పేజీ 3
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2006
మన రాజ్య పరిచర్య—2006
km 3/06 పేజీ 3

ప్రకటనలు

◼ సాహిత్య ప్రతిపాదనలు మార్చిలో: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకాన్ని అందించాలి. బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ప్రత్యేకంగా కృషి చేయండి. ఈ పుస్తకంతోపాటు మీరు బైబిలు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడతారా? కరపత్రాన్ని అందించండి. ఏప్రిల్‌, మేలలో: కావలికోట, తేజరిల్లు! విడి పత్రికలు అందించండి. ఆసక్తిగలవారిని పునర్దర్శించేటప్పుడు లేదా జ్ఞాపకార్థ ఆచరణకు లేదా సంఘంలోని ఇతర ప్రత్యేక సంఘటనలకు హాజరవుతూ సంఘంతో మాత్రం క్రియాశీలంగా సహవసించని వారిని సందర్శిస్తున్నప్పుడు, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది అనే క్రొత్త పుస్తకాన్ని ప్రతిపాదించడంపై దృష్టి నిలపండి. వారితో బైబిలు అధ్యయనం ఆరంభించే లక్ష్యంతో ఆ పుస్తకాన్ని ప్రతిపాదించండి. జూన్‌: గొప్ప బోధకుడి నుంచి నేర్చుకోండి (ఆంగ్లం) పుస్తకం అందించండి. ఈ ప్రచురణ గృహస్థుని భాషలో అందుబాటులో లేకపోతే, జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషి లేదా నా బైబిలు కథల పుస్తకము అందించండి.

◼ ఏప్రిల్‌లో ఐదు పూర్తి వారాంతాలు ఉన్నాయి కాబట్టి సహాయ పయినీరు సేవ చేయడానికి అది ఎంతో అనుకూలమైన నెల.

◼ జ్ఞాపకార్థ ఆచరణ 2006, ఏప్రిల్‌ 12న, బుధవారంనాడు నిర్వహించబడుతుంది. మీకు సాధారణంగా బుధవారం సంఘకూటాలు ఉంటే, వాటిని రాజ్యమందిరాన్ని ఉపయోగించుకోగల మరో రోజుకు మార్చుకోవలసి ఉంటుంది. అది సాధ్యంకాక సేవా కూటం నిర్వహించలేకపోతే, మీ సంఘానికి ప్రత్యేకంగా అన్వయించే భాగాలను వేరేరోజున జరిగే సేవా కూటంలో చేర్చవచ్చు.

◼ పెద్దలు, జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించిన సమాచారం అంటే తేదీ, సమయం, స్థలం గురించిన వివరాలు ఆహ్వాన ప్రతిపై చక్కగా స్టాంపు వేయబడేలా, లేదా జతచేయబడేలా చూడాలి. ఆ స్టాంపు సిరా ప్రతికి అవతలివైపు కనబడకుండా, ప్రతి మురికి అవకుండా జాగ్రత్తపడాలి.

◼ కావలికోట, తేజరిల్లు! పత్రికల తాజా సంచికలు సంఘాలకు అందిన వెంటనే వాటిని ప్రచారకులకు ఇవ్వాలి. దానివల్ల, క్షేత్రసేవలో అందించడానికి ముందే, ప్రచారకులు వాటిలో ఉన్న విషయాలతో సుపరిచితులయ్యే అవకాశం ఉంటుంది. మన రాజ్య పరిచర్య కూడా అందిన వెంటనే అందరికీ ఇవ్వాలి. వాటిని సంఘ పుస్తక పఠన ఏర్పాటు ద్వారా ప్రచారకులకు అందించవచ్చు.

◼ నోవహు—ఆయన దేవునితోకూడ నడిచాడు (ఆంగ్లం) అనే వీడియోకు సంబంధించి చర్చ, మే నెలలోని సేవా కూటంలో జరగనుంది. ఒకవేళ ఆ డీవీడీ కాపీలు అవసరమైతే సంఘం ద్వారా సాధ్యమైనంత త్వరగా రిక్వెస్టు చేయాలి.

◼ బ్రాంచి కార్యాలయం ప్రచారకుల వ్యక్తిగత సాహిత్య రిక్వెస్ట్‌లను సరఫరా చేయదు. స్వంత సాహిత్యాలు కావాలనుకునే వారందరూ సాహిత్యాలను నిర్వహించే సహోదరునికి తమకు కావల్సిన వాటిని తెలియజేసేందుకు వీలుగా సంఘ పైవిచారణకర్త ప్రతీనెల సాహిత్యపు రిక్వెస్ట్‌ను బ్రాంచి కార్యాలయానికి పంపించే ముందు సంఘంలో ప్రకటన చేయబడేలా ఏర్పాటు చేయాలి. ఏ సాహిత్యాలకు ప్రత్యేక రిక్వెస్ట్‌ను పంపాలో గుర్తుంచుకోండి.

◼ మళ్ళీ లభ్యమవుతున్న ప్రచురణలు:

మృతుల ఆత్మలు—అవి మీకు సహాయపడగలవా లేక హాని తలపెట్టగలవా? అవి నిజంగా ఉనికిలో ఉన్నాయా? ​—⁠ఆంగ్లం

◼ ఆంగ్లంలో మళ్ళీ లభ్యమవుతున్న పరిశోధనా ప్రచురణలు:

“లేఖనములన్నీ దైవప్రేరేపితమును, ప్రయోజనకరమునై ఉన్నవి”

లేఖనములపై అంతర్దృష్టి

పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము​—రెఫరెన్సులతో (Rbi8)

లేఖనాలనుండి తర్కించడం

వాచ్‌టవర్‌ పబ్లికేషన్‌ ఇండెక్స్‌ 1986-2000

ఈ ప్రచురణలన్నీ ప్రత్యేకంగా రిక్వెస్టు చేసే సాహిత్యాలని దయచేసి గుర్తుంచుకోండి. ప్రచారకులు నిర్దిష్ట రిక్వెస్టులు చేసినప్పుడే వీటి కోసం ఆర్డరు చేయాలి. సేవా కమిటీలోని వారు ఆ ప్రచురణల కోసం అడిగినవారిని కలుసుకొని వారికి నిజంగా అవసరమో లేదో తెలుసుకోవాలి. సొసైటీకి రిక్వెస్టు పంపించే ముందు లిటరేచర్‌ రిక్వెస్ట్‌ ఫారమ్‌తోపాటు ఆ రిక్వెస్టులను తెలిపే ఉత్తరాన్ని జతచేయాలి. అలా కారణాలు వ్రాయబడని రిక్వెస్టులను పరిగణించడం జరగకపోవచ్చు.

◼ క్రొత్తగా లభ్యమవుతున్న ఆడియో కాంపాక్ట్‌ డిస్కులు:

మన ఆధ్యాత్మిక వారసత్వంపట్ల మెప్పుదల (సీడీఓహెచ్‌)​—తమిళం

మన కాలానికి హెచ్చరికా మాదిరులు (సీడీడబ్ల్యుఎక్స్‌)​—తమిళం, మలయాళం, హిందీ

దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు (సీడీఆర్‌క్యూ)​—తమిళం

◼ అమెరికన్‌ సంజ్ఞా భాషలో క్రొత్తగా లభ్యమవుతున్న డీవీడీలు:

నిత్యజీవానికి నడిపించే జ్ఞానము (డీవీకెఎల్‌-ఎఎస్‌ఎల్‌)

బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? (డీవీబిహెచ్‌-ఎఎస్‌ఎల్‌)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి